మొక్కజొన్న

గోస్ విల్ట్

Clavibacter michiganensis

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా సరైన ఆకారంలో లేని అంచులతో కూడిన రాగి రంగు మచ్చలు కనిపిస్తాయి.
  • దీని వలన మెల్లమెల్లగా ఆకులు ఎండిపోతాయి.
  • మెరుస్తూ వుండే ఎండిపోయిన బ్యాక్టీరియా వ్యర్ధ పదార్ధాలు ఈ మచ్చలు మరియు నల్లని చిన్న చిన్న చుక్కల పైన కనిపిస్తాయి.
  • మొలకలు వాడి ఎండిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా సరైన ఆకారంలో లేని అంచులతో కూడిన రాగి రంగు మచ్చలు కనిపిస్తాయి. కొంత కాలానికి ఈ మచ్చలు ఆకులు ఎండిపోవడానికి దారి తీస్తాయి. తోట చాలా వరకు నాశనం అవుతుంది మరియు రెమ్మలు కుల్లుటకు సంకేతం కనబడుతుంది. ముదురు రంగుతో నీటిలో తడిచినట్టు వున్న మచ్చలు మొక్క కాండంపైన ఏర్పడతాయి. తరచుగా ఆకుల అంచులు నిర్జీవంగా మారతాయి. దీని వలన మెల్లమెల్లగా ఆకులు ఎండిపోతాయి. మెరుస్తూ వుండే ఎండిపోయిన బ్యాక్టీరియా వ్యర్ధ పదార్ధాలు ఈ మచ్చల పైన కనిపిస్తాయి. రెమ్మ ఇన్ఫెక్సన్ తో వున్న మొక్కలలో రెమ్మల మీద నారింజ రంగు నాళాల గుంపులు కనిపిస్తాయి. మొలకల దశలో ఈ తెగులు సంక్రమించినట్లైతే లేత మొక్కలు వాలిపోయి ఎండిపోయి అక్కడక్కడా చనిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్రస్తుతం సి. మిచిగానెసిస్ కు రసాయన నియంత్రణ విధానం అందుబాటులో లేదు. ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మాకు తెలపండి. సమర్థవంతమైన నియంత్రణ పద్దతులు మాత్రమే దీనిని నివారించగలవు

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతం సి. మిచిగానెసిస్ కు రసాయన నియంత్రణ విధానం అందుబాటులో లేదు. ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మాకు తెలపండి. సమర్థవంతమైన నియంత్రణ పద్దతులు మాత్రమే దీనిని నివారించగలవు

దీనికి కారణమేమిటి?

బ్యాక్టీరియం క్లావిబాక్టర్ మిచిగనెసిస్ వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. ఇది పంట కోతల తర్వాత కూడా పంట అవశేషాలపైన లేదా ఇతర అతిదులైన ఫాక్స్ టైల్, బర్న్ యార్డ్ గడ్డి మరియు షట్టర్ కేన్ వంటి మొక్కలపైన జీవించి ఉంటుంది. ఈ తెగులు సోకిన కణజాలం నుండి ఈ బ్యాక్టీరియా ఎదుగుతున్న మొక్కలకు వర్షం బిందువులు, పైనుండి పెట్టే నీరు గాలికి వలన తుంపర్లుగా మొక్కలపైన పడడం వలన ఇతర మొక్కలకు విస్తరిస్తుంది. సాధారణంగా ఈ తెగులు దెబ్బలు తగిలిన ఆకులకు సంక్రమిస్తుంది. ఉదాహరణకు గాలి, ఇసుక దుమారం మరియు తీవ్రమైన గాలులు. ఈ తెగులు మొక్కల అంతర్భాగాలకు సంక్రమించి ఆ తర్వాత ఇతర మొక్కలకు విస్తరిస్తుంది. వెచ్చని ఉష్ణోగ్రతలు (>25 °C) ఈ తెగులు విస్తరించడానికి దోహదం చేస్తుంది. పొత్తులకు పట్టు కుచ్చులు ఏర్పడినప్పుడు ఈ తెగులు లక్షణాలు బాగా అధికమవుతాయి. అనుమానాస్పదమైన హైబ్రీడ్ రకాలను నాటడం, పొలాన్ని సరిగ్గా దున్నక పోవడం మరియు ఒకే రకమైన పంటలను పండించడం ఈ తెగులు సంక్రమించడానికి ఒక ముఖ్యమైన కారణం.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే ( మార్కెట్లో చాలా రకాలు లభిస్తున్నాయి) వ్యాధి నిరోధక రకాలను వాడండి.ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • సాగు కొరకు ఉపయోగించే అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను పరిశుభ్రంగా వుంచండి.
  • మొక్కలకు వీలైనంత వరకు గాయాలు కాకుండా జాగ్రత్త తీసుకోండి.
  • కలియ దున్నడం ద్వారా మొక్క వ్యర్థాలను తొలగించండి.
  • మిగిలి పోయిన మొక్క జొన్న వ్యర్థాలు కుళ్ళుటకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి పంట మార్పిడి చేయండి.
  • వివిధ రకాలైన ప్రత్యామ్నాయ ఆవాసాలైన గ్రీన్ ఫాక్స్ టైల్, బార్న్ యార్డ్ గ్రాస్ మరియు షట్టర్ కేన్ వంటివి తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి