మొక్కజొన్న

మొక్కజొన్నలో ఎదుగుదల తగ్గడం

Spiroplasma kunkelii

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు వాలిపోయి అంచులు పసుపు రంగులోనికి మారి తర్వాత ఆకు కొనలు ఎర్రబడడం దీని లక్షణాలు.
  • సన్నటి రంగు కోల్పోయిన మచ్చలు లేత ఆకుల మొదలు వద్ద ఏర్పడి తరువాత చారలుగా మారతాయి.
  • మొక్కల కణుపులు చాలా చిన్నగా ఉండి ఎక్కువ రెమ్మలతో గుబురుగా ఎదగకుండా మరుగుజ్జులవలే ఉండిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

S.కుంకెళ్లి తెగులు వలన మొట్టమొదటిగా ఆకులు వాలిపోయి మరియు అంచులు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. తరువాత ముదురు ఆకుల్లో కొన నుండి మొదలుపెట్టి ఆకు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన 2-4 రోజుల తర్వాత లేత ఆకుల పైన చిన్న చిన్న రంగు కోల్పోయిన మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఎదిగేకొద్దీ ఈ మచ్చలు కలిసిపోయి ఈనెల వెంబడి చారలుగా మారతాయి. ఈ తెగులు మొక్కల ప్రారంభ దశలలో సంక్రమిస్తే మొక్కల ఎదుగుదల చాలా తగ్గిపోతుంది. వంకర్లు తిరిగిన ఆకులు మరియు చాలా చిన్న కణుపులు ఏర్పడతాయి. అధికంగా రెమ్మలు మరియు పిలకలు వచ్చి చూడడానికి ఒక పొద లాగ కనిపిస్తాయి. కొన్ని సార్లు ఒకొక్క మొక్కపై ఆరు నుండి ఏడు వరకు ఇలా ఏర్పడతాయి. పొత్తులు చిన్నగా ఉండి గింజలు సరిగా ఏర్పడవు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ S. కుంకెళ్లి తెగులుకు ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. S. మేతర్జియం అనీసోప్లైస్, బెయువేరియా బస్సియానా, పెసిలోమైసిస్ ఫుమోసోరోసేయుస్ మరియు వెర్టీసెల్లుమ్ లేఖాన్ని వంటి కొన్ని జీవ కీటక నాశినులు కలిగివున్న పరాన్న జీవులను బాగా తీవ్రమైన తెగులు పరిస్థితులలో ఉపయోగించడం వలన ఫలితం ఉంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంత వరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి రసాయనిక పద్దతి అందుబాటులో లేదు. కీటక నాశినులను వాడి మిడతలను నియంత్రించడం సిఫార్స్ చేయబడలేదు. అందువలన మిడతలను మరియు మొక్కజొన్నలో ఎదుగుదల తగ్గడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధించడానికి నివారణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యం

దీనికి కారణమేమిటి?

మొక్కజొన్న రకాలు మరియు పొలం ఎత్తును బట్టి దీని లక్షణాలు ఉంటాయి. స్పైరోప్లాస్మా కుంకెళ్ళి అనే బ్యాక్తీరియా వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఈ బ్యాక్తీరియా ఒక్క మొక్కజొన్నను మాత్రమే ఆశిస్తుంది. పొలంలో పంట లేని సమయంలో చాలా రకాల మిడుతలు ఉదాహరణకు దాల్బ్లూస్ మైడిస్, D. ఎలిమినేటుస్ ఎక్సిటీయానుస్ ఎక్సిటోసుస్, గ్రామినెల్ల నిగ్రిఫిన్స్ మరియు స్తేరిల్లస్ బైకులర్ వంటి కీటకాలు ఈ బాక్టీరియాకు వాహకాలుగా ఉంటాయి. ఇవి వసంత కాలం ముందు మొక్కలను తినడం మొదలుపెట్టి ఈ సూక్ష్మ క్రిములను మొక్కలపైకి చేరవేస్తాయి. ఈ తెగులు సోకిన మూడు వారాల తర్వాత తెగులు లక్షణాలు బయటపడడం మొదలవుతుంది. వేసవికాలంలో ఈ మిడుతల జనాభా అధికంగా ఉండడం వలన ఈ తెగులు తీవ్రత కూడా చాలా అధికంగా ఉంటుంది. కానీ ఈ తెగులు వసంత ఋతువులో కూడా మొక్కజొన్నను ఆశిస్తుంది.


నివారణా చర్యలు

  • మిడతల జనాభాను నివారించడానికి పంటను ముందుగా వేయండి.
  • పంట లేని సమయంలో స్వయం ఉద్భవ మొక్కలను తొలగించండి.
  • కాంతిని ప్రతిబింబించే ప్లాస్టిక్ కవర్లను వుపయోగించి పెద్దమిడతలను తిప్పికొట్టండి.
  • కీటక నాశినులను తక్కువ మోతాదులలో వాడి పంటకు మేలు చేకూర్చే కీటకాలను సంరక్షించండి.
  • శీతాకాలంలో మొక్కజొన్న పంటను వేయకండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.( దీనివలన కీటకాల జీవిత చక్రం విచ్చిన్నం అవుతుంది).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి