ఆలివ్

ఆలివ్ నాట్

Pseudomonas savastanoi pv. savastanoi

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • కొమ్మలు, కాండం మరియు రెమ్మలపై ముడులు ఉంటాయి కానీ సాధారణంగా ఇవి ఎల్లప్పుడూ ఆకు కణుపుల వద్ద ఉండవు.
  • బెరడు యొక్క ఈ వైకల్యాలు అనేక సెంటీమీటర్ల పరిమాణం వరకు చేరతాయి.
  • మొక్కల సత్తువ తగ్గుతుంది మరియు ఎదుగుదల కుంటుపడుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

వసంత ఋతువు మరియు వేసవిలో కొమ్మలు, రెమ్మలు, కాండం మరియు వేర్లపై ముడులు కనిపించడం ఈ వ్యాధి యొక్క ప్రధాన కనిపించే లక్షణం. కొమ్మలు, కాండం మరియు రెమ్మలపై ముడులు ఏర్పడతాయి కానీ సాధారణంగా ఇవి ఎల్లప్పుడూ ఆకు కణుపులు లేదా పండ్ల కాండం వద్ద ఏర్పడవు. బెరడు యొక్క ఈ ముడులు అనేక సెంటీమీటర్ల వ్యాసం వరకు పెరుగుతాయి మరియు అప్పుడప్పుడు ఆకులు లేదా మొగ్గలపై కూడా పెరుగుతాయి. కాండం పైనుండి కిందివరకు చనిపోవచ్చు, ఎందుకంటే కణజాలాలకు పోషకాలను మరియు నీటి రవాణాను బుడిపెలు నిలిపివేస్తాయి. సాధారణంగా, వ్యాధి సోకిన చెట్లు తక్కువ సత్తువను కలిగి ఉంటాయి మరియు మొక్క ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ ముడులు పెరిగేకొద్దీ, అవి దెబ్బతిన్న కొమ్మలను గట్టిగా చుట్టుముట్టి చంపుతాయి, ఫలితంగా పండ్ల పరిమాణం మరియు నాణ్యత తగ్గుతుంది లేదా కొత్తగా నాటిన తోటల విషయంలో చెట్టు చనిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సంవత్సరానికి రెండు సార్లు (శరదృతువు మరియు వసంతకాలం)సేంద్రియ, రాగి ఆధారిత ఉత్పత్తుల వ్యాధి నివారణ బాక్టీరిసైడ్ల పిచికారీ చెట్లపై ముడులు ఏర్పడటాన్ని బాగా తగ్గించాయి. వ్యాధి సంభావ్యతను తగ్గించడానికి కత్తిరింపు గాయాలను కూడా బాక్టీరిసైడ్లను కలిగి ఉన్న రాగితో (ఉదాహరణకు బోర్డియక్స్ మిశ్రమం) చికిత్స చేయాలి. సర్టిఫై చేయబడిన సేంద్రీయ వ్యవసాయంలో కాపర్ సల్ఫేట్ కలిగిన కొన్ని ఉత్పత్తులు కూడా అనుమతించబడతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఈ బాక్టీరియం ని నియంత్రించడం చాలా కష్టం. సంవత్సరానికి రెండు సార్లు (శరదృతువు మరియు వసంతకాలం)రాగి ఆధారిత ఉత్పత్తుల (మాంకోజెబ్‌తో కలిపి) వ్యాధి నివారణ బాక్టీరిసైడ్ల పిచికారీ తోటలలో వ్యాధి సంభవనీయతను బాగా తగ్గించాయి. వ్యాధి సంభావ్యతను తగ్గించడానికి కత్తిరింపు గాయాలను కూడా బాక్టీరిసైడ్లను కలిగి ఉన్న రాగితో చికిత్స చేయాలి. యాంత్రిక పద్ధతిలో పంట కోత చేసిన చెట్లకు పంట కోసిన వెంటనే చికిత్స చేయాలి.

దీనికి కారణమేమిటి?

సూడోమోనాస్ సవస్తనోయి జాతికి చెందిన ఒక రకమైన బాక్టీరియం వల్ల లక్షణాలు కలుగుతాయి. ఈ బాక్టీరియం ఆలివ్ చెట్ల ఆకులపై కాకుండా చెట్టు బెరడుపై వృద్ధి చెందుతుంది. రకాన్ని బట్టి ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత మారుతూ ఉంటుంది, అయితే పెద్ద చెట్లకంటే ఎక్కువగా చిన్న ఆలివ్ చెట్లు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముడుల్లో ఈ బాక్టీరియా జీవించి ఉంటుంది. బాక్టీరియా నాట్స్‌లో జీవించి ఉంటుంది మరియు వర్షం కురిసినప్పుడు ఇన్ఫెక్షన్ బాక్టీరియా స్రావంలో భాగంగా విసర్జించబడుతుంది. ఇది వర్షపు తుంపర్ల ద్వారా లేదా యాంత్రికంగా ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తుంది. ఆకు మచ్చలు, బెరడు పగుళ్లు, కత్తిరింపు లేదా పంట గాయాలు దీని వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. శీతాకాలంలో గడ్డ కట్టడం వలన కలిగే నష్టం ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా వర్షం కురిసే సమయంలోనే ఇలా గడ్డకట్టడం జరుగుతుంది, ఇది అంటువ్యాధులు వృద్ధిచెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత బుడిపెలు 10 రోజుల నుండి చాలా నెలల వరకు ఒక్కొక్కటిగా లేదా వరుసలలో కనిపిస్తాయి


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోండి.
  • పొడి సీజన్లో బుడిపెలతో ప్రభావితమైన కొమ్మలను కత్తిరించండి.
  • ఆకులు తడిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా పంట కోత సమయంలో తోటలలో పని చేయడం మానుకోండి.
  • వర్షం వచ్చే అవకాశం ఉన్నపుడు వీలైతే, పంటను కోయకండి.
  • శుభ్రపరచిన కత్తెరలు మరియు పరికరాలతో పని చేయండి మరియు పని చేస్తున్నప్పుడు వాటిని క్రమం తప్పకుండా క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి