తామర పురుగులు - ఇతరములు

ఇతరములు

తామర పురుగులు

Thysanoptera

కీటకం


క్లుప్తంగా

 • చిన్న వెండి అతుకులు ఆకు ఈనెల పైభాగంలో కనిపిస్తాయి, దీన్ని 'సిల్వరింగ్' అంటారు.

లక్షణాలు

లార్వా మరియు ఎదిగిన పురుగులు మొక్కల కణజాలాలను తింటాయి. దీనివలన ఆకుల పైభాగంలో చిన్న పరిమాణంలో వెండి అతుకులు కనిపిస్తాయి, దీన్ని 'సిల్వరింగ్' అంటారు. రంగు కోల్పోయిన ప్రాంతంలో పూరేకులపై ఇదేవిధమైన అతుకులు కనిపిస్తాయి. ఆకుల క్రింది భాగంలో తామర పురుగులు మరియు వాటి లార్వా ఒకే ప్రదేశంలో వాటి నల్లటి పేడ రంగు మచ్చల దగ్గర గుంపుగా కూర్చుని ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి, రూపు మారిపోవడం లేదా ముడుచుకొని పోతాయి. మొగ్గలు లేదా పూత వృద్ధిచెందుతున్న సమయంలో ఈ పురుగులు తినటం వలన పూలు లేదా పండ్లు రూపుమారిపోయి దిగుబడిలో నష్టం కలుగుతుంది.

ట్రిగ్గర్

తామర పురుగులు 1-2 మి. మీ పొడవు, పసుపు, నలుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల పురుగులకు రెండు జతల రెక్కలు ఉంటే మరి కొన్ని పురుగులకు అసలు రెక్కలు ఉంటాయి. మొక్కల అవశేషాలలో, మట్టిలో లేదా ఇతర ఆతిధ్య మొక్కల పైన ఇవి నిద్రావస్థలో ఉంటాయి. ఇవి అనేక చీడపీడలకు వాహకాలుగా ఉంటాయి. పొడి మరియు వేడి వాతావరణం వీటి ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. గాలిలో తేమ వీటి జనాభాను తగ్గిస్తుంది.

జీవ నియంత్రణ

కొన్ని రకాల తామర పురుగుల పైన పనిచేసే జీవ నివారణ పద్ధతులు వృద్ధిచేయపడ్డాయి. లార్వాను తినే పురుగులు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. పువ్వులపై కాకుండా ఆకులపై దాడిచేసే ఈ పురుగులపైన వేప నూనె లేదా సహజ పెరిత్రోయిడ్సును ఉపయోగించండి. వీటిని ఆకుల క్రిందిభాగంలో వాడాలి. ఈ పురుగులపైన ఇతర జీవ సమ్మేళనాలు మరియు రసాయనాలను వాడడం కన్నా స్పైనోసాడ్ వాడడం వలన ఇది ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ కాలం నిలిచి ఉండి పిచికారీ చేసిన ప్రాంతంలో కొద్ది దూరం వరకు వెళ్తుంది. కానీ ఈ పురుగుల కొని సహజ శత్రువులపై ఇది విషంలాగా పనిచేస్తుంది( ఉదాహరణకు ప్రెడేటరీ మైట్స్, సిర్ఫిడ్ లార్వా). పుష్పించే దేశాలో వున్న మొక్కలపై స్పినోసాడ్ ను ఉపయోగించవద్దు. పువ్వులపైన వ్యాపించే తామర పురుగులను నివారించడానికి వీటిని తినే పురుగుల్ని లేదా ఆకుపచ్చ లేస్ వింగ్ లార్వాను వాడవచ్చు. కొని రకాల కీటక నాశినులను వెల్లుల్లి సారంతో కలిపి వాడటం వలన కూడా కొన్ని అనుకూల ఫలితాలు వస్తాయి. బాగా అధికంగా ప్రతిబింబించే అల్ట్రా వయొలెట్ కవర్( మెటల్ మల్చ్) ఉపయోగించడం సిఫార్స్ చేయబడినది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.అధిక పునరుత్పత్తి రేటు మరియు వీటి జీవన చక్రాల వలన తామర పురుగులు అన్ని రకాల పురుగుల మందులకు నిరోధక శక్తిని కలిగివుంటాయి. అజాడిరచటిన్, ఫిప్రోనిల్ మరియు పెరిత్రోయిడ్సును పిపెరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి వాడడం వలన వీటి ప్రభావం అధికంగా ఉంటుంది.

నివారణ చర్యలు

 • ఈ పురుగులపైన రసాయనాలను ఉపయోగించనవసరంలేని విత్తన రకాలను వాడండి.
 • వురస్ మరియు త్రిప్స్ లేని గ్రీన్ హౌసులో పెంచిన అంటూ మొక్కలను ఉపయోగించండి.
 • గ్రీన్ హౌసులో ఈ తామర పురుగులు నియంత్రించబడతాయి.
 • ఎక్కువ పరిధిలో జిగురు వలలు వుపయోగించి ఈ పురుగులను అధిక మొత్తంలో పట్టుకోండి.
 • వైరస్ సోకిన మొక్కలకు దగ్గరలో లేదా ఈ తెగులు సులువుగా సోకే ఇతర అతిధి మొక్కలకు దగ్గరలో కానీ మీ పంటను వేయవద్దు.
 • మొక్కలను నాటే ముందు గ్రీన్ హౌసును పూర్తిగా శుద్ధి చేసి శుభ్రపరచాలి.
 • పొలంలో ఈ తామర పురుగులను గమనిస్తూ పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
 • తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
 • మొక్కల అవశేషాలను వెంటనే తొలగిస్తూ వుండండి.
 • సరైన మోతాదులో పొలంలో నీరు పెట్టండి.
 • నత్రజని ఎరువులు అధికంగా వాడకూడదు.