ఆలివ్

మల్లె చిమ్మట

Palpita vitrealis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • లార్వా ఆకు దిగువ పొరను తినడం వలన మరియు పైపొరను అలాగే వదిలేయడం వలన "కిటికీ గడులు" (విండో పేన్‌లు) ఏర్పడతాయి.
  • ఆకులపై నల్లని మల పదార్ధం మరియు పట్టు దారాలు ఒకదానితో మరొకటి అల్లుకుపోయి ఉంటాయి.పండ్లపై పురుగులు తిన్న రంధ్రాలు మరియు గ్యాలరీలు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

చిన్న లార్వా పై పొరను వదిలి ఆకుల క్రింది పొరను గోకి తింటాయి, . దీని ఫలితంగా వాడిపోయిన, గోధుమ లేదా బూడిదరంగు ఎగువ పొరతో "కిటికీ గడులు" (విండో పేన్‌లు) కనిపిస్తాయి. పెద్ద లార్వా ఆకు ఈనెల మధ్య మొత్తంప్రాంతాన్ని కత్తిరించి తింటాయి. ఈ నష్టం ఆకు కాడల వరకు విస్తరించి ఆకులు రాలడానికి దారితీస్తుంది. తరచుగా ఇవి ఆకు లేదా అనేక ఆకుల భాగాలను పట్టు దారాలతో కలుపుతూ గూళ్లు తయారు చేస్తాయి. తర్వాత వాటిని ప్యూపాగా ఉపయోగిస్తాయి. మొక్కకి నష్టం వాటిల్లిన భాగాలపై నల్లని మల పదార్ధం మరియు సన్నని పట్టు దారాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొక్క కొన మొగ్గలు మరియు పండ్ల మధ్య భాగం వరకు విస్తరించి ఉన్న రంధ్రాలు లేదా గ్యాలరీల రూపంలో పండ్లపై కూడా తినడం గమనించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మల్లె చిమ్మట జనాభా వేగంగా పెరగకుండా నిరోధించడానికి ఉత్తమ మార్గం పాత ఆలివ్ తోటల్లోని రసం పీల్చే పురుగులను తొలగించడం . ట్రైకోగ్రామా మరియు అపాంటెలెస్ జాతికి చెందిన పరాన్నజీవి కందిరీగలు మరియు వీటిని తినే ఆంథోకోరిస్ నెమోరాలిస్ మరియు క్రిసోపెర్లా కార్నియా మల్లె చిమ్మటకు ముఖ్యమైన శత్రువులు. బాసిల్లస్ తురింజియెన్సిస్‌ ఆధారిత ఉత్పత్తులను కూడా పి. యూనియాలిస్‌ నియంత్రణకు ఉపయీగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. 1% కంటే ఎక్కువ పండ్లు ప్రభావితమైనప్పుడు మాత్రమే చెట్లకు రసాయన చికిత్సలను పరిగణలోకి తీసుకోవాలి. వసంతకాలంలో 5% కంటే ఎక్కువ చెట్లు ప్రభావితమైనప్పుడు నర్సరీలు లేదా చిన్న మొక్కలు ఉన్న తోటలకు చికిత్స చేయాలి. డైమిథోయేట్, డెల్టామెత్రిన్ మరియు సైపర్‌మెత్రిన్ అనే క్రియాశీల పదార్ధాలు కలిగిన పురుగుమందులను మల్లె చిమ్మట యొక్క రసాయన నియంత్రణ కోసం ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ప్రధానంగా ఆలివ్ చెట్ల ఆకులపై దాడి చేసే పల్పిటా యూనియాలిస్ లార్వాలు తినడం వల్ల లక్షణాలు ఏర్పడతాయి. చిమ్మటలు ఆకుపచ్చని శరీరాన్ని కలిగి ఉండి దాదాపు 15 మిమీ పొడవు, పూర్తిగా తెల్లటి పొలుసులతో కప్పబడి ఉంటాయి. రెక్కలు అపారదర్శకంగా ఉంటాయి, కొద్దిగా మెరుస్తూ జాలరు అంచులతో ఉంటాయి. ముందు రెక్కలు మధ్యలో రెండు నల్లని చుక్కలు మరియు గోధుమ రంగు అంచులను కలిగి ఉంటాయి. ఆడ పురుగులు లేత ఆలివ్ ఆకులు, పువ్వులు, పండ్లు మరియు కొమ్మలపై 600 వరకు గుడ్లు పెడతాయి. పొదగబడిన లార్వాలు ఆకుపచ్చ-పసుపు రంగులో 20 మి.మీ పొడవు ఉంటాయి. మొదట్లో ఇవి సమూహాలలో ఉంటాయి, కానీ కాలక్రమేణా ఇవి విస్తరించి, అనేక ఆకులను నేయడం ద్వారా తమ స్వంత గూళ్ళను తయారు చేసుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ గొంగళి పురుగులు గణనీయమైన నష్టాన్ని కలిగించవు. అయితే, ఇవి నర్సరీలలో సమస్యగా మారవచ్చు.


నివారణా చర్యలు

  • దేశంలో అమలులో ఉన్న క్వారంటైన్ నిబంధనల గురించి తెలుసుకోండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక లేదా స్థితిస్థాపక రకాలను నాటండి.
  • పి.
  • యూనియనలిస్ సంకేతాల కోసం ఆలివ్ చెట్లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.
  • వీటి జనాభా వేగంగా పెరగకుండా నిరోధించడానికి పాత ఆలివ్ తోటల్లోని రసం పీల్చే పురుగులను తొలగించండి.
  • విస్తృత చర్య కల పురుగుమందుల వాడకం వీటి సహజ శత్రువులను కూడా నాశనం చేస్తాయి.
  • అందువలన వాటి వాడకాన్ని నివారించండి.
  • తోటల మధ్య వ్యాధి సోకిన మొక్కల పదార్థాలను రవాణా చేయవద్దు.
  • ప్రస్తుతం ఉన్న చిమ్మటల సంఖ్యను గుర్తించడానికి మరియు నియంత్రణ చర్యలను వర్తింపజేయడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి