బంగాళదుంప

బంగాళాదుంప గజ్జి తెగులు

Streptomyces scabies

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • మొక్కల పైభాగాల్లో ఎటువంటి లక్షణాలు కనబడవు.
  • గోధుమరంగు కార్క్ వంటి బుడిపెలు బంగాళాదుంప పైన కనిపిస్తాయి.
  • లోతైన రంధ్రాలు మరియు జాలీ వంటి పగుళ్లు బంగాళాదుంపపై కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

మొక్కల పైభాగాల్లో, ముఖ్యంగా ఆకులు లేదా కొమ్మలపై, ఎటువంటి లక్షణాలు కనిపించవు . కానీ ఇది బంగాళాదుంప చర్మంపై దాడి చేస్తుంది. గోధుమరంగు కార్క్ వంటి బుడిపెలు బంగాళాదుంప పైన కనిపిస్తాయి. లోతైన రంధ్రాలు మరియు జాలీ లాంటి పగుళ్లు బంగాళాదుంప చర్మంపై కనిపిస్తాయి. దీని వల్ల దిగుబడి లో నష్టాలు వస్తాయి మరియు బంగాళాదుంప నాణ్యత తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కంపోస్ట్, కంపోస్ట్ టీ లేదా రెండింటిని కలిపిన మిశ్రమం ఈ తెగులు తీవ్రతని తగ్గిస్తాయి. జీవసంబంధిత ఎరువులు దిగుమతి మరియు దుంపల నాణ్యతను పెంచుతాయి

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. దీనికి విరుద్ధంగా రసాయనాలు వాడడం కష్టం ఎందుకంటే ఇవి మొక్కలకు నష్టం కలుగచేస్తాయి. విత్తనాలను ఫ్లూఅజినామ్, ఆక్సీటెట్రాసైక్లిన్ మరియు స్ట్రప్టోమైసిన్, క్లోరోఠాలోల్ మరియు మాంకోజెబ్ తో చికిత్స చేయటం వల్ల వ్యాప్తిని తగ్గిస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఇది తెగులు సోకిన కణజాలాల్లో జీవిస్తుంది. ఇది మొక్కల్లోకి, వాటిపై వున్న దెబ్బల నుండి చేరుతాయి. పొడి మరియు వేడి వాతావరణాలు వీటి వ్యాప్తి కి సహకరిస్తాయి. బాక్టీరియాకు అధిక మొత్తం లో ఆక్సిజన్ అవసరం ఉండటం వల్ల విడిగా ఉన్న మట్టిలో తెగులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఈ బాక్టీరియా పొడి మరియు ఆల్కలీన్ మట్టిలో చురుకుగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తనాలను వాడాలి.
  • మంచి సమన్వయంతో పంటమార్పిడి చేయాలి.
  • భూమిలో తడిని నియంత్రణలో ఉంచాలి.
  • ఎక్కువ నీరు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • సరైన ఎరువులు వాడి pH స్థాయిలు తక్కువ ఉండే లాగ చూడాలి.
  • ఉదాహరణకు సల్ఫర్, జిప్సం లేదా అమోనియా సల్ఫేటునుమట్టి యొక్క pH స్థాయిని తగ్గించడానికి మరియు తెగులు తీవ్రతను తగ్గించడానికి వాడొచ్చు.
  • మొక్కలు వేసేముందు పొలంలో సున్నం వేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి