చిక్కుడు

సోయాబీన్ లో బాక్టీరియల్ ఎండు తెగులు

Pseudomonas savastanoi pv. glycinea

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న చిన్న పసుపు రంగు నుండి గోధుమ రంగు చుక్కలు ఆకులపైన ఏర్పడతాయి.
  • తరువాత ఇవి ఒక సక్రమంగా లేని లేదా వివిధ పరిమాణాల్లో వున్న కోణాకారపు ముదురు గోధుమ రంగులోకి మారతాయి.
  • ఒక పసుపు పచ్చ రంగు వలయం ఈ మచ్చల చుట్టూ ఏర్పడుతుంది.
  • కాయలపైన మచ్చలు ఏర్పడతాయి కానీ విత్తనాలపైన ఎటువంటి లక్షణాలు కనిపించవు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చిక్కుడు

లక్షణాలు

సీజన్లో ముందుగా వచ్చిన తెగుళ్ల వలన మొలకలకు ముందుగా వచ్చిన ఆకుల అంచుల పైన గోధుమ రంగు చుక్కలు ఏర్పడడం ఈ తెగులు ముఖ్య లక్షణం. లేత మొక్కలలో ఎదుగుదల మందగించి ఎదిగే పాయింట్లు ప్రభావితమైతే మొక్కలు చనిపోతాయి. సీజన్లో తరువాతి దశలలో ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపైన చిన్న చిన్న పసుపు నుండి గోధుమ రంగు చుక్కలు వృద్ధి చెందుతాయి. లేత ఆకులు దీని ప్రభావానికి తేలికగా గురవుతాయి. ఈ లక్షణాలు మొక్కల మధ్య భాగం మరియు పైభాగంలో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. సమయం గడిచే కొద్దీ ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలసిపోయి వివిధ పరిమాణాలలో ముదురు గోధుమ రంగు కోణాకారపు మచ్చలుగా ఏర్పడతాయి. ఈ నీటిలో తడిచినట్టు వున్న మచ్చల చుట్టూ ఒక పసుపు పచ్చ రంగు వలయాలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్య భాగం ఎండిపోయి రాలిపోతుంది. దీనివలన ఆకులు చిరిగిపోయినట్టు కనపడతాయి. కాయలు ఏర్పడే సమయంలో ఈ తెగులు సోకితే ఈ మచ్చలు కాయలపైన కూడా ఏర్పడతాయి. దీనివలన కాయలు ముడుతలు పడి రంగు కోల్పోతాయి. కానీ లోపల గింజలు మాత్రం ఈ లక్షణాలను కనపరచవు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాక్టీరియల్ ఎండు తెగులును నియంత్రించడానికి కాపర్ శీలింద్ర నాశినుల వాడకం సిఫార్స్ చేయబడినది. ఈ మందులు పూర్తి స్థాయిలో ప్రభావం చూపడానికి, ఈ తెగులు సంక్రమించిన తొలి దశల్లో ఈ తెగులు లక్షణాలు కనపడిన వెంటనే వీటిని వాడాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాపర్ శీలింద్ర నాశినులను ఈ తెగులు నియంత్రణకు ఉపయోగించవచ్చు. కానీ వీటిని తెగులు సంక్రమించిన తొలి దశలలో వాడాలి. ఈ తెగులు పైన శీలింద్ర నాశినుల ప్రభావం తక్కువగా ఉంటుంది కావున ముఖ్యమైన సమీకృత తెగులు నియంత్రణ పద్ధతులు సిఫార్స్ చేయబడతాయి.

దీనికి కారణమేమిటి?

ఈ బాక్టీరియల్ ఎండు తెగులు బాక్టీరియమ్ స్యుడోమోనాస్ సవస్టనోయ్ అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది విత్తనాల ద్వారా సంక్రమిస్తుంది. పంట లేని సమయంలో ఇది మొక్కల అవశేషాలపై జీవించి ఉంటుంది. మొలకల దశలో విత్తనాలు కలుషితం కావడం వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. గాలి ద్వారా లేదా మొక్కల క్రింది భాగంలో ఆకుల పైన నీటి చుక్కలు పడడం ద్వారా ఈ బాక్టీరియా వ్యాపించడం వలన పెద్ద మొక్కలలో ఈ తెగులు సంక్రమిస్తుంది. తడిగా వున్న ఆకులు ఈ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తాయి. ఏదో ఒక సమయంలో ఆకులకు వున్న సూక్ష్మ రంధ్రాల ద్వారా ఈ సూక్ష్మ జీవులు కణజాలంలోకి ప్రవేశిస్తాయి. వర్షం మరియు గాలి ద్వారా కూడా మొక్కలలో మరియు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తాయి. చల్లని వాతావరణం (20-25°C), తడి మరియు గాలులతో కూడిన వాతావరణం( వర్షపు తుఫానులు) ఈ తెగులుకు అనుకూలంగా ఉంటే వెచ్చటి మరియు పొడి వాతావరణం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధకత కలిగిన రకాలను ఉపయోగించండి.
  • ఈ తెగులు విస్తరించకుండా ఉండడానికి మొక్కలు తడిగా వున్నప్పుడు పొలంలో పని చేయకండి.
  • తరువాత సీజన్లో ఈ తెగులు పంటకు సంక్రమించకుండా ఉండడానికి పంట కోతల తర్వాత పొలాన్ని బాగా లోతుగా దున్ని పంట అవశేషాలను పూడ్చిపెట్టండి.
  • ఈ తెగులు సోకని పంటలైన మొక్కజొన్న , గోధుమ మరియు చిక్కుడు జాతి రకానికి చెందని ఇతర మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి