ఆకు చార ఈగలు - పసుపు కంది పప్పు మరియు ఎరుపు కంది పప్పు

పసుపు కంది పప్పు మరియు ఎరుపు కంది పప్పు

ఆకు చార ఈగలు

Agromyzidae

కీటకం


క్లుప్తంగా

 • ఆకులపైన సక్రమంగా లేని సర్పాకారంలోని బూడిద రంగు చారలు ఆకుల ఈనెలకు కొద్ది దూరంలో ఏర్పడతాయి.
 • ఆకులు ముందుగానే రాలిపోవచ్చు.

లక్షణాలు

ఆకుల పైన సక్రమంగా లేని సర్పాకారంలోని బూడిద రంగు చారలు ఆకుల ఈనెలకు కొద్ది దూరంలో ఏర్పడతాయి. ఇవి సహజంగా ఆకుల ఈనెలకు పరిమితమై ఉంటాయి. ఈ చిన్న రంధ్రాలవంటి సొరంగాలలో వీటి నల్లని మలపదార్ధం ఉంటుంది. మొత్తం ఆకు అంత ఈ పురుగులతో కప్పబడి ఉండవచ్చు. తెగులు సోకిన ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. దీనివలన పంట దిగుబడి తగ్గి పండ్ల పరిమాణం తగ్గడం మరియు పండ్లకు సూర్య కాంతి ప్రత్యక్షంగా తగిని నష్టం వాటిల్లుతుంది.

ట్రిగ్గర్

ఆకు తొలుచు పురుగులు ఈగ జాతికి చెందినవి మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలు కలిగి ఉంటాయి. వసంత కాలంలో ఇవి ఆకుల కింది భాగంలో అంచులవద్ద గుడ్లు పెడతాయి. లార్వా ఆకుల కింది మరియు పై భాగం మధ్యలో తింటాయి. ఇవి తెల్లటి పాయలతో సొరంగాలు చేస్తాయి. ఈగలు భూమిలో, మొక్కల అవశేషాలలో లేదా రాలి పోయిన ఆకుల పైన ఉంటాయి. ఆకు తొలుచు పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి.

జీవ నియంత్రణ

చిన్న చీడలు పై పై నష్టాలు కలిగిస్తాయి కానీ ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ పురుగుల లార్వాను చంపడానికి పరాగ సంపర్క కందిరీగలు వాణిజ్య పరంగా లభిస్తున్నాయి. అధిక నష్టం కలగకుండా ఉండటానికి వేప నూనెను, వేప గింజల కషాయాన్ని లేదా స్పైనోసాడ్ వాడడం వలన పెద్ద పురుగులు ఆకులను తినకుండా ఉండడం మరియు గుడ్లు తక్కువగా పెట్టడం జరుగుతుంది. లేడీ బర్డ్స్ కీటకాలు ఆకు తొలుచు పురుగుల్ని చంపటంలో ఉపయోగ పడుతాయి. ఈ ఉత్పత్తులు సహజంగా శత్రువులపైన అధిక ప్రభావం చూపవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత పరిధి కల కీటక నాశినులైన ఆర్గానోఫాస్ఫెట్స్, కార్బమెట్లు మరియు పెరిత్రోయిడ్స్ కుటుంబానికి చెందిన పురుగుల మందులు ఆడ ఈగలు గుడ్లు పెట్టకుండా నిరోధిస్తాయి. కానీ ఈ మందులు లార్వాను చంపవు. అంతే కాకుండా కాకుండా ఈ పురుగుల మందుల వలన పంటకు సహాయంగా వుండే కీటకాలు కూడా నశిస్తాయి. ఈ కీటకాలు ఈ పురుగుల మందులకు నిరోధకతను కూడా పెంచుకుంటాయి. దీని వలన కొన్ని సార్లు కీటకాల జనాభా మరింత ఎక్కువ అవుతుంది. అబామెక్టిన్ , బైఫేంత్రిన్, మేథోక్సిఫెనోజైడ్ క్లోరన్తీనిపోల్ లేదా స్పైనోసాడ్ ఒక దాని తర్వాత ఇంకొకటి వాడడం వలన ఈ మందులకు కీటకాలు నిరోధకతను పెంచుకోలేవు

నివారణ చర్యలు

 • ఆకు చార ఈగలు గుడ్లు లేని మొలకలను వాడండి.
 • ఈ తెగులు యొక్క ప్రత్యామ్నాయ ఆవాసాలను తెగులు సోకిన పొలాల పక్కన నాటకూడదు.
 • పసుపు రంగు జిగురు పదార్థాలు లేదా నీళ్లతో నింపిన బేసిన్లు వాడాలి.
 • ఈ తెగులు అధికంగా సంక్రమిస్తే తెగులు సోకిన మొక్కలను గుర్తించి నాశనం చేయాలి.
 • పూల మొక్కలను మొక్కల మధ్యలో వరుసలలో నాటాలి.
 • దీనివలన ఇతర పొలాలనుండి వచ్చే కీటకాలను అడ్డుకోవచ్చు.
 • కలుపు మొక్కలను మరియు స్వచ్చందంగా వచ్చే మొక్కలను తొలగించండి.
 • మొక్కల చుట్టూ వున్న మట్టిని ఆకులతో కప్పండి.
 • దీనివలన ఈగలు నేలలో గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
 • విస్తృత పరిధి కల కీటక నాశినులను వాడవద్దు.
 • ఇలా వాడడం వలన మొక్కలకు సహాయకారులుగా వుండే కీటకాలు కూడా నశించిపోతాయి.
 • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.
 • పొలాన్ని బాగా లోతుగా దున్ని ఈ తెగులు కారకాల్ని వీటి సహజ శత్రువుల కంటపడేటట్టు చేయండి.
 • ప్రత్యామ్యాయంగా పంట కోతల తర్వాత పంట అవశేషాలను తగలపెట్టండి.