వంకాయ

ఎగ్ ప్లాంట్ లీఫ్ రోలర్

Eublemma olivacea

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • సీజన్లో కాస్త ఆలస్యంగా నాటండి.
  • మీ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సరైన సమతుల్య ఎరువుల ప్రణాళికను ప్లాన్ చేసుకోండి.
  • మీ మొక్కలను లేదా పొలాన్ని చీడల కొరకై తరుచుగా గమనిస్తూ వుండండి.
  • సంక్రమణము జరిగిన ఆకులను మరియు గొంగళి పురుగులను చేతితో తొలగించి నాశనం చేయండి మరియు మీ పంట వ్యర్ధాలను తగులపెట్టండి.
  • చీడలకు సహజ శత్రువులైన వాటిని నాశనము చేసే అనాలోచిత మయిన పురుగుల మందుల వాడకాన్ని తగ్గించండి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వంకాయ

లక్షణాలు

లార్వాలు మాత్రమే ఆకులకు నష్టమును కలిగిస్తాయి. ఈ లార్వాలు తినడం వలన పొడవుగా చుట్టబడిన ఆకులు, అందులో లార్వాలు కనిపిస్తాయి. ఇవి అక్కడనుండి ఆకుల అంతర్గత ఆకుపచ్చని కణజాలాన్ని నమిలి తింటాయి. చాలా సమయాలలో మొక్కల పైభాగములలో నష్టం కనబడుతుంది. చుట్టుకొని వున్న ఆకులు గోధుమ రంగులో వుండి వాడిపోయి మరియు ఎండిపోయి వుంటాయి. నష్టం అధికంగా వున్నప్పుడు ఈ గోధుమరంగు మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపించి తరువాత ఆకులు రాలిపోతాయి. కీటకాల జనాభాను నియంత్రించకపోతే గుర్తించతగిన స్థాయిలో పంట దిగుబడి నష్టానికి దారితీస్తుంది. కాని ఈ చీడ మొక్కల పెరుగుదలకు మరియు దిగుబడికి ఒక పెద్ద ప్రమాదకారి కాదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కోటేశియా spp. వంటి పరాన్న కందరీగ జాతికి చెందిన కీటకాలతో జీవనియంత్రణ చేసి ఈ పురుగుల జనాభాను నియంత్రించవచ్చు. మాంటిస్ లేదా ప్రయోజనకారి అయిన లేడీ బర్డ్ బీటిల్ రకాలయిన కీటకాలు కూడా ఈ పురుగులను నియంత్రించడంలో సహాయపడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడకం అవసరమైతే కార్బరిల్ లేదా మాలథీయాన్ కలిగిన ఉత్పత్తులుతో వున్న ఆకులపై పిచికారీను వాడితే ఎగ్ ప్లాంట్ లీఫ్ రోలర్ యొక్క జనాభాను ప్రభావవంతంగా తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఎదిగిన కీటకాలు మధ్య సైజులో వుండి, లేత గోధుమ నుండి ఆలివ్ ఆకుపచ్చ రంగు చీడలు, వీటి ముందు రెక్కల పై భాగమున ఒక పెద్ద ముదురురంగు మచ్చను కలిగి వుంటాయి. వెనుక రెక్కలు పారదర్శకమైన తెల్లటి రంగులో వుంటాయి. ఆడ కీటకాలు గుడ్లను 8-22 గుంపులుగా ఆకుల పైభాగాన పెడతాయి. ఇవి సాధారణంగా లేత ఆకులపైన గుడ్లు పెడతాయి. 3-5 రోజుల తరువాత ఈ లార్వాలు పొదుగుతాయి. ఇవి ఊదా-గోధుమ రంగులో ఉండి పసుపు పచ్చ లేదా క్రీం రంగు బోలు గడ్డలతో వుండి, వెనుక భాగమున పొడవైన వెంట్రుకలు కలిగి వుంటాయి. లార్వాల పెరుగుదల కాలము 4 వారములు. ఆ తరువాత అవి చుట్టబడిన ఆకులలో చేరుతాయి. తరువాత ఒక అదనపు 7-10 రోజుల కాలములో మరొక తరం ఎదిగిన క్రిములు పొడగబడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి సంవత్సరమునకు 3-4 తరాల వరకు ఇవి ఉండవచ్చు.


నివారణా చర్యలు

  • సీజన్ లో కాస్త ఆలస్యంగా నాటమని సిఫార్సు చేయబడినది.
  • ఒక మంచి ఎరువుల వసతి కలిగించే కార్యక్రమముతో మొక్కలను ఆరోగ్యంగా పెంచండి.
  • మీ మొక్కలను లేదా పొలములను రోగము లేదా చీడల కొరకై తనిఖీ చేయండి.
  • సంక్రమణము జరిగిన ఆకులను మరియు గొంగళి పురుగులను చేతితో తీసి వేయండి.
  • సంక్రమణము చెందిన ఆకులను, గొంగళి పురుగులను తీసివేసి మరియు నాశనము చేయండి మరియు మీ వ్యర్థములను కాల్చి వేయండి.
  • చీడలకు సహజ శత్రువులైన వాటిని నాశనము చేసే అనాలోచిత మయిన పురుగుల మందుల వాడకమును తప్పించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి