కనోల

రేప్ పెంకు పురుగు

Brassicogethes aeneus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • క్యాబేజీ లేదా కుసుమ పువ్వుల చుట్టూ మెరిసే నల్లటి పెంకు పురుగులు.
  • మొగ్గలలో రంధ్రాలు.
  • తీవ్రమైన పరిస్థితులలో మొగ్గలు లేని కాండాలు.

లో కూడా చూడవచ్చు

2 పంటలు

కనోల

లక్షణాలు

దాడి యొక్క అత్యంత స్పష్టమైన సంకేతం ఆతిథ్య మొక్క యొక్క పువ్వుల చుట్టూ పాకే మెరిసే నల్లటి పెంకు పురుగులు ఉండటం. పెద్ద పురుగులు మొగ్గల్లో ఎక్కడ తిన్నాయో లేదా గుడ్లు పెట్టాయో మొగ్గలలోని రంధ్రాలు సూచిస్తాయి. మొగ్గలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల మొగ్గలు రాలిపోతాయి. ఇవి పువ్వులలో పుప్పొడి కలిగిన కేసరాలను మాత్రమే తింటాయి మరియు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ తురింగియెన్సిస్ సూత్రీకరణలు బి. ఏనియస్‌కు వ్యతిరేకంగా కొంత వరకు విజయవంతంగా ఉపయోగించబడ్డాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సాధారణంగా డెల్టామెత్రిన్ తో పిచికారి చేసి బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ మొక్కలను ఎర పంటలుగా ఉపయోగించవచ్చు, దాదాపు పూర్తి రక్షణ సాధ్యమని కొన్ని ప్రయోగాలు చూపించాయి, అయితే ఇది ప్రధాన పంటకు ముందు వికసించే ఎర పంటను ఉత్పత్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది, ఇలా సరైన సమయంలో పంట వికసించేటట్టు ప్లాన్ చేయడం కష్టంగా ఉంటుంది. పెరిథ్రాయిడ్ పురుగుమందులు రసాయనానికి నిరోధకత లేదని నిర్ధారణ అయితే బి. ఏనియస్ నియంత్రణకు దీనిని కూడా ఉపయోగించవచ్చు. అయితే, పైరెథ్రాయిడ్ పురుగుమందులు వీటి సహజ శత్రువులను కూడా ప్రభావితం చేస్తాయి. నియోనికోటినోయిడ్స్, ఇండోక్సాకార్బ్ లేదా పైమెట్రోజైన్‌ను పైరెథ్రాయిడ్‌లకు ప్రత్యామ్నాయాలుగా పరిగణలోకి తీసుకోండి. పుష్పించడం ప్రారంభమైన తర్వాత పిచికారీ చేయవద్దు.

దీనికి కారణమేమిటి?

అధికంగా చెట్లు ఉండే ప్రాంతం మరియు సాగు చేయని ఇతర భూములలో పెద్ద పురుగులు శీతాకాలమంతా జీవించి ఉండి వసంత కాలంలో బైటకి వస్తాయి. ఉష్ణోగ్రతలు 12-15°C దాటినప్పుడు అవి చురుకుగా ఎగురుతాయి, వాటి సంతానోత్పత్తి మొక్కలను గుర్తించే ముందు అందుబాటులో ఉన్న ఎటువంటి పువ్వుల పుప్పొడినైనా తింటాయి. కనీసం 3 మిమీ పొడవు గల మొగ్గలలో గుడ్లు పెడతాయి. లార్వా పువ్వులలో పుప్పొడిని తింటుంది, రెండు లార్వా దశలను పూర్తి చేయడానికి 9-13 రోజులు పడుతుంది. పూర్తిగా ఎదిగిన లార్వా అప్పుడు నేలపై పడి, మట్టిలోకి చేరుతుంది. తరువాత, క్రొత్త పెద్ద పురుగులు బయటకి వచ్చి, మరొకసారి శీతాకాలంలో మనుగడ సాగించడానికి స్థలాన్ని ఎంచుకొనే ముందు అందుబాటులో ఉన్న పువ్వుల నుండి పుప్పొడిని తినడం ప్రారంభిస్తాయి. పంటలపై బి. ఏనియస్ యొక్క ప్రాదేశిక పంపిణీ సాధారణంగా సంక్లిష్టంగా మరియు క్రమరహితంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • లోతుగా దున్నడం మానుకోండి, ఇది బి.ఎనియస్ యొక్క పరాన్నజీవులను చంపవచ్చు.
  • మొగ్గలలో పెంకు పురుగులు లేదా రంధ్రాల ఉనికి కోసం మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • పూత పెట్టడం ప్రారంభమైన తర్వాత పురుగుమందులను పిచికారీ చేయవద్దు; పుప్పొడి బీటిల్స్ మొగ్గలకు దూరంగా విప్పారిన పువ్వుల వద్దకు చేరి తెగుళ్ల వలె కాకుండా పరాగ సంపర్కాలుగా మారుతాయి.
  • ఎర వేసిన ఉచ్చులు లేదా ఆన్‌లైన్ పుప్పొడి బీటిల్ వలస సూచనలను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి