సాలీడు పురుగులు - చెరుకు

చెరుకు

సాలీడు పురుగులు

Tetranychidae

పురుగు


క్లుప్తంగా

  • ఆకులపైన సూక్ష్మమైన మచ్చలు ఏర్పడతాయి.
  • కాడలు మరియు ఆకుల మధ్యన చిన్న చిన్న సాలెగూళ్ళు చూడవచ్చు.
  • ఆకులు ఎండిపోతాయి.

లక్షణాలు

సాలీడు పురుగులు (ఎర్ర నల్లి) వలన ఆకు పైభాగంపై తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. గుడ్లు ఆకుల కిందిపక్క అతుక్కొని ఉంటాయి. ఎర్ర నల్లి కూడా అక్కడే పట్టుగూడు లో ఉంటుంది. సంక్రమణ అధికం అయ్యే సరికి ఆకులు కాంస్య రంగు, వెండి రంగులోకి మారుతాయి తరువాత చిరిగినట్టు అయి రాలిపోతాయి. దీనివలన మొక్కలకు అధిక నష్టం కలుగుతుంది మరియు పండ్ల సంఖ్య మరియు నాణ్యత తగ్గుతుంది.

ట్రిగ్గర్

పెద్ద ఆడ పురుగులు 0.6 మిల్లిమీటర్ పొడవు, లేత ఆకుపచ్చ రెండు ముదురు మచ్చలతో వెనక భాగంలో పెద్ద జుట్టుతో ఉంటుంది. కొన్ని పురుగులు ఎరుపు రంగులో కూడా ఉంటాయి. వసంత కాలంలో ఆడ పురుగులు గుండ్రని గుడ్లను ఆకు కిందిపక్క పెడతాయి. చిన్న పురుగులు పాలిపోయిన ఆకుపచ్చరంగుతో వీపు భాగంలో ముదురు గుర్తులతో ఉంటాయి. సాలీడు పురుగులు (ఎర్ర నల్లి) కూడా అక్కడే పట్టుగూడులో ఉంటాయి. ఈ సాలీడు పురుగులు (ఎర్ర నల్లి) పొడి మరియు అధిక వేడి వాతావరణాలలో ఎక్కువగా జీవిస్తాయి మరియు ఏడు తరాల వరకు ఒక సంవత్సరంలోనే కంటాయి. ఈ పురుగులకు చాలా రకాల అతిధి మొక్కలు ఉంటాయి. అందులో కొన్ని కలుపు మొక్కలు కూడా వున్నాయి.

జీవ నియంత్రణ

తెగులు తీవ్రత తక్కువగా ఉంటే పురుగులను నీళ్ల తో కడిగి తీసివేయవచు మరియు ఆకులను తొలగించాలి. రేప్సీడ్, తులసి, సోయాబీన్ మరియు వేప నూనెలతో చేసిన ద్రావణాన్ని T. అర్తికే జనాభాను తగ్గించటానికి వాడొచ్చు. వెల్లుల్లి టీ, దురదగొండి ముద్ద లేదా పురుగుమందు సబ్బు మిశ్రమాలను వాడి వీటి జనాభాను అదుపులో ఉంచవచ్చు. పంటలకు సోకిన పురుగుల జాతిని బట్టి జీవ నియంత్రణ ఫంగస్ ను( ఉదాహరణకు ఫైటోసేయులస్ పెర్సిమిలిస్) లేదా బాసిల్లస్ తురింజినెసిస్ వాడాలి. తప్పకుండా 2 నుండి 3 రోజుల తర్వాత మళ్ళీ రెండవసారి పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాలీడు (ఎర్ర నల్లి) ను అకెరిసిడ్ తో నియంత్రించటం కష్టం ఎందుకంటే ఎక్కువ శాతం పురుగులు అనేక రకాల రసాయనాలకు నిరోధకతను అలవరచుకున్నాయి. ఈ పురుగుల పరాన్న జీవులకు నష్టం కలగకుండా రసాయన నియంత్రణ మందులను( శీలింద్ర నాశినులులైన వెట్టబెల్ సల్ఫర్, స్పిరో మెసిఫిన్, డైకోఫోల్ లేదా అబమెక్టిన్) జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. అవసరమైతే 2 రోజుల నుండి 3 రోజుల తర్వాత మరల ఒకసారి వీటిని పిచికారీ చేయండి.

నివారణ చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలను సాగుచేయండి.
  • తెగులు లక్షణాల కొరకు మీ పొలాన్ని గమనిస్తూ వుండండి మరియు ఆకుల కింది వైపు పరిశీలించండి.
  • ప్రత్యమ్నాయంగా ఒక ఆకు కింద తెల్ల కాగితం వుంచి ఆకును ఊపండి.
  • ఈ తెగులు ప్రభావానికి గురైన ఆకులను లేదా మొక్కలను తీసి వేయాలి.
  • దురదగొండి మరియు ఇతర కలుపు మొక్కలను తొలగించాలి.
  • నీటిని కాలువల వెంట మరియు ఇతర చెత్త పేరుకపోయిన మార్గాల వెంట నీటిని తొలగించుటకు నీటిని పారగట్టండి.
  • సాలీడు మైట్ దాడిని తక్కువగా తట్టుకోగల ఒత్తిడికి గురైన మీ చెట్లకు మరియు మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని పెట్టండి.
  • లాభదాయకం అయిన కీటకాలు వృద్ది చెందడానికి కీటక నాశినుల వాడటం తగ్గించాలి .