కాలీఫ్లవర్

క్యాబేజీలో బాక్టీరియల్ కుళ్ళు తెగులు

Pectobacterium carotovorum subsp. carotovorum

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • నొక్కుకుపోయినట్టు ఉన్న మృదువైన మచ్చలు.
  • మెత్తని మరియు రంగు మారిన మొక్కల కణజాలం.
  • ఆకులు, కాండం మరియు వేర్లు ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

కాలీఫ్లవర్

లక్షణాలు

ప్రారంభంలో నీటిలో నానినట్టువుండే మచ్చలు ఏర్పడతాయి. తర్వాత అవి విస్తరించి మృదువుగా మారుతాయి. మచ్చల క్రింద ఉన్న మొక్కల కణజాలాలు మెత్తగా మారి క్రీమ్ నుండి నలుపు రంగుకు మారుతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు, కాండం మరియు వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. ఒక బలమైన వాసన ని గమనించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ వ్యాధికి వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతి గురించి ఈ రోజు వరకు మనకు తెలియదు. వ్యాధి సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. బాక్టీరియాని నియంత్రించడం వీలుపడనందున ముందుగా నివారణ చర్యలు తీసుకోవాలి. బాక్టీరియల్ వ్యాధికారకాలను నిరోధించడానికి మరియు అణచివేయడానికి రాగి ఆధారిత శిలీంద్ర నాశినులను ఉపయోగించండి. సిప్రోఫ్లోక్సాసిన్ కూడా వ్యాధిని నిరోధిస్తుంది.

దీనికి కారణమేమిటి?

పెక్టోబాక్టీరియం కరోటోవరమ్ అనే బ్యాక్టీరియా వల్ల నష్టం జరుగుతుంది, ఇది నేల మరియు పంట అవశేషాలలో జీవించి ఉంటుంది. ఇది పనిముట్లు, కీటకాలు, వడగళ్ళ వలన కలిగే నష్టం లేదా సహజ రంధ్రాల వల్ల కలిగే గాయాల ద్వారా పంటలోకి ప్రవేశిస్తుంది. వ్యాధికారక క్రిమి కీటకాలు, టూల్స్, వ్యాధి సోకిన మొక్కల పదార్థాల కదలిక, నేల లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. తడి వాతావరణం మరియు 25-30°C యొక్క వెచ్చని ఉష్ణోగ్రతల సమయంలో ఇది పెద్ద సమస్యగా మారుతుంది మరియు మొక్కలు కాల్షియం లోపంతో బాధపడుతున్నప్పుడు మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది పొలంలో మరియు స్టోరేజ్ లో కూడా సంభవిస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.
  • గాలి బాగా తగిలేలా వరుసలలో వ్యాధి రహిత మరియు ఆరోగ్యకరమైన విధానాలను ఉపయోగించండి.
  • గాయాలను తగ్గించడానికి మీ మొక్కలను జాగ్రత్తగా నిర్వహించండి.
  • మీ పనిముట్లను శుభ్రపరచండి మరియు క్రిమిసంహారక మందులతో శుభ్రపరచండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టవద్దు.
  • వ్యాధి సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • పొడి వాతావరణంలో మాత్రమే పంట కోతలు చేయండి.
  • నిల్వ చేసే ముందు మీ పంటను పరిశీలించండి.
  • రాగి ఆధారిత ద్రావకాలతో మీ స్టోరేజీ ప్రాంతాన్ని శుభ్రం చేయండి మరియు క్యాబేజీలు దెబ్బతినకుండా ఉండటానికి గడ్డిని లేదా కాగితాన్ని బఫరింగ్ మెటీరియల్‌గా ఉపయోగించండి.
  • పంట కోత తర్వాత మొక్కల అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • మూడు సంవత్సరాల పాటు యీ తెగులు సోకని పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి