మొక్కజొన్న

మొక్కజొన్న కంకి తొలుచు పురుగు

Helicoverpa zea

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • లార్వా పట్టు వెంట్రుకలు తింటూ మెల్లగా పొత్తు లోపలి భాగానికి చొచ్చుకుపోతాయి.
  • పొత్తుల చుట్టూ లేదా పైభాగాన బాగా చిరిగిపోయినట్టు వున్న రంధ్రాలు మరియు పొడవుగా మల పదార్ధపు చారలు కనిపిస్తాయి.
  • ఒక్క పొత్తుకు ఒక్కటి కంటే ఎక్కువ లార్వా కనిపించదు.
  • ఈ తెగులు ఆకులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

ఈ పురుగులు పుష్పించే దశను ఇష్టపడతాయి కానీ ఆకులను కూడా తింటాయి. వీటి లార్వా పట్టు వెంట్రుకలు తింటూ మెల్లగా పొత్తులలోనికి చొచ్చుకుపోతాయి. పొత్తుల చుట్టూ లేదా పైభాగాన బాగా చిరిగిపోయినట్టు వున్న రంధ్రాలు మరియు పొడవుగా మల పదార్ధపు చారలు కనిపిస్తాయి. ఒక్క పొత్తుకు ఒక్కటి కంటే ఎక్కువ లార్వా కనిపించదు. ఈ తెగులు ఆకులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. చిరిగిపోయినట్టువున్న అనేక రంద్రాలు పొత్తుల పైభాగంలో మరియు వృద్ధి చెందుతున్న ఆకుల పైన కనిపిస్తాయి. ఇవి పువ్వులను తింటాయి కాబట్టి ఇవి ఫలధీకరణాన్ని మరియు ధాన్యాల నిండటాన్ని జరగకుండా చేస్తాయి. పంట దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.ఈ లార్వా తినడం వలన కలిగే నష్టం వలన ఇతర తెగుళ్లు కూడా మొక్కలకు సోకే అవకాశం వుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పారాసైటోయిడ్ ట్రైకోడెర్మా మరియు టెలీనొమస్ కీటకాలు ఈ పురుగుల గుడ్లను ఆశించడం ద్వారా వీటి జనాభాను (హెలికోవేర్ప జీయ)కొంత వరకు నియంత్రిస్తాయి. లార్వా పారాసైటోయిడ్లు కూడా అందుబాటులో వున్నాయి. ఇతర ఉపయుక్తమైన కీటకాలైన గ్రీన్ లేస్ వింగ్స్, పెద్ద కన్ను పురుగు లేదా డాంసిల్ బగ్స్ ఈ పురుగుల గుడ్లను మరియు చిన్న లార్వాలను తింటాయి. పొత్తుల చివరి భాగంలో ఇంజెక్ట్ చేయడం వలన కొని రకాల నెమటోడ్లు కూడా వీటి జనాభాను తగ్గించడంలో సహాయపడతాయి. నోమురాయి రిలేయి వైరస్ కూడా ఈ పురుగులను నియంత్రించడంలో సహాయపడతాయి. బాసిల్లస్ తురింగైన్సిస్ లేదా స్పైనోసాద్ వంటి జీవ కీటక నాసీనులను సరైన సమయంలో వాడడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు. మినిరల్ ఆయిల్ మరియు వేప నూనెలను పొత్తుల పట్టు దారాలకు పూయడం వలన కూడా మొక్కజొన్న పోతులను ఆశించే పురుగులను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎరువులు వాడటం పెద్దగా ఉపయోగకరం కాదు ఎందుకంటే ఈ లార్వా పోతు లోపలి భాగంలో దాక్కుని ఉండి పురుగుల మందులు దానికి తగలకుండా ఉంటుంది. పెరిత్రాయిడ్, స్పీనేటోరం, మేథోమిల్ లేదా క్లోరో ఫెరిఫోస్ వంటి మందులను వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ పురుగులు ప్యూపా లాగ మారి మట్టిలో 5 నుండి 10 సెంటీమీటర్ల లోతులో జీవిస్తాయి. పెద్ద పురుగులు వసంత కాలంలో బయటకు వస్తాయి మరియు సాయంకాలం మరియు రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటాయి. వీటికి లేత గోధుమ రంగు ముందు రెక్కలు ఉంటాయి. వెనక రెక్కలు తెల్లని బూడిద రంగు అచ్చులు కలిగి ఉంటాయి. దీని చివర ఒక పసుపు రంగు మచ్చ ఉంటుంది.లార్వా వివిధ రంగులలో(పాలిపోయిన పచ్చ నుండి ఎర్రని లేదా గోధుమ రంగు) ఉంటుంది. అవి రాగి రంగు లేదా నారింజ రంగు తలను కలిగి ఉంటాయి. శరీరం అంత నల్లని మచ్చలతో ఉంటుంది. ఆడ పురుగులు తెలుపు గుడ్లను విడి విడిగా పొత్తులపై వుండే పట్టు వెంట్రుకలపై పెడతాయి. లార్వా జుట్టు కలిగి 3.7 మిల్లీమీటర్ల పొడవుతో శరీరం అంతటా నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక మరియు సహనాత్మక రకాలు వాడాలి.
  • మొక్కలను సీజన్లో ముందుగా నాటడం వలన ఈ పురుగుల జనాభా అధికం అవ్వకముందే పంట చేతికి వస్తుంది.
  • పురుగుల జనాభాను పరిశీలించి వెలుతురు లేదా ఫెరోమోన్ వలలు వాడి వీటిని పట్టుకోవాలి.
  • కీటక నాశినులను తక్కువగా వాడి ఇతర ఉపయోగకరమైన కీటకాలు నాశనం అవ్వకుండా చూడండి.
  • పొలంలో పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలు లేకుండా చూడండి.
  • సీజన్ల మధ్యలో పొలాన్ని లోతుగా దున్ని ఈ లార్వా సూర్యరశ్మికి ఇతర పక్షులకు బహిర్గతం అయ్యేలాగా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి