పుచ్చకాయ

ఆస్టర్ ఎల్లోస్ ఫైటోప్లాస్మా

Phytoplasma asteris

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు ఈనెల మధ్య భాగంతో మొదలయ్యి తరువాత ఆకు అంతా కూడా అపారదర్శకంగా మారుతుంది.
  • పూలు వైకల్యం చెంది పచ్చరంగులోకి మారతాయి.
  • ఆకు లాంటి పూరేకులు వృద్ధి చెందడం మరియు పరాగసంపర్కం చెందని పూలు ఏర్పడతాయి.
  • మొత్తంమీద, మొక్కలు క్షీణించిన వేరు వ్యవస్థను కలిగి కుంగిపోయిన రూపాన్ని కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు

పుచ్చకాయ

లక్షణాలు

వీటి లక్షణాల పరిధి ఫైటోప్లాస్మా యొక్క జాతి, సంక్రమణ సమయంలో మొక్క వయస్సు, మొక్కల జాతులు, ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ కారకాలపై ఆధారపడి కొద్దిగా మారతాయి. ఈ లక్షణాలు కలుపు నివారిణుల వలన కలిగిన నష్టంలా పొరబడవచ్చు మరియు సాధారణంగా ఇది సిరలు అపారదర్శకంగా మారడంతో మొదలవుతుంది. ఆకు ఈనెల మధ్య భాగం నుండి మొదలయ్యి ఆకు ఈనెలు మీదుగా ఆకు అంతా కూడా అపారదర్శకంగా మారుతుంది. పూలు వైకల్యం చెంది పచ్చరంగులోకి మారతాయి. ఆకు లాంటి పూరేకులు వృద్ధి చెందడం మరియు పరాగసంపర్కం చెందని పూలు ఏర్పడతాయి. మొత్తంమీద, మొక్కలు క్షీణించిన వేరు వ్యవస్థను, కుంగిపోయిన రూపాన్ని కలిగి ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తీవ్రమైన ముట్టడిని నియంత్రించడానికి పరాన్నజీవి శిలీంధ్ర జాతులైన మెటార్జిజియం అనిసోప్లియా, బవేరియా బస్సియానా, పెసిలోమైసెస్ ఫుమోసోరోసియస్ మరియు వెర్టిసిలియం లెకాని వంటి జీవ కీటకనాశినులను వాడండి. అనాగ్రస్ అటోమాస్ వంటి పరాన్నజీవి కీటక జాతులను వీటి జీవ నియంత్రణ పద్ధతిలో ఉపయోగించండి. లేడీబగ్స్ మరియు లేస్ వింగ్స్ వంటి ప్రయోజనకరమైన కీటకాలు ఈ కీటకాల గుడ్డు మరియు లార్వా దశ వంటి రెండు దశల్లో వీటిని విపరీతంగా తింటాయి. కీటక సంహారిణి సబ్బులు కూడా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. లాంబ్డా-సైహలోథ్రిన్, డైమెథోయేట్ మరియు ఇండోక్సాకార్బ్ ఆధారిత పురుగు మందులు ఆకు మిదతలపై మంచి ప్రభావం చూపి పొలంలో తెగులు వ్యాప్తిని పరిమితం చేయడంలో సహాయపడతాయి.

దీనికి కారణమేమిటి?

ఫైటోప్లాస్మా ఆస్టెరిస్ అని పిలువబడే మొక్కల వాస్కులర్ కణజాలాల యొక్క బ్యాక్టీరియా పరాన్నజీవి వల్ల ఈ తెగులు లక్షణాలు సంభవిస్తాయి. ప్రధానంగా ఆకు మిడత వంటి కీటకా వాహకాల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు సంక్రమిస్తుంది. పొలంలో ఈ కీటకాల కదలికకు మరియు దాణాకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ ఫైటోప్లాస్మా యొక్క వ్యాప్తిని కూడా పెంచుతాయి. ఉదాహరణకు, గాలి, వర్షపాతం లేదా 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు వాటి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తాయి మరియు సంక్రమణ సమయాన్ని ఆలస్యం చేస్తాయి. మీ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు ఆకు మిడతలు తినే నమూనాలను కూడా బాగా ప్రభావితం చేస్తాయి. పరిస్థితులు వేడిగా ఉంటే, మొక్కలు తక్కువ పోషకాలు కలిగివుండి మిడతలకు ఆకర్షణీయంగా ఉండవు. వర్షపాతం సమృద్ధిగా ఉన్న సీజన్లలో మొక్కలు ఏపుగా పెరిగి మరింత ఆకర్షణీయంగా వుండి మిడతలకు ఆకర్షణీయంగా ఉంటాయి. శీతాకాలంలో నివాసం వుండే ప్రాంతానికి తిరిగి వెళ్లే వరకు వేసవి కాలమంతా ఇవి తింటూనే ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఆకు మిడత ముట్టడి మరియు వ్యాధి లక్షణాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ఫైటోప్లాస్మా యొక్క మూలాన్ని తొలగించి వ్యాప్తిని తగ్గించడానికి తెగులు సోకిన మొక్కలను తొలగించాలి.
  • ఆకుపచ్చ పురుగులను బాగా ఆకర్షించే పసుపు జిగురు వలలను ఉపయోగించండి.
  • లేడీబగ్స్, పరాన్నజీవి కందిరీగలు మరియు లేస్ వింగ్ వంటి ప్రయోజనకరమైన కీటకాలకు మంచి వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించండి.
  • శీతాకాలంలో ఈ ఆకు మిడతలు చలికాలాన్ని గడిపే కలుపు మొక్కలు, తిస్టిల్, డాండెలియన్ మరియు క్యారెట్ వంటి శాశ్వత ఆర్నమెంట్ మొక్కలపై జీవించి ఉండగలవు కనుక పొలంలో ఈ మొక్కలను నివారించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి