మినుములు మరియు పెసలు

బాక్టీరియా ఆకు ఎండు తెగులు

Xanthomonas axonopodis pv. phaseoli

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • పసుపుపచ్చ రంగులో చిన్న చిన్న నీటితో నిండిన మచ్చలు ఆకు అంచులలో ఏర్పడతాయి.
  • అవి పొడిగా గోధుమరంగు నిర్జీవమైన మచ్చలుగా మారిపోతాయి.
  • తెగులు తర్వాత దశలో ఆకులు రాలిపోతాయి.
  • కాండంమీద ఎరుపు మరియు పసుపురంగు చారలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


మినుములు మరియు పెసలు

లక్షణాలు

ఈ తెగులు మొక్కలకు ఏ దశలోనైన వ్యాపించవచ్చు. మొక్కల వయసును బట్టి తెగులు లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ తెగులు వలన మొక్కల ఆకులపై చిన్నగా, ఎర్రగా, పసుపు వర్ణంలో మచ్చలు ఏర్పడుతాయి. పగటి సమయంలో మొక్కలు వాలిపోతున్నట్టు అయిపోతాయి. ఈ తెగులు మొక్కల ఎదిగే దశలో సోకుతుంది. ఆకులపైన చిన్న నీరునిండిన నిమ్మపసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. కొన్నాళ్లకు ఇవి గోధుమరంగు లోకి మారి నిర్జీవంగా మారతాయి. దానితో పంట కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనివలన ఆకులు రాలిపోవచ్చు.తెగులుసోకిన మొక్కలు మరుగుజ్జులవలె మారి ఎరుపు-గోధుమరంగు లేదా ఇటుకరంగు - ఎరుపు రంగులోకి మారతాయి. తక్కువమొత్తంలో వరి కంకులు వేస్తాయి. కాండంపై ఎర్రని చారలు ఏర్పడతాయి. కాండం చిట్లిపోయి ఎర్రని ద్రవం వాటినుండి కారుతుంది. కంకులు వేసేసమయంలో ఈ తెగులు సోకినట్లైతే విత్తనాలు కృశించిపోయి కుళ్లిపోయినట్టుగా రంగుమారతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. క్సన్తోమోనస్ ఫసెలి తెగులుకు ప్రత్యామ్నాయ నివారణ మార్గం లేదు. ఈ తెగులును నివారించే ప్రత్యామ్నాయ మార్గాలు మీకు తెలిస్తే మమల్ని సంప్రదించండి. మీనుండి జవాబుకోసం మేము ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రసాయనాలను వాడడం వలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో ఈ బాక్టీరియా ఈ రసాయనాలకు నిరోధకతను పెంచుకుంటాయి. విత్తనాలు మరియు కంకుల తెగులు నివారణ కోసం ఒకవేళ మందు వాడవలసివస్తే కాపర్ కలిగిన అధీకృత యాంటీ బయాటిక్స్ ను వాడాలి

దీనికి కారణమేమిటి?

క్సన్తోమోనస్ ఫసెలి అనే బ్యాక్తీరియా మట్టిలో, పంట అవశేషాలలో మరియు విత్తనపుపై పొరపైన. ఇతర పరాన్నజీవులపైన చాలా సంవత్సరాలు జీవించి ఉంటుంది. వర్షాకాలం, తడి మరియు వెచ్చటి వాతావరణం, తేమ (25-35°C) ఈ తెగులు సోకడానికి అనువైన పరిస్థితులు. గాలివానలో మరియు వర్షం తుంపరలో ఇంకా మిడతలు బీన్ బీటిల్ లాంటి కీటకాలవలన ఇది విపరీతంగా వ్యాపిస్తుంది. మొక్కలలో సహజంగా ఏర్పడే గాయాలవలన కూడా ఈ తెగులు సోకుతుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మరియు శుద్ధి చేసిన విత్తనాల్ని మాత్రమే వాడాలి.
  • తెగులు నిరోధక వరివంగడాలు వాడాలి.
  • తెగులు సోకిందేమో తెలుసుకోవడానికి మీ పొలాల్ని తరచుగా గమనిస్తూ ఉండాలి.మీ ప్రాంతంలో సరైన సమయంలో నాట్లు నాటాలి.
  • పరికరాలను పనిముట్లను శుభ్రంగా ఉంచండి.
  • తెగులు సోకిన మొక్కలను నాశనం చేయండి లేదా తగలపెట్టండి.
  • స్ప్రింక్లర్ తో నీరు పెట్టడం మంచిది కాదు.
  • మొక్కజొన్న లాంటి సిఫార్సు చేసిన పంటలతో పంట మార్పిడి పద్ధతులు పాటించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి