కాప్సికమ్ మరియు మిరప

మిరపలో తామర పురుగులు

Scirtothrips dorsalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పైకి వంకర తిరిగి ఉంటాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.
  • పువ్వులు మరియు పండ్లు కూడా ప్రభావితమవుతాయి.
  • నల్లని గోధుమ రంగు శరీరం మరియు పసుపు రంగు రెక్కలతో చిన్న మరియు సన్నని కీటకాలు.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

చిన్న పురుగులు ఇంకా పెద్ద పురుగులు మొక్కల క్రిందిభాగాలపై ఉపరితలాన్ని గీకి అక్కడనుండి బైటకి వచ్చే కణ ద్రవ్యాన్ని పీల్చుతాయి. తెగులు బారిన పడిన ఆకులు గోధుమ రంగు నుండి నలుపుగా మారతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఆకులు మొత్తం వైకల్యం చెంది తర్వాత ఆకులు మొత్తం ముందుగానే రాలిపోతాయి. పువ్వులను తినడం వలన పూరేకులపై చారలు ఏర్పడి రాలిపోవడం మరియు చనిపోవడానికి దారితీస్తుంది. పండ్లపై పొక్కులు, మచ్చలు మరియు పండ్ల రూపం మారడం వలన వాటి మార్కెట్ విలువ తగ్గుతుంది. ఈ తెగులు సంవత్సరమంతా సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ పొడిగా వుండే వాతావరణంలో మరియు మట్టిలో నత్రజని అధికంగా వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జెనస్ ఓరియం మరియు ఫైటోసీడ్ మైట్స్ అయిన నియోసీయులస్ మరియు అంబ్లీసియస్ స్విర్స్కి ల యొక్క మైన్యూట్ పైరేట్ బగ్స్ వంటి వివిధ పరాన్న జీవులు దానిమ్మ మొక్కలలో కీటకాల నియంత్రణను సమర్థవంతంగా చేస్తాయి. పరాన్నజీవులైన యుసియస్ సోజన్సీస్ E. హిబిస్సి మరియు E. తులారెన్సిస్ కూడా ఈ కీటకాల ఇతర అతిధి మొక్కలైన పెప్పర్ ,మరియు ద్రాక్ష పంటలపై పనిచేస్తాయి. తామర పురుగులు మరియు వీటి లార్వా ( సాయంతం సమయాలలో) ఎండిపోయేటట్టు చేయడానికి డయాటోమాసియాస్ ఎర్త్ ను మొక్క చుట్టూ మరియు ఆకులపైన చల్లండి. వేప నూనెను, స్పైనోతోరం లేదా స్పైనోసాడ్ ను ఆకుల రెండువైపులా మరియూ మొక్కల మొదళ్ళ వద్ద చల్లాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ కీటకాలను నియంత్రించడానికి మలాథియాన్ ను ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు. ఇతర పురుగుల మందులను కూడా ఈ S. డోర్సలిస్ ని నియంత్రించడానికి వాడవచ్చు. ఉదాహరణకు అబామెక్టిన్, మరియు డై మిథియోట్. ఇవి కుకుంబర్ తామర పురుగులకు వ్యతిరేకంగా బాగా పనిచేస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు స్కిర్తో త్రిప్స్ డోర్సలిస్ మరియు రీఫిఫోరో త్రిప్స్ క్రూయిన్టాన్టస్ అనే రెండు రకాల కీటకాల వలన కలుగుతాయి. పెద్ద స్కిర్తో త్రిప్స్ గడ్డి పసుపు రంగులో వుంటాయి. ఆడ కీటకాలు మామూలుగా లేత ఆకులు మరియు మొగ్గలలో బూడిద తెలుపు రంగులో చిక్కుడు కాయ ఆకారములో 50 వరకు గుడ్లు పెడతాయి. వీటి జనాభా పెరిగిన కొలదీ అవి బాగా ఎదిగిన ఆకులను ఎంచుకుంటాయి. ఇవి మూడు నుండి ఎనిమిది రోజులలో పొదుగుతాయి. కొత్తగా పొదగబడిన కీటకాలు చాలా చిన్నవిగా వుండి వాటి శరీరము ఎరుపు రంగులో వుండి తర్వాత పసుపు గోధుమ రంగులోకి మారుతాయి. రూపాంతర ప్రక్రియలోనికి అడుగుపెట్టిన కీటకాలు మొక్క నుండి విడిపోయి రాలిపోతాయి మరియు ఆ మొక్క అడుగుభాగాన నేలపైన వదులు నేల లేక కుళ్ళి పోయిన ఆకుల పైన వాటి అభివృద్ధిని పూర్తి చేసుకొంటాయి. ప్యూపా దశ 2 నుండి 5 రోజులు ఉంటుంది. ఎదిగిన ఆర్. క్రూఎంటేటస్ అనేవి అతి చిన్న పరిమాణంలో ఉండి సన్నము, మెత్తని శరీరం కలిగి వుంటాయి. ఇవి పెద్ద అంచు గల రెక్కలు, నల్లటి గోధుమరంగులో ఉండి 1.4 మిల్లీ మీటర్ల పొడవు పసుపు రెక్కలు కలిగి వుంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉండే తెగులు నిరోధక రకాలను ఎంచుకోండి.
  • తామర పురుగుల జనాభాను పర్యవేక్షించడానికి జిగురు వలలు ఉపయోగించండి.
  • మొక్కలకు సరైన పద్దతిలో నీరు అందించండి.
  • తెగులు సోకిన ఆకులను కత్తిరించి తెల్ల కాగితంపై వాటిని విదిలించండి.
  • తీవ్రంగా తెగులు సోకిన మొక్కలను పొలంలోనుండి తొలగించండి.
  • అధిక నత్రజని ఎరువుల ఉపయోగాన్ని నివారించండి.
  • అధిక మోతాదులలో పురుగుల మందులను వాడడం వలన పంటకు సహాయకారులుగా వుండే కీటకాల జనాభా తగ్గుతుంది, అందువలన పురుగు మందుల వాడకం తగ్గించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ కలుపును తొలగించండి.
  • విండ్‌బ్రేక్‌లు దూరపు ముట్టడి నుండి పొలాలను రక్షించగలవు.
  • ఈ కీటకాల లార్వా బైటకు వచ్చి సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేలా పొలాన్ని బాగా లోతుగా దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి