మామిడి

మామిడి ఆకు పూత పురుగు

Cisaberoptus kenyae

పురుగు

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు పైభాగంలో తెల్లటి పూత.
  • ఆకులు రంగును కోల్పోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

ఈ పురుగులు సమూహాలలో నివసిస్తాయి మరియు ఆకు పైభాగంపై తెలుపు లేదా మైనపు పూతను సృష్టిస్తాయి. ఈ పూత తెల్లని తీగెలుగా మరింత అభివృద్ధి చెందుతుంది, ఇది మొత్తం ఆకును కప్పి ఉంచే వెండి పొరగా మారుతుంది. పురుగులు ఆకుల నుండి మొక్కల కణద్రవ్యాన్ని పీలుస్తాయి. ప్రభావిత ఆకులు తరచుగా, పసుపు రంగులోకి మారి తర్వాత రాలిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇది ఒక చిన్న తెగులు మరియు పండ్ల దిగుబడి తగ్గించడానికి కారణం కాదు కాబట్టి దీనిని జీవశాస్త్రపరంగా నియంత్రించాల్సిన అవసరం లేదు. మంచి నిర్వహణ పద్ధతులను పాటించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ముట్టడిని నియంత్రించడానికి రసాయన మిటిసైడ్లను ఉపయోగించవలసిన అవసరం ఉండదు.

దీనికి కారణమేమిటి?

పురుగుల జనాభా మార్చిలో గరిష్ట స్థాయికి, డిసెంబరులో కనిష్టంగా చేరుకుంటుంది. ఆకు పూత పురుగు వల్ల నష్టం జరుగుతుంది. ఈ నల్లి సాధారణంగా 0.2 మిమీ పరిమాణంలో మరియు కాంతితో చూడలేనంత చిన్నగా ఉంటుంది. ఇది లేత రంగు మరియు సిగార్ ఆకారంలో ఉంటుంది. వీటి గుడ్లు లేత తెలుపు రంగులో, గుండ్రంగా మరియు చదునుగా ఉంటాయి. పెద్ద పురుగు లేత తెలుపు నుండి క్రీము నారింజ రంగు మరియు టార్పెడో ఆకారంలో ఉంటుంది. ఈ పురుగులు సాధారణంగా అధికంగా పెరిగిన లేదా నిర్లక్ష్యం చేయబడిన మామిడి చెట్లకు మాత్రమే సోకుతాయి.


నివారణా చర్యలు

  • పంట కోతల తర్వాత ప్రభావిత రెమ్మలను కత్తిరించండి.
  • తెల్లటి పూత వున్న ఆకులను తొలగించి నాశనం చేయండి.
  • తెగుళ్లు సంక్రమించకుండా చూడడానికి మరియు ఆకులకు సూర్యరశ్మి అధికంగా తగలడానికి వీలుగా మొక్కను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి