క్యాబేజీ

క్యాబేజీ తెల్ల సీతాకోకచిలుక

Pieris brassicae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • వెలుపలి ఆకులలో పెద పెద్ద రంధ్రాలు.
  • ఆకు లోపలి భాగంలో లేదా క్యాబేజీ మధ్యలో నీలం-ఆకుపచ్చ పిప్పు.
  • గొంగళి పురుగులు మరియు వాటి విసర్జన తరచుగా మొక్కలపై కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

క్యాబేజీ

లక్షణాలు

బయటి ఆకులకు నష్టం వాటిల్లడం అనేది ఈ పురుగుల ఉనికికి స్పష్టమైన సంకేతం. బయటి ఆకుల రంధ్రాలతో పాటూ క్యాబేజీ కోసినప్పుడు క్యాబేజీ తలకు కలిగిన నష్టం లోపలి ఆకులలో కనిపిస్తుంది. గొంగళి పురుగులు మరియు వాటి విసర్జన పదార్ధం కూడా తరచుగా మొక్కలపై కనిపిస్తాయి. క్యాబేజీలు, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, స్వీడ్ మరియు ఎర్ర ముల్లంగితో సహా అన్ని రకాల బ్రాసికా పంటలు ఈ తెగులుకు ప్రభావితమవుతాయి. కొన్ని కలుపు మొక్కలు కూడా ప్రభావితమవుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును పరాన్నజీవుల ద్వారా నియంత్రించవచ్చు, కోటేసియా గ్లోమెరాటా పి. బ్రాసికే యొక్క లార్వాపై దాడి చేస్తుంది, అయితే ప్తెరోమలుస్ పుపరం ప్యూపా దశలో దీనిని నియంత్రిస్తుంది. సహజంగా సంభవించే బాక్టీరియం, బాసిల్లస్ తురింజిఎంసిస్ లేదా సాచరోపోలిస్పోరా స్పినోసా (స్పినోసాడ్) ఆధారంగా ఉత్పత్తులు ఎగువ మరియు దిగువ ఆకు ఉపరితలాలపై పూర్తిగా పిచికారీ చేసినప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ పురుగుమందులు వాతావరణంలో కొనసాగవు. గొంగళి పురుగులకు వ్యతిరేకంగా ఒక వ్యాధికారక నెమటోడ్, స్టైనెర్నెమా కార్పోకాప్సే కూడా అందుబాటులో ఉంది. దీనిని ఆకులు తడిగా ఉన్నప్పుడు, ఉదాహరణకు చల్లని నిస్తేజ వాతావరణంలో వాడాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పైరెథ్రమ్, లాంబ్డా-సైహలోత్రిన్ లేదా డెల్టామెత్రిన్ ఆధారిత ఉత్పత్తులను గొంగళి పురుగులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. పైరెథ్రమ్ యొక్క సారం చాలా సార్లు మరియు పంట కోతకు ఒక రోజు ముందు వరకు వాడవచ్చు. లాంబ్డా- సైహలోత్రిన్ మరియు డెల్టామెత్రిన్ కోసం, గరిష్టంగా 2 సార్లు వాడడానికి సిఫార్సు చేయబడ్డాయి మరియు పంట కోతలకు 7 రోజుల ముందు నుండి పురుగుల మందులు వాడకూడదు.

దీనికి కారణమేమిటి?

ఈ సీతాకోకచిలుకలు నల్లటి శరీరం మరియు మెరిసే తెల్లటి రెక్కలు, ముందరి భాగంలో నల్లటి కొనతో ఉంటాయి (ఆడ పురుగులలో రెండు నల్ల చుక్కలు ఉంటాయి). ప్యూపా దశ నుండి ఉద్భవించిన కొన్ని వారాల తరువాత, ఆకుల దిగువ భాగంలో ఆడ పురుగులు ఆకుపచ్చ-పసుపు గుడ్లను పెడతాయి. పొదిగిన తరువాత, గొంగళి పురుగులు మొక్కల కణజాలాలను తినడం మొదలుపెడతాయి. గొంగళి పురుగులు రంధ్రాలు చేసి క్యాబేజీ లోపలకు ప్రవేశిస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు సంకేతాల కోసం పొలాన్ని, ముఖ్యంగా ఆకుల దిగువ భాగంలో, క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • గుడ్డు సమూహాలు ఉన్న ఆకులను తొలగించండి.
  • ఆకులపైన వున్న గొంగళి పురుగులను చేతితో తొలగించండి.
  • పురుగులు చొరబడలేని మెష్‌తో మొక్కలను కప్పడం ద్వారా ఆడ పురుగులు గుడ్లు పెట్టకుండా నిరోధించండి.
  • ప్రయోజనకరమైన కీటకాలు మరియు పక్షులను వ్యతిరేకంగా ప్రభావితం చేసే పురుగుమందుల వాడకాన్ని నియంత్రించండి.
  • క్యాబేజీ పొలాల దగ్గర ఈ తెగులు సోకే అవకాశం వున్న మొక్కలను నాటకండి.
  • ప్రత్యామ్నాయ అతిధులుగా ఉపయోగపడే కలుపు మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి