మొక్కజొన్న

మొక్కజొన్నలో బుషీ స్టంట్ ఫైటోప్లాస్మా

Phytoplasma asteris

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల అంచులు రంగు కోల్పోయి పాలిపోయినట్లు అవుతాయి.
  • ముదురు ఆకులు ఎర్రని రంగులోకి మారతాయి.
  • మొక్కలలో ఎదుగుదల ఆగిపోయి అసాధారణంగా పిలకలు వచ్చి మొక్కలు ఒక పొదలాగా కనపడతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

మొక్కజొన్న రకం మరియు తెగులు సోకిన దశను బట్టి దీని లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా సుడిగా వుండే ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి ముదురు ఆకులు ఎర్రని రంగులోకి మారతాయి. దీనిని P. ఆస్టరిస్ మొదటి లక్షణంగా చెప్పవచ్చు. తెగులు విస్తరించేకొలదీ ఈ లక్షణాల తీవ్రత అధికమౌతూ వస్తుంది. చివరకు ఆకుల అంచులు చిరిగిపోయిన రూపును సంతరించుకుంటాయి. చాలా అధికంగా పిలకలు రావడం వలన మొక్కలు ఒక పొద లాంటి ఆకృతిని సంతరించుకుంటాయి. కణుపులు చిన్నగా ఉండి ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. మగ పుష్పగుచ్చం తయారవకపోవడం కానీ లేదా వంధ్యత్వంతో కానీ ఉంటాయి. మొక్కలకు అసలు పొత్తులు రాకపోవడం కానీ లేదా అధిక సంఖ్యలో రావడం కానీ జరుగుతుంది. ఫలితంగా వీటి గింజలు గిడచబారి పోవడం లేదా గింజలు పడక పోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ మిడుతలు మరియు ఇతర కీటకాల జనాభాను నియంత్రించడానికి మేతర్హిజియం అనిసోప్లై, బెయువేరియా బస్సియన, పాసిలోమైసిస్, ఫ్యుమోసారోసేయుస్ వంటి జీవ కీటక నాశినులు మరియు వెర్టిసిల్లియుమ్ లేఖానాలను ఉపయోగించవచ్చు. అనాగృస్ ఆటోమస్ వంటి పరాన్న జీవులను కూడా వీటి జనాభాను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. లేడీ బగ్ మరియు లేస్ వింగ్ పురుగులు వీటి గుడ్లను మరియు లార్వాను ఆహారంగా తింటాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాంటాక్ట్ కీటక నాశిని అయిన కార్బరిల్ ఆధారిత పురుగుల మందులు ఈ మిడుతల జనాభాను బాగా నియంత్రిస్తాయి. దీని వలన మొక్కజొన్న మొక్కలు చిన్నగా వున్నప్పుడు ఈ తెగులు సంక్రమించే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కానీ ఆర్ధికంగా ఇది లాభసాటి కాదు.

దీనికి కారణమేమిటి?

బాక్టీరియం ఫైటోప్లాస్మా ఆస్టరిస్ అనే బ్యాక్తీరియా వలన ఈ తెగులు లక్షణాలు కనపడతాయి. సహజంగా దీనిని మాక్రోస్టలేస్ క్వర్డ్రిల్లినియటస్ లాంటి మిడుతలు వ్యాపింపచేస్తాయి. తెగులు సోకిన మొక్కల పదార్ధాల ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తిచెందుతుంది ( మొలకలు లేదా అంటు మొక్కలు). కానీ విత్తనాల ద్వారా ఈ తెగులు సంక్రమించదు. ఈ మిడుతలు పరాన్న జీవి డోడేర్ ( కుస్కుట spp.) లాంటి అనేక ఇతర అతిధి మొక్కలకు కూడా ఈ బ్యాక్టీరియాను వ్యాపింపచేస్తాయి. అధిక ఉష్ణోగ్రత ఈ తెగులు లక్షణాలు మరింత దిగజారేటట్టు చేస్తుంది. చల్లని వాతావరణం కొద్దిగా లేదా ఎటువంటి ప్రభావం చూపించదు. ముందుగా వచ్చిన తెగులు వలన పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
  • ధ్రువీకరించిన డీలర్ల నుండి ఆరోగ్యంగా వున్న విత్తనాలను కొనండి.
  • సంవత్సరం పొడవునా మొక్క జొన్న పంటను వేయకండి.
  • పొడి సీజన్లో నీటిపారుదల సౌకర్యంతో మొక్కజొన్న పంటను వేయకండి.
  • ఈ తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • పొలాన్ని కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పంట వేయకుండా బీడుగా ఉంచి ఈ తెగులును వాహకాలుగా వుండే కీటకాల జీవిత చక్రాన్ని విచ్చిన్నం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి