అరటి

రెడ్ పామ్ మైట్ (ఎర్ర గుల్ల నల్లి)

Raoiella indica

పురుగు

5 mins to read

క్లుప్తంగా

  • రెడ్ పామ్ మైట్ ఆకులు లేదా లీఫ్ లెట్స్ దిగువ భాగంలో నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
  • కీటకాలు ఏర్పరిచిన నిస్సారమైన తెల్లటి చర్మపు గూడును అక్కడ చూడవచ్చును.
  • పసుపుపచ్చగా అయిన ఆకుల యొక్క అంచులను మరియు పత్రహరితం కోల్పోయిన మృతకణముల అతుకులను చూడవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

రెడ్ పామ్ మైట్ సాధారణంగా ఆకులు (100-300 వరకు) యొక్క అడుగు భాగాలలో పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి మరియు చూట్టు ఏమి లేకుండా కన్నుతో కనిపిస్తాయి. అన్ని జీవితమంతా ఎరుపు రంగులో ఉంటాయి, అయితే పెద్ద ఆడ కీటకాలు తరచూ శరీరంలో ముదురు భాగాలతో (భూతద్దంతో కనిపించే) కనిపిస్తాయి. మొదట ఆకు అంచుల వద్ద పసుపు రంగులోకి మారడానికి లీఫ్ లెట్స్ లేదా ఆకులపై వాటి ఉనికి కారణమవుతుంది, ఇది ఈనెలకు సమాంతరంగా పెద్ద మృతకణముల అతుకులను ఏర్పరుస్తూ ముందుకు సాగుతాయి. కాలక్రమేణా, నిర్జీవమైన మచ్చలు ఏర్పడి పసుపుపచ్చ కణజాలాన్నిభర్తీ చేయవచ్చు. తెగులు తీవ్రంగా ఉన్నట్లయితే కింది భాగంలో వుండే లేత మొక్కల లీఫ్ లెట్స్ చనిపోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పరాన్న జీవి అయిన అంబిలిసియస్ మిర్రొఎన్సిస్ను తోటలో వదలడం వలన రెడ్ పామ్ కీటకాల జనాభా తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇతర మాంసాహార పురుగులు మరియు లేడీ బీటిల్స్ కూడా R. ఇండికాను తింటాయి. కనుక విస్తృతమైన పురుగుమందుల వాడకం వలన ఈ మాంసాహారుల యొక్క జనాభాకు అంతరాయం కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యం.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. స్పిరోమెసిఫెన్, డికోఫోల్ మరియు ఎక్యూక్వినాల్ల యొక్క ఫార్ములేషన్ల ప్యూర్టో రికోలో కొబ్బరిలో R. ఇండికా యొక్క జనాభాను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయి. ఎటోజనోల్, అబమేక్టిన్, పైరిడబెన్, మిల్బెమేక్టిన్ మరియు సల్ఫర్ షోడ్ మైట్ కంట్రోల్ కలిగిన పిచికారీ చికిత్సలను వాడవచ్చు. అంతేకాకుండా, ఎసిరిసిడెస్ ఎసిక్వినోకిల్ మరియు స్పిరోమెసిఫెన్ అరటిలో ఆర్. ఇండికా జనాభాను తగ్గించగలవు..

దీనికి కారణమేమిటి?

రెడ్ ఫామ్ మైట్ రోయిల్లా ఇండికా వలన ఈ నష్టం సంభవిస్తుంది. అవి "ఫాల్స్ స్పైడర్పు మైట్స్" అని పిలవబడే సమూహానికి చెందుతాయి, ఇవి ఫ్లాట్ బాడీ మరియు అనేక ఇతర సాలె పురుగులలాగ వున్నా, గూడు లేకుండా వుండడం జరుగుతుంది. అవి వాటి ముల్లును మొక్క కణం లోనికి చొప్పించి అక్కడి కణజాలాన్ని తింటాయి. ఈ కీటకం గాలి, చీడ పీడిత మొక్కల రవాణా వలన మరియు కోసి వేసిన మొక్కల ఆకుల వలన సులభంగా వ్యాప్తి చెందుతుంది. వర్షాపాతం, అధిక తేమ ఇంకా అధిక వేడి, ఎండ మరియు పొడి వాతావరణంలో వీటి జనాభా ప్రతికూలతను ఎదుర్కొంటుంది. అరటితో పాటు, రెడ్ పామ్ మైట్ కొబ్బరి, కర్జూర మరియు అరకా ఫామ్ మరియు ఆర్నమెంటల్ ఫామ్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. అతిధి మొక్కల జాబితాలో కొన్ని అలంకార మొక్కలు కూడా ఉంటాయి.


నివారణా చర్యలు

  • తెగులు సోకిన మొక్కలను ఇతర అరటి పంటల మధ్య తరలించకూడదు.
  • ప్రయోజనకరమైన కీటకాలను వృద్ధి చేయడానికి పురుగు మందుల వాడకాన్ని నియంత్రించండి.
  • తెగులు యొక్క లక్షణాలు కోసం తోటలను క్రమం తప్పకుండా నిరంతరం పరిశీలిస్తూ వుండండి.
  • తోటలో పనిచేసే వాళ్ళు శుభ్రంగా వుండాలి మరియు పని ముట్లను నిరంతరం శుభ్రంగా ఉంచండి.
  • తోట చుట్టూ వున్న కీటకాల ప్రత్యామ్నాయ ఆవాసాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి