మొక్కజొన్న

స్టిగా

Striga hermonthica

కలుపు

5 mins to read

క్లుప్తంగా

  • ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాండాలు మరియు ఆకులు.
  • చిన్న ప్రకాశవంతమైన రంగురంగుల పువ్వులు పంట చుట్టూ ఎదగడం మొదలుపెడతాయి.
  • ఎదుగుదల తగ్గటం, వాలిపోవడం ఎండిపోవటం మరియు రంగు మారిపోవడం (క్లోరోసిస్) వంటి లక్షణాలు అతిధి మొక్కలలో కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

దీనిని పర్పుల్ విఛ్వీడ్ అని కూడా పిలుస్తారు. ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాండాలు మరియు ఆకులు, చిన్న ప్రకాశవంతమైన వంగపండు రంగులో వుండే పువ్వులు దీని కొన్ని లక్షణాలు. ఇది మొక్కలను ఆశించి వాటినుండి నీటిని పోషకాలను గ్రహించివేస్తుంది. దీనివలన కరువు బారిన మొక్కల లక్షణాలు కనపడతాయి: క్లోరోసిస్, ఆకులు వాలిపోవడం మరియు మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది. పోషకాల లేమి వలన కలిగే లక్షణాలు ఈ తెగులు లక్షణాలు ఒకే విధంగా ఉండడం వలన దీని లక్షణాలను ముందుగా పసిగట్టడం చాలా కష్టం. ఒకసారి ఈ తెగులు సోకితే దీనిని నియంత్రించడం చాలా కష్టం. దీని వలన పంట దిగుబడి తగ్గిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ కలుపు మొక్క చాలా అధిక మొత్తలో విత్తనాలను ఉత్పత్తి చేయడం వలన మరియు ఇవి ఎక్కువవు కాలం జీవించి ఉండడం వలన స్ట్రీగాను నియంత్రించటం చాలా కష్టం. వ్యాధి సోకిన మొక్కలను పూత రాక ముందే పొలం నుండి తొలగించి కాల్చివేయాలి. ఫుసారియం ఆక్సిస్పోరం ఫంగస్ ను జీవ నియంత్రణకు ఉపయోగించవచ్చు. ఈ వైరస్ దీని కణజాలాన్ని ఆశించి ఈ మొక్కలు ఎదగకుండా చేస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ కలుపు మొక్కలను నివారించే మందుల ధర చాలా అధికంగా ఉంటుంది. అంతే కాక ఈ మందులు పంటకు కూడా నష్టం కలగచేయవచు. ఈ మందులను పిచికారీ చేసే వారు సరైన రక్షణ కవచాన్ని ధరించాలి. ఈ కలుపు నివారణ మందులు మొక్కలను కూడా చంపే అవకాశం వుంది. చిరు ధాన్యాలు మరియు జొన్నలలో విత్తనాలను ఈ మందులతో శుద్ధి చేయడం వలన 80% వరకూ ఈ తెగులు సోకకుండా చేయవచ్చు. కలుపు మందులను తట్టుకునే విత్తనాలను, పొలంలో నాటే ముందు ఈ మందులో కొద్దీ సేపు నానబెట్టి ఉంచాలి.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా పర్పుల్ విచ్ వీడ్ అని లేదా జెయంట్ విచ్వీడ్ అని పిలువబడే పరాన్న మొక్క అయిన స్ట్రీగా హెర్మొంతికా ద్వారా ఈ లక్షణాలు సంక్రమిస్తాయి. ఉప సహారా ఆఫ్రికా ప్రాంతాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ధాన్యపు పంటలు, గడ్డి, మరియు వరి, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, చెరుకు మరియు బొబ్బర్లు వంటి పంటలకు ఈ తెగులు సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రతి మొక్క 90,000 నుండి 500,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు 10 సంవత్సరాల వరకు భూమిలో ఉండగలవు. గాలి, నీరు, మనుషులు మరియు పశువుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించిన తర్వాత ఈ విత్తనాలు భూమిలోకి చేరుకుంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇవి అతిధి మొక్కల వేర్లకు కొద్దీ దూరంలోనే ఉండి మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఇవి వేర్లతో కలిసినప్పుడు ఇది మొక్కలను అంటిపెట్టుకునే నిర్మాణాలను ఏర్పాటుచేసుకుంటుంది. నత్రజని అధికంగా వుండే ఎరువులు ఈ తెగులును తగ్గించడంలో సహాయపడతాయి.


నివారణా చర్యలు

  • మొక్కల బలవర్ధకాలను పంటను బలోపేతం చేయడానికి వాడవచ్చు.
  • సీజన్ మొదట్లో పెంటను అధికంగా వేయండి.
  • జెనస్ డెస్మోడియం మొక్కలను పొలంలో నాటడం వలన పంట వేర్లను ఈ స్టిగా తెగులు ఆశించకుండా చూడవచ్చు.
  • స్టిగాను ఆకర్షించడానికి నేపియర్ గడ్డిని పంట చుట్టూ నాటండి.
  • దీనివలన స్టిగాను పంటకు దూరంగా ఉంచుతాయి.
  • పొలంలో ఉపయోగించే అన్ని పనిముట్లను, బట్టలను మరియు బూట్లను మరియు సామాగ్రిని శుద్ధి చేయండి.
  • సరైన నత్రజని మోతాదును వాడండి.
  • పప్పు ధాన్యపు పంటలతో మీ పొలంలో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి