ప్రత్తి

ప్రత్తిలో బాక్టీరియల్ ఎండు తెగులు

Xanthomonas citri subsp. malvacearum

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • మైనం లాంటి ఎరుపు నుండి గోధుమ రంగు మచ్చలు ఆకులు, కాండం మరియు కాయలపైన ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారతాయి.
  • కాండం మరియు కొమ్మలపై నల్లని కాంకర్స్ ఏర్పడతాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

ఆకులు, కాండం మరియు కాయలపై కోణీయ లేదా మైనపు, నీరు పట్టిన ఆకు మచ్చలు ఎరుపు నుండి గోధుమ రంగులో మొదలవుతాయి. మచ్చలు ఎరుపు నుండి గోధుమ రంగు అంచుతో పత్తి ఆకు మీద ఈనె వరకు కోణీయ లేదా వృత్తాకారంలో వ్యాపించి ఉంటాయి. కొన్ని సందర్భాలలో, ఆకు బ్లేడ్ పై మచ్చలు ఆకు ప్రధాన ఈనె వెంట వ్యాపించగలవు. వ్యాధి పెరిగే కొద్ది, ఈ గాయాలు క్రమంగా గోధుమ, నెక్రోటిక్ భాగాలుగా మారుతాయి. కాడలకు ఇన్ఫెక్షన్ సోకడం వలన నాళ కణాల చుట్టూ నల్లటి కాంకర్స్ అభివృద్ధి చెంది వాటిని చుట్టుకొంటాయి. ఫలితంగా కాంకర్ పై భాగం చనిపోవడం లేదా మొక్క పెరగక ముందే రాలిపోవడం జరుగుతుంది. బాక్టీరియం కలిగి ఉన్న తెల్ల మైనపు క్రస్ట్ పాత ఆకు మచ్చలపై లేదా కాంకర్స్ మీద ఏర్పడవచ్చు. వ్యాధి కాయలకు సోకితే ఫలితంగా కాయ కుళ్ళడం, విత్తనాలు పుచ్చిపోవడం మరియు దారం రంగు మారడం జరుగుతుంది. వ్యాధి సోకిన కాయలు కోణీయ ఆకారంలో ఉండక గుండ్రంగా ఉంటాయి. గాయాలు ప్రారంభంలో నీరు పట్టినట్టు కనబడుతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది కాయ గాయాల వలన ముదురు గోధుమ లేదా నలుపు రంగు లొక్కు ఏర్పడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాక్టీరియా సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ మరియు బాసిల్లస్ సబ్టిలీస్ కలిగి ఉన్న పౌడర్-ఆధారిత పొడి సమ్మేళనాలు X. మాల్వేసియరంకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అజాడిరచ్తా ఇండికా యొక్క కషాయం (వేప సారం) కూడా సంతృప్తికరమైన ఫలితాల కొరకు ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో వుంటే, ఎల్లప్పుడూ జీవ చికిత్సలతో పాటు నివారణా చర్యలలతో కూడినఒక సమగ్ర విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. అనుమతించబడిన యాంటీబయాటిక్స్ మరియు కాపర్ ఆక్సీక్లోరైడ్ తో విత్తన శుద్ధి ప్రత్తిలో బాక్టీరియల్ ఎండు తెగులు కు కారణమయ్యే ఈ బాక్టీరియా కు వ్యతిరేకంగా చాలా బాగా పనిచేస్తుంది. అనియంత్రిత పెరుగుదలను నిరోధించే గ్రోత్ రెగ్యులేటర్లు కూడా బ్యాక్టీరియా ఎండు తెగులు సంక్రమణను నివారిస్తాయి.

దీనికి కారణమేమిటి?

జాంతోమొనాస్ సిట్రి సబ్ప్ కాటన్ బ్యాక్టీరియల్ బ్లైట్ కు కారణమవుతుంది. మాల్వేసియారం ఒక బ్యాక్టీరియా ఇది మొక్క వ్యర్థాల్లో లేదా విత్తనాల్లో జీవిస్తుంది. పత్తికి తీవ్ర నష్టం కలిగించే వ్యాధులల్లో ఇది ఒకటి. అధిక వర్షపాతం, అధిక తేమ, వెచ్చని ఉష్ణోగ్రతలు, వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. బ్యాక్టీరియా ఆకు కణాల్లోనికి ఆకు సహజ ప్రవేశాల ద్వారా (స్టోమాటా) లేదా యాంత్రిక గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. భారీ వర్షాలు లేదా వడగళ్ళ వానను కలిగించే తీవ్రమైన వర్షాలలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తెగులు విత్తనాల ద్వారా సంక్రమించడం వలన యాసిడ్ తో విత్తనాల పైన నారను తొలగించడం ద్వారా విత్తనాల ద్వారా ఈ తెగులు విస్తరించకుండా చూడవచ్చు. స్వచ్చందంగా వచ్చే మొక్కల నుండి వచ్చే మొలకలు కూడా ప్రాధమికంగా ఈ తెగులు సంక్రమించడానికి మూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • అధిక నాణ్యత కలిగిన విత్తనాలను నాటండి, యాసిడ్ ను ఉపయోగించి వ్యాధి రహిత విత్తనాలుగా లేదా విత్తనాలను డిలీంట్ చేస్తారు.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను ఉపయోగించండి.
  • పొలాలను పరిశీలించి వ్యాధి సోకిన మొక్కలను గుర్తించి వాటిని తొలగించండి.
  • తేమను తగ్గించుటకు తోటను వీలైనంత వరకు ఓపెన్ గా ఉంచండి మరియు ఆకులు పొడిబారునట్లు చేయడం వలన ఈ వ్యాధి యొక్క పురోగతిని పరిమితం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
  • ఆకులు తడిగా ఉన్నప్పుడు పొలంలో సేద్యం చేయవద్దు లేదా పనిముట్లను తరలించవద్దు.
  • అధిక నష్టాన్ని నివారించుటకు సాధ్యమైనంత త్వరగా వ్యాధి సోకిన పొలంలో పంటను పండించి కోయండి.
  • పొలంలోని మొక్కలను వీలైనంత త్వరగా తొలగించి వాటిని కాల్చి వేయండి.
  • బాగా కుళ్లడానికి వీలుగా మొక్కల వ్యర్థాలు లోతుగా మట్టిలో కలయునట్లు చేయండి.
  • మొదట కాండాలను కోయుటకు అవకాశామివ్వండి.
  • ఈ వ్యాధి నిరోధక రకాలతో పంటతో మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి