మొక్కజొన్న

మొక్కజొన్నలో బ్యాక్టీరియల్ ఆకు చార తెగులు

Xanthomonas vasicola pv. vasculorum

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపైన వివిధ పొడవులలో గోధుమ, రాగి రంగు లేదా పసుపురంగు చారలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చల అంచులు అలలు అలలు కత్తిరించినట్టు ఉండి పసుపు రంగులో ఉంటాయి.
  • ఈ లక్షణాలు ముందుగా క్రింది ఆకులలో కనిపించి క్రమంగా పైకి విస్తరిస్తాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

దీని లక్షణాలు క్రింది ఆకులపైన అధికంగా కనిపిస్తాయి. తరువాత మెల్లగా పైకి విస్తరిస్తాయి. సన్నని నారింజ గోధుమ రంగు లేదా రాగి రంగు చారలు ఒకొక్కటి ఒకొక్క పొడవుతో ఏర్పడతాయి. ఇవి పారదర్శకంగా ఉండి పసుపు ఛాయతో అలల వంటి అంచులను కలిగి ఉంటాయి. ఆకుల వెనకనుండి కాంతి పడినప్పుడు ఇవి ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కొన్ని పరిస్థితులలో ఈ చారలు మొక్కల మధ్య ప్రాంతంలో లేదా పై భాగంలో ఏర్పడవచ్చు. వివిధ రకాల హైబ్రీడ్ మొక్కలలో వివిధ రకాల చారలు ఏర్పడతాయి. కొన్ని సార్లు ఆకులో 50% వరకూ ఈ చారలు విస్తరిస్తాయి. దీనివలన గింజలు పాలుపోసుకోవడం తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఆకుల నుండి జిగటగా వుండే పదార్ధం కారడం ఈ తెగులుయొక్క మరొక లక్షణం.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ తెగులును నియంత్రించడానికి జీవ నియంత్రణ పద్ధతులు ఏవీ అందుబాటులో లేవు. ఈ తెగులు రాకుండా చూడడానికి నివారణా చర్యలను తీసుకోవడం అవసరం. మీకు ఏమైనా జీవ నియంత్రణ పద్ధతులు తెలిసినట్లైతే దయచేసి మమల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులుకు ఎటువంటి నివారణా చర్యలు లేదా జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. ఈ తెగులుకు ఎటువంటి రసాయన నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు.

దీనికి కారణమేమిటి?

క్షంతో మోనాస్ వాసికోలా pv. వాస్కులోరిం అనే బ్యాక్టీరియా వలన కలుగుతాయి. ఈ బ్యాక్టీరియా పంట అవశేషాలపైన పంట కోతల తర్వాత కూడా జీవించి ఉంటుంది. ఆరోగ్యంగా వున్న మొక్కలపైకి ఇది వర్షపు తుంపరలు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. తెగులు సోకిన పంట అవశేషాల ద్వారా కూడా పొలాల మధ్యన పంటలకు విస్తరిస్తుంది. పొలంలో వాడే పనిముట్లు మరియు హార్వెస్టర్స్ లేదా స్టార్క్ ఫీడింగ్ ద్వారా కూడా ఈ తెగులు విస్తరిస్తుంది. ఇది మొక్కల కణజాలంలోకి ప్రత్యక్షంగా ప్రవేశిస్తుంది. ఎటువంటి చర్యలను తీసుకోకుండా తెగులు సోకే అవకాశం వున్న మొక్కలను పొలంలో వేయడం వలన ఈ తెగులు సంవత్సరాల తరబడి పొలంలో వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అధిక తేమ, అధిక వర్షపాతం మరియు ఎక్కువ కాలం ఆకులు తడిగా ఉండడం ఈ తెగులు త్వరగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులుగా వుంటాయి. వేడి వాతావరణంలో పైనుండి మొక్కలకు నీరు పెట్టడం వలన ఈ తెగులు సంక్రమించే ప్రమాదం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులును తట్టుకునే రకాలను వాడండి.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • కలుపు మొక్కలను మరియు ఈ తెగులుకు ఆతిధ్యం ఇచ్చే పంటలను తొలగించండి.
  • పనిముట్లను వివిధ పొలాల్లో వాడుతున్నప్పుడు పనిముట్ల నుండి పంట అవశేషాలను తొలగించండి.
  • లేదా ఈ అవశేషాలను పొలంలో లోతుగా పూడ్చిపెట్టండి.
  • తెగులు సోకిన పొలంలో పంట కోతలను ఆలస్యంగా చేయడం వలన ఈ తెగులు ఇతర పొలాలకు వ్యాపించకుండా ఉంటుంది.
  • ఈ తెగులు ఆశించని మొక్కలైన సోయాబీన్ మరియు గోధుమలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి