నిమ్మజాతి

నిమ్మ జాతి మొక్కలలో అగ్గి తెగులు

Pseudomonas syringae pv. syringae

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • నీటిలో నానినట్టు వుండే మచ్చలు ఆకు అంచులవద్ద ఆకు కాడల పైన కనపడతాయి.ఆకులు ఎండిపోయి ముడుచుకు పోతాయి కానీ ఇవి కొమ్మలకు అంటిపెట్టుకునే ఉంటాయి.
  • చిన్న చిన్న నల్లని మచ్చలు నారింజ పండ్లపైన ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

నీటిలో నానినట్టు వుండే మచ్చలు ఆకు అంచులవద్ద ఆకు కాడల పైన కనపడతాయి. తరువాత ఈ మచ్చలు ఆకు మధ్య ఈనెలకు మరియు రెమ్మలనుండి మొదలయ్యే ఆకు కాడ చుట్టూ విస్తరిస్తాయి. సాధారణంగా ఇవి రాలిపోతాయి. రెమ్మలపైన నిర్జీవ కణజాలం మరింత విస్తరించి కొమ్మలు 20 నుండి 30 రోజులలో చనిపోతాయి. నర్సరీలో వుండే మొక్కలు కొన్నిరోజులలోనే ఎండిపోయినట్లయిపోతాయి. ఈ తెగులు లక్షణాలు ఫైటోఫ్తోరా తెగులు లక్షణాలు సుమారుగా ఒకేవిధంగా ఉంటాయి. వెచ్చని పొడి వాతావరణం ప్రారంభమైనప్పుడు ఈ లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. దీని వలన ఆకులు ఎండిపోయి ముడుచుకు పోతాయి. కానీ ఇవి కొమ్మలకు అంటిపెట్టుకునే ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న నల్లని మచ్చలు నారింజ పండ్లపైన ఏర్పడతాయి. నారింజ, నిమ్మ మరియు కమల పండ్ల తోటలలో ఈ తెగులు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును నివారించడానికి మరియు నియంత్రిచడానికి ఇప్పటి వరకు ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. మీకు ఏమైనా తెలిసినట్లైతే దయచేసి మాకు తెలియచేయండి. బోర్డియక్స్ మిశ్రమం వంటి కాపర్ ఆధారిత ఫార్ములేషన్ల పిచికారీలు సేంద్రియ పద్థతిలో పెంచే నిమ్మ తోటలలో వాడడానికి సిఫార్ససు చేయబడ్డాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి బోర్డియక్స్ మిశ్రమం వంటి కాపర్ ఆధారిత ఫార్ములేషన్ పిచికారీలు సిఫార్ససు చేయబడ్డాయి. వీటిని సేంద్రియ పద్దతిలో పెంచే తోటలలో కూడా ఉపయోగించవచ్చు. చల్లని తేమతో కూడిన వాతావరణం ప్రారంభమయ్యే సమయంలో వీటిని వాడండి. నిరోధకతను పెంచుకున్న బాక్టీరియాను నియంత్రించడానికి ఫెర్రిక్ క్లోరైడ్ లేదా మాంకోజెబ్ మరియు కుప్రిక్ హైడ్రాక్సైడ్ ను ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

నిమ్మలో అగ్గి తెగులు స్యూడోమోనాస్ సిరింగే pv. సిరింగే అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది చాలా రకాల నిమ్మ జాతి చెట్లకు సంక్రమిస్తుంది. ఇవి ఆకులపైన నివసిస్తాయి. దీర్ఘకాలం తడి వాతావరణం వున్నప్పుడు ఇవి వ్యాధి కారకాలుగా మారతాయి. ఇది ఆకులకు సహజంగా వుండే రంధ్రాలు, ఆకులపైన గాయాలు లేదా కాండంపైన వున్న గాయాల ద్వారా కణజాలంలోకి ప్రవేశించి కణజాలానికి నష్టం కలగచేస్తాయి. గాలి, వర్షం, సాండ్ బ్లాస్టింగ్ మరియు మంచు ఈ బాక్టీరియా మొక్కలోకి ప్రవేశించడానికి అనుకూల వాతావరణం కలుగచేస్తాయి. ఈ తెగులు సంక్రమించడానికి చాలా రోజుల వరకు ఆకులపైన తేమ ఉండడం అవసరం. పూర్తిగా పరిణితి చెందని లేత ఆకులు లేదా చలి కాలం ముందు గట్టిపడిన ఆకులు ఈ తెగులుకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • గాలి వలన నష్టం కలగకుండా ఉండడానికి తక్కువ ముళ్ళు వుండే, గుబురుగా వుండే మొక్కల రకాలను సాగుచేయండి.
  • బలమైన గాలుల నుండి చెట్లను రక్షించడానికి పవన నిరోధకాలు అమర్చండి.
  • తెగులు విస్తరించకుండా ఉండడానికి, చనిపోయిన లేదా చీడ సోకిన రెమ్మలు మరియు కొమ్మలను వసంత ఋతువులో కత్తిరించండి.
  • వసంత ఋతువులో కానీ వేసవి కాలం ముందు కానీ ఎరువులను వేయండి.
  • దీనివలన కొత్త బాక్టీరియా తెగుళ్లకు అనుకూలంగా లేని సమయంలో మొక్కలలో కొత్త ఎదుగుదల వస్తుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి