పొగాకు గొంగళి పురుగు - సోయాబీన్

సోయాబీన్

పొగాకు గొంగళి పురుగు

Spodoptera litura

కీటకం


క్లుప్తంగా

 • ఆకులు మరియు కాయలపైన ఇవి తిన్న నష్టం కనిపిస్తుంది.
 • ఆకులు రాలిపోతాయి.

లక్షణాలు

తాజాగా పొదగబడిన లార్వాలు మండలాగా చేరి ఆకులను తింటాయి. ఆ విధంగా ఆకుల కణజాలమును నాశనము చేసి మొక్క ఆకులు అన్ని రాలిపోయేటట్టు చేస్తాయి. ఎదిగిన లార్వాలు రాత్రి సమయములో విడిపోయి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. పగలు వేళలో అవి సాధారణంగా మొక్కల మొదళ్ళ దగ్గర నేలలో దాగి వుంటాయి. తేలికైన నేలల్లో ఈ లార్వా వేరుశనగ కాయలు లేదా వేర్లను చేరి వాటిని నష్టపరుస్తాయి. అవి బాగా అధికంగా తినడము వలన కొమ్మలు మరియు కొమ్మల ఆకులు కలిసే ప్రాంతాలు మాత్రము మిగిలి ఉంటాయి. లార్వాలు మరియు ఎదిగిన పురుగులు, 15 నుండి 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వృద్ధి చెందుతాయి. అయితే అవి ఈ పరిధిలో ఎక్కువ ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి.

ట్రిగ్గర్

ఎదిగిన పురుగులు బూడిద - గోధుమ రంగుల శరీరములు మరియు అంచులలో తెల్లటి ఉంగరము గుర్తులు కలిగిన రంగురంగుల ముందు రెక్కలను కలిగి ఉంటాయి. వెనుక రెక్కలు అపారదర్శక తెలుపు రంగులో ఉండి అంచులు మరియు అంచుల వెంబడి గోధుమరంగు గీతలను కలిగి వుంటాయి. ఆడజీవులు బంగారు గోధుమ రంగు పొలుసులతో కప్పబడిన ఎగువ ఆకు అంచుల మీద వందలాది గ్రుడ్లను ఒక సమూహం లాగా పెడతాయి. పొదిగిన తరువాత వెంట్రుకలు లేని లేత ఆకుపచ్చని లార్వాలు త్వరగా విడిపోయి ఆకులను నిరంతరంగా తినడము ప్రారంభిస్తాయి. ఎదిగిన లార్వాలు ముదురు ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉండి పార్శ్వాలలో నల్లటి మచ్చలు కలిగి వాటి కడుపులు రంగులేకుండా వుంటాయి. రెండు పసుపురంగు నిలువు బ్యాండ్లు, పక్కల నుండి వెళ్లి నల్లటి ముక్కోణపు మచ్చలచే అడ్డగించబడతాయి. ఒక నారింజ రంగు పట్టీ ఈ మచ్చల మధ్య భాగములో కనిపిస్తుంది. లార్వా రాత్రి సమయంలో ఆహారం తీసుకొని పగలు సమయములో నేలలో ఆశ్రయము పొందుతాయి. లార్వా మరియు పెద్దవి 15 నుండి 35°C ఉష్నోగ్రతల మధ్య జీవిస్తాయి, అయితే 25°C బాగా అనుకూలమైనది. తక్కువ తేమ మరియు అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు సంతాన బాహుళ్యమును తగ్గించి వాటి జీవిత చక్రాన్ని పెంచుతాయి.

జీవ నియంత్రణ

ట్రైకోగ్రామా కిలోనీస్, టెలీనొమస్ రీమస్ లేదా అపాంటెల్స్ ఆఫ్రికానస్ లాంటి పరాన్నజీవులైన కందిరీగల జాతులు గుడ్లను మరియు లార్వాలను ఆహారంగా తీసుకొంటాయి. న్యూక్లియర్ పోలీహెడ్రోసిస్ వైరస్ (NPV) లేదా బాసిల్లస్ తురింజినెసిస్ ఆధారితమైన జీవ క్రిమిసంహారకాలు కూడా బాగా పనిచేస్తాయి. ప్రత్యామ్నాయంగా, క్రిమి వ్యాధికారక శిలీంధ్రాలు నోమురియా రిలేయి మరియు సేర్రాషియ మార్చేస్కీన్స్ లను ఆకులపై స్ప్రే చేయవచ్చు. వరి ఊక, మొలాసిస్ లేదా గోధుమ చక్కెర ఆధారిత ఎర ద్రావణాలను సాయంత్రం వేళల్లో నేలపై పంపిణీ చేయవచ్చు. వేప ఆకుల మరియు గుజ్జు నుండి తీయబడిన ప్లాంట్ ఆయిల్ ఎక్సట్రాక్ట్స్ మరియు పొంగామియా గ్లాబ్రా విత్తనాల నుండి తీయబడిన ఎక్సట్రాక్ట్స్ వేరుశనగ ఆకుల మీది స్పోడో ప్టేర లిట్యుర లార్వా పై అధిక ప్రయోజనకారిగా పని చేస్తాయి. ఉదాహరణకు, అజాడిరాచ్టిన్ 1500 ppm @ 5ml / l లేదా NSKE 5% గుడ్డు దశలో వాడవచ్చు మరియు పొదగబడకుండా గుడ్డును నిరోధిస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అధికంగా పురుగు మందుల వినియోగము వలన పురుగులలో నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న వయసులో వున్న లార్వాను నియంత్రించడానికి , వివిధ రకాలైన క్రిమిసంహారకాలను ఉపయోగించవచ్చు, ఉదాహరణకి క్లోరోపైరిఫోస్ (2.5 మిలీ / ఎల్), ఎమేమీక్టిన్ (0.5 గ్రా / ఎల్), ఫ్లుబెండియామిడేడ్ (0.5 మిలీ / ఎల్), లేదా క్లోరంట్రానిలిప్రోల్ (0.3 మిలీ / ఎ) ) అలాగే ఇండక్సికార్బ్బ్ మరియు బైఫెంట్రిన్ వంటివి. ఎర ద్రావణాలు కూడా సమర్థవంతంగా లార్వా జనాభాను తగ్గిస్తాయి, ఉదాహరణకు విషపు ఎర (5 కేజీల బియ్యపు ఊక + 1/2 కేజీ బెల్లం + 500 మిలీ క్లోరోపైరిఫోస్ వంటిది).

నివారణ చర్యలు

 • మీ మార్కెట్ లో తెగులును తట్టుకునే విత్తన రకాల కోసం వెదకండి.
 • కీటకాలు అధికంగా వృద్ధిచెందక ముందే మొక్కలను త్వరగా నాటండి.
 • సీజన్ మధ్యలో కరువు పరిస్థితులను నివారించడము కొరకు క్రమము తప్పకుండా మొక్కలకు నీరు పట్టండి.
 • పొలం చుట్టూ మరియు లోపల పొద్దుతిరుగుడు, జొన్న మరియు ఆముదము లాంటి పంట మొక్కలను నాటండి.
 • పెద్ద పురుగులను ఆకర్షించడానికి లైట్ లేదా ఫిరమోన్ వలలను ఉపయోగించండి.
 • మీ పొలంలో గ్రుడ్ల సమూహాలు, ఆకులను పురుగులు తిన్న నష్టం లేక లార్వాలు వున్నాయేమో పరిశీలించి చూడండి.
 • ట్రాప్ మొక్కల నుండి గ్రుడ్లను మరియు లార్వా ను తొలగించి నాశనం చేయండి.
 • నాటిన తరువాత 15-20 రోజుల లోపల కలుపు తీయండి.
 • సాగు సమయంలో మొక్కలను జాగ్రత్తగా కాపాడండి మరియు మొక్కలకు నష్టము మరియు గాయాలు కలుగకుండా చూసుకోండి.
 • మీ పరికరములు మరియు పనిముట్ల శుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకొనండి.
 • పొలాన్ని బాగా లోతుగా దున్ని స్పోడోప్టేర ప్యూపాను సహజమైన శత్రువులకు బహిర్గతం అయ్యేలాగా చేయండి.