కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లీఫ్ వెబ్బర్

Eucosma critica

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు ఒకదానితో మరోకటి కలిసిపోతాయి.
  • పువ్వులు మరియు కాయలు ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

ఆకులు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. తరచుగా మొగ్గలు ఈ గూడు లోపల ఉండిపోతాయి, ఇది చిగురుల పెరుగుదలను నిరోధిస్తుంది. ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ వ్యాధికి వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతి గురించి మాకు తెలియదు. వ్యాధి సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ సంబంధిత చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. విస్తృత స్థాయి పురుగుమందుల వాడకాన్ని నివారించాలి, ఎందుకంటే అవి ప్రయోజనకరమైన కీటకాలను కూడా చంపగలవు. హెలికోవెర్పా గొంగళి పురుగు, మచ్చల కాయ తొలుచు పురుగు లేదా ప్లూమ్ చిమ్మటను నియంత్రించే రసాయనాలు ఆకు వెబ్బర్ ను నియంత్రించగలవు.

దీనికి కారణమేమిటి?

యుకోస్మా క్రిటికా (గతంలో గ్రాఫోలోత క్రిటికా) లార్వా వలన నష్టం జరుగుతుంది. గోధుమ రంగులో ఉండే ఆడ చిమ్మటలు ఆకు మొగ్గలు మరియు లేత ఆకుల మీద గుడ్లు పెడతాయి. క్రీము-పసుపు రంగు లార్వా ఆకులను కలుపుతుంది మరియు గూడు లోపలే ఉండి లేత చిగుర్లను తింటుంది. ప్యూపా దశ కూడా ఇలా గూడు కట్టబడ్డ ఆకు లోపలే జరుగుతుంది. సీజన్ మొత్తం మొక్కలు ప్రభావితమవుతాయి. విత్తనాల దశలో తెగులు సోకితే పంట తీవ్రంగా ప్రభావితమవుతుంది. 23°C మరియు 30°C మధ్య ఉష్ణోగ్రతలు ఈ తెగులు సంభవించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక చిన్న తెగులు, అందువలన ఎక్కువ ఆర్థిక నష్టం కలిగించదు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలు లేదా ఈ వ్యాధిని తట్టుకునే రకాలు సాగు చేయండి.
  • బంతి లేదా ఆముదం వంటి అంతర పంటలను పెంచండి.
  • కలిసిపోయినట్టున్న ఆకుల కోసం పొలాన్ని గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్క భాగాలను సేకరించి నాశనం చేయండి.
  • తెగులు జనాభాను నియంత్రించడానికి సహాయపడే వీటి సహజ శత్రు కీటకాలను మరియు పరాన్నజీవులను సంరక్షించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి