మొక్కజొన్న

మొక్కజొన్నలో బాక్టీరియల్ కాడ కుళ్ళు తెగులు (బ్యాక్టీరియల్ స్టాల్క్ రాట్)

Dickeya zeae

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు మరియు ఆకు పై తొడుగు తరువాత ఆకు కాడ రంగు మారిపోతుంది.
  • చెడువాసన వస్తుంది మరియు మొక్క యొక్క పైభాగాన్ని మిగిలిన మొక్క నుండి చాలా సులభంగా వేరుచేయవచ్చు.
  • కాండం లోపల పాలిపోవడం మరియు స్లిమీ రాట్ కలుగుతుంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

మొక్కజొన్నలో బాక్టీరియల్ కాడ కుళ్ళు తెగులు ఆకులు, ఆకు తొడిమ మరియు రెమ్మల యొక్క కణుపు దగ్గర పాలిపోవడం వంటి లక్షణాల ద్వారా కనబడుతుంది. ఈ తెగులు వేగంగా రెమ్మ వెంబడి మరియు ఇతర ఆకుల వరకు ప్రాకుతుంది. కణజాలాలు కుళ్ళడం వలన చెడువాసన వస్తుంది మరియు మొక్క పైభాగాన్ని మిగిలిన మొక్క నుండి చాలా సులభంగా వేరుచేయవచ్చు. కాండం పూర్తిగా కుళ్ళిపోయి చివరకు మొక్క పడిపోతుంది. కాండంలో నిలువుగా చీలిక లోపల పాలిపోవడం మరియు కణుపు వద్ద ఎక్కువగా వుండే సాఫ్ట్ స్లిమీ రాట్ కనపడుతుంది. అయితే సాధారణంగా బాక్టీరియా మొక్క నుండి మొక్కకు వ్యాప్తి చెందదు కనుక, తరచుగా ఈ తెగులు సోకిన మొక్కలు పొలంలో చెల్లా చెదురుగా కనబడుతాయి. కానీ కీటక వాహకాల వలన మొక్క నుండి మొక్కకు వ్యాప్తి చెందినట్లు కొన్నిసార్లు తెలుస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ క్రిసాంతెమి కు జీవరసాయన నియంత్రణలు లేవు. మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మాకు తెలపండి

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పుష్పించే దశకన్నా ముందు సాగు నీటికి క్లోరిన్ కలపడం ద్వారా లేదా నేలను బ్లీచింగ్ పౌడర్ (33% క్లోరిన్ @ 10 కిలోలు/హెక్టార్) ఈ తెగులును తగ్గించవచ్చు. కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిగిన మందులు ఈ తెగులును నివారించడానికి వాడవచ్చు. చివరగా ఒక హెక్టారుకు 80 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ ను రెండు వాయిదాలలో పొలంలో వేస్తే ఈ తెగులు లక్షణాలను తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

బాక్టీరియం ఎర్వీన క్రిసాంతెమి వలన ఈ లక్షణాలు ఏర్పడుతాయి, ఇవి నేల పైభాగాన వుండే కాడల వ్యర్థాలలో పంట కోతలు అయిన తర్వాత కూడా నివసిస్తాయి అయితే ఇవి అక్కడ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించలేవు. విత్తనాల ద్వారా బాక్టీరియం వ్యాప్తి చెందినట్టు ఆధారాలు లేవు. 32-35°C ఉష్ణోగ్రతలు మరియు అధిక గాలిలో తేమ ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తరచూ వర్షం పడడం మరియు తుంపర సేద్యంతో పైన నుండి పడే నీరు ఆకును చాలా సేపు తడిగా ఉంచుతుంది మరియు మొక్క లోపల నీటిని పేరుకు పోయేటట్లు చేస్తుంది. ఈ నీరు వేడెక్కి మొక్క కణజాలాన్ని నాశనం చేయగలదు. దానివలన చీలికలు ఏర్పడి దాని ద్వారా ఇన్ఫెక్షన్ మొదలు కావడం జరగవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు లేదా అధిక నీరు పెట్టిన మొక్కలలో మొదట మొక్క మొదలు దగ్గర లక్షణాలు అభివృద్ధి అవుతాయి. సాగు నీరు ఈ తెగులుకు ప్రధాన మూలం అని ఓకే నమ్మకం వుంది. ఈ తెగులు ఇతర కణుపులకు కూడా తెగులు సోకేలా చేయడానికి మొక్క వెంబడి వ్యాప్తి చెందినప్పటికీ కీటక వాహకం ద్వారా తప్పితే చుట్టుపక్కల వున్న మొక్కలకు ఇది వ్యాపించదు.


నివారణా చర్యలు

  • పొలంలో అధికంగా నీరు లేకుండా ఉండడానికి మంచి మురుగు నీటి వ్యవస్థ సిఫార్స్ చేయబడ్డాయి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో వుండే తెగులును తట్టుకునే రకాలను సాగుచేయండి.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • అధిక మోతాదులో నత్రజని వాడకాన్ని నిరోధించండి.
  • తెగులును తగ్గించడానికి అధిక మోతాదులో భాస్వరం, మరియు పొటాషియంలను పొలంలో సరైన మోతాదులో వాడండి.
  • ఉష్ణోగ్రత అధికంగా వుండే సమయాలల్లో నీటిని పెట్టవద్దు.
  • లేకుంటే నీరు మొక్క లోపల కాడకు చుట్టుకుపోతుంది.
  • మొక్కజొన్న విత్తనాలు వేసేముందు పచ్చ ఎరువును మట్టిలో వేయండి.
  • ఈ తెగులును నాశనం చేయడానికి పంట కోత తరవాత పంట వ్యర్థాలను పొలంలో కలియదున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి