ఇతరములు

పుచ్చకాయ పండు ఈగ

Zeugodacus cucurbitae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్లు కుళ్లిపోయి ముందుగానే రాలిపోతాయి.
  • పండ్లపై చిన్న చిన్న రంగు కోల్పోయిన మచ్చలు ఏర్పడతాయి.
  • మొలకలు, వేర్లు, కాండములు మరియు మొక్కలపై కూడా ఈ పురుగులు దాడి చేయవచ్చు.
  • పెద్ద పురుగులు ముదురు గోధుమరంగు తల, వెనక వైపున మూడు ప్రకాశవంతంగా వుండే పసుపు రంగు చారలు మరియు పారదర్శక రెక్కలను కలిగివుంటాయి.

లో కూడా చూడవచ్చు

9 పంటలు

ఇతరములు

లక్షణాలు

జెడ్. క్యూకర్బీటే జాతికి చెందిన ఆడ పురుగులు పండ్ల తోలు లోకి చొచ్చుకొని వెళ్లి గుడ్లు పెడతాయి. లార్వా పండ్లలోకి వెళ్లి గుజ్జును తింటాయి. పండు లోపల ఈ పురుగుల వలన పండు గుక్కు లోపల చెప్పుకోదగ్గ నష్టం కలుగుతుంది. చిన్న మచ్చలు పండ్లపై కనిపిస్తాయి. ఈ మచ్చల పైన ఈ పురుగులు గుడ్లు పెట్టడం వలన పండ్లకు ఇతర సంక్రమణాలు సోకటానికి కారణం అవుతాయి. తెగులు సోకిన పండ్లు కుళ్లిపోయి తొందరగా రాలి పోతాయి. పురుగులు లేత మొలకలపై, పుచ్చకాయ వేర్లపై, దోస జాతి మొక్కలపై కూడా దాడి చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పంట కోత అనంతరం వేడి చికిత్స లేదా చల్లని చికిత్స వలన రవాణాకు ముందు, తరువాత తెగులు సోకకుండా ఆపటానికి పనిచేస్తాయి. పెరుగుతున్న పండ్లను దేనితో ఐనా కప్పివేయటం వలన కూడా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఫెరామోన్స్ లేదా ప్రోటీన్ ఎరలను ( మగ కీటకాలను ఆకర్షించే మిథైల్ యుగోనిల్) ఉపయోగించవచ్చు. యుగోనిల్, బీటా- కథియోఫిల్లిన్మరియు బీటా - ఎలీమెనే కలిగిన వోసిముమ్ శాంక్టం ( హోలీ బాసిల్) మొక్కల సారం సుమారు 0.8 కిలోమీటర్ల వరకు వున్న ఈగలను ఆకర్షిస్తుంది. స్పైనోసాడ్ కలిగిన పదార్థాలను పిచికారి చేయటం వలన కూడా వీటిని నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్ కలిగిన ఉత్పత్తులను కలిగిన కీటక నాశినులను ఈ తెగులును నియంత్రించడంలో కొంతవరకు తోడ్పడుతాయి. ఈ పిచికారీలతో ప్రోటీన్ ఎరలు కలిపి ఈగలను ఆకర్షించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఆడ ఈగలు లేత పండ్ల తోలు క్రింద గుంపులుగా గుడ్లను పెడతాయి. చిన్న పురుగులు ఎదిగినప్పుడు 10 నుండి 12 ఎం ఎం పొడవు ఉంటాయి మరియు పండ్లకు రంధ్రాలు చేసి గుజ్జును తింటూ పండ్లకు నష్టం కలిగిస్తాయి. ప్యూపా స్థితికి 10 రోజుల సమయం పడుతుంది. సహజంగా ఇవి మట్టిలో ప్యూపా దశలో ఉంటాయి. కొన్ని సార్లు పండ్లలో కూడా ఇవి ప్యూపా దశలో ఉంటాయి. ప్యూపా ఒక గుండ్రని గోధుమ రంగు మరియు 6 నుండి 8 ఎం. ఎం. పొడవు కలిగిన గూడులో తయారౌతుంది. పెద్ద పురుగులు 8 నుండి 10 ఎం ఎం పొడవు కలిగి ముదురు గోధుమ రంగు తల మరియు మూడు పసుపు రెక్కలు కలిగి ఉంటాయి. రెక్కలు పారదర్శకంగా ముదురు గోధుమ రేకలు కలిగి 12 నుండి 15 ఎం. ఎం . పొడవు ఉంటాయి. వీటి జీవిత చక్రానికి 3 నుండి 4 వారాల సమయం పడుతుంది.


నివారణా చర్యలు

  • చెట్టు నుండి ఇంకా కొయ్యని అన్ని పండ్లను భూమిలో 0.5 ఎం.
  • ఎం లోతులో పురుగులన్నీ చనిపోయేలా పాతి పెట్టాలి.
  • మట్టిని క్రమం తప్పకుండా దున్నటం వల్ల ప్యూపా సూర్య కిరణాలకు సోకేటట్టు వదిలేయటం లేదా ఇంకా లోతుగా పాతి పెట్టడం చేయవచ్చు.
  • తెగులు నిరోధక రకాలు నాటాలి.
  • ఉచ్చులు వాడి పొలాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి.
  • తెగులు వ్యాధి సోకిన పండ్లని వేరే ప్రాంతాలకి రవాణా చేయకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి