జొన్న

జొన్న మిడ్జ్

Stenodiplosis sorghicola

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ముడుతలు పడి రూపం కోల్పోయిన ఖాళీ లేదా పొట్టు లాంటి విత్తనాలు.
  • ఎండిపోయిన లేదా పేలిన కంకులు ఏర్పడతాయి.
  • వాటిని నలిపినప్పుడు ఎరుపు రంగు ద్రవం స్రవిస్తుంది.
  • స్పైక్‌లెట్స్ కొనల వద్ద చిన్న, పారదర్శక మిడ్జ్ ప్యుపాలు.
  • ఈ మిడ్జ్ పురుగులు ప్రకాశవంతమైన నారింజ రంగు , పారదర్శక రెక్కలు మరియు పొడవైన యాంటెన్నాలతో దోమ లాంటి రూపాన్ని కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

జొన్న

లక్షణాలు

గ్లూమ్స్ లోపల వృద్ధి చెందుతున్న ధాన్యాన్ని లార్వా తిని వాటి పెరుగుదలను నిరోధిస్తుంది. దీనివల్ల విత్తనాలు ముడుతలు పడి, వికృతంగా, ఖాళీగా, పొట్టులాగా మారతాయి. పరిపక్వత చెందిన పంటలో, కంకులు ఎండిపోయిన లేదా పేలిన రూపాన్ని కలిగి ఉంటాయి. స్పైక్‌లెట్స్ కొనల వద్ద చిన్న, పారదర్శక మిడ్జ్ ప్యుపాలు కనపడతాయి. వాటిని నలిపినప్పుడు ఎరుపు రంగు ద్రవం స్రవిస్తుంది. ఇది మిడ్జ్ లార్వా లేదా ప్యూపా యొక్క శరీరం నుండి స్రవించిన ద్రవము. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కంకిలో గింజలు మొత్తం ఖాళీ అయిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

యుపెల్మస్, యుపెల్‌మిడే, టెట్రాస్టిచస్ మరియు అప్రోస్టోసెటస్ (ఎ. డిప్లోసిడిస్, ఎ. కోయిమ్‌హాటొరెన్సిస్, ఎ. గాలా) ఫామిలీ యొక్క నల్లని చిన్న పరాన్నజీవి కందిరీగలు S. సోర్గికోలా యొక్క లార్వాను తింటాయి. అందువలన వీటి జనాభాను తగ్గించడానికి పైన ఉదహరించిన కందిరీగలను పొలంలోకి ఆకర్శించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో మిడ్జ్ యొక్క రసాయన నియంత్రణ కష్టం ఎందుకంటే లార్వా, ప్యూపా మరియు గుడ్లు స్పైక్లెట్స్ లోపల రక్షించబడతాయి. పూత సమయంలో పెద్ద పురుగులు ఉదయాన్నే బైటకి వచ్చే సమయంలో పురుగుమందులను వాడాలి. ఇతర సమయాల్లో పురుగు మందుల వాడకం నిష్ఫలంగా ఉంటుంది. క్లోర్‌పైరిఫోస్, సైఫ్లుత్రిన్, సైథలోథ్రిన్, ఎస్ఫెన్‌వాలరేట్ లేదా మలాథియాన్ కలిగిన మందులను ఉపయోగించవచ్చు. పంట కోత తర్వాత, జొన్న ధాన్యాలను ఫాస్ఫిన్‌తో ఫ్యుమిగేషన్ చేసి స్పైక్‌లెట్లలోని లార్వాలను చంపవచ్చు. కొత్త ప్రాంతాలకు తెగులు వ్యాపించే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.

దీనికి కారణమేమిటి?

దీని లక్షణాలు ప్రధానంగా జొన్న మిడ్జ్, స్టెనోడిప్లోసిస్ సోర్గి కోలా యొక్క లార్వా వల్ల కలుగుతాయి. ప్రకాశవంతమైన నారింజ శరీరం, పారదర్శక రెక్కలు మరియు చాలా పొడవైన యాంటెన్నాతో పెద్ద మిడ్జ్ దోమ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరియు తేమ పెరిగినప్పుడు, ఇవి ధాన్యంలోని వాటి నిద్రావస్థ నుండి బయటకు వచ్చి ఒక గంటలోనే సంభోగంలో పాల్గొంటాయి. కొంతకాలం తర్వాత, ఆడ పురుగులు ప్రతి స్పైక్‌లెట్‌లో 1 నుండి 5 చిన్న, స్థూపాకార మరియు పారదర్శక గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు 2 నుండి 3 రోజులలో పొదుగబడి చిన్న, రంగులేని లార్వా వృద్ధి చెందుతున్న ధాన్యం యొక్క మృదు కణజాలాన్ని తినడం ప్రారంభిస్తుంది. 10-15 రోజులు నిరంతరంగా తిన్న తర్వాత, ముదురు-నారింజ లార్వా గింజలో ప్యూపాగా మారిన తర్వాత మళ్లీ వీటి జీవిత చక్రం ప్రారంభమౌతుంది. పంట కోత తరువాత, అప్పటికీ ధాన్యంలోనే ఉన్న లార్వా నిద్రావస్థలోకి ప్రవేశించి అక్కడే అవి 3 సంవత్సరాల వరకు విశ్రాంతిగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధకత కలిగిన లేదా స్థితిస్థాపక రకాలు వాడండి.
  • ఒకే సమయం, లోతులో ఒకే విధంగా నాటండి.
  • సీజన్ ప్రారంభంలో నాటండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల అడవి జొన్న, జాన్సన్ గడ్డి మరియు సుడాన్ గడ్డి వంటి ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • పొలంలో మంచి పరిశుభ్రత ఉండేలా చూసుకోండి.
  • తెగులు మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి సోకిన స్పైక్‌లెట్లను తొలగించండి.
  • పంట కోతల తర్వాత మొక్కల అవశేషాలను తొలగించండి లేదా కాల్చివేయండి.
  • మంచి పంట మార్పిడిని (పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు లేదా చెరకు) అమలు చేయండి.
  • కంది, పత్తి, సోయాబీన్స్, అలసంద కుసుమ (కార్థమస్ టింక్టోరియస్) లేదా ఇతర చిక్కుళ్ళ జాతి పంటలను అంతర పంటగా వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి