నిమ్మజాతి

నల్ల నిమ్మ పురుగు

Toxoptera aurantii

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • కొమ్మలు మరియు పుష్పగుచ్చాలు వంకర పోవడం, మరియు ఆకులు మెలికలు తిరగడం, చుట్టుకుపోవడము లేదా ఆకులు ముడతలు పడడం జరుగుతుంది.
  • సూటీ బూజు నివాసం ఏర్పరచుకునే హనీ డ్యూ వలన నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
  • చెట్లు దృఢత్వాన్ని కోల్పోయి మరియు తక్కువ నాణ్యత కలిగిన పండ్లు తయారవుతాయి.
  • ట్రిస్తేజ వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

నిమ్మ జాతి మొక్కల ఎదుగుదలకు సంబంధించిన అన్ని దశలను ఈ తెగులు ప్రభావితం చేస్తాయి. ఈ పురుగులు పొడవైన చొచ్చుకొని వెళ్లగలిగే నోటి భాగాలు కలిగి ఉంటాయి. ఆకులలో కణద్రవ్యాన్ని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. అందువలన పుష్పగుచ్ఛము మరియు మొగ్గలు వంకరపోయి ఆకులు ఉంగరాలు తిరగడం లేదా చుట్టుకుపోవడం జరుగుతుంది. ఇవి తీయటి మొక్కల నాళాలను తినడం వలన అధిక మొత్తంలో హనీ డ్యూ రూపంలో అధిక చక్కెరను విడుదల చేస్తాయి. ఈ హానీడ్యూ ఆకులపై పడినప్పుడు మసి బూజు శిలీంద్రాలు గుంపుగా ఏర్పడి ఆకులు నల్లబడతాయి. ఇది కిరణజన్య సంయోగక్రియను తగ్గిస్తుంది. దీని వలన మొక్కల సత్తువ తగ్గి పండ్ల నాణ్యత పడిపోతుంది. ఈ పురుగులు మోసుకుని వచ్చే త్రిస్తేజా వైరస్ వలన కూడా మొక్కలకు నష్టం కలుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

హోవర్ ఫ్లయ్స్, లెస్ వింగ్స్ మరియు లేడీ బర్డ్, ఈ తెగులును అన్ని దశలలోను దాడి చేయ గలవు. ఈ పురుగును ఎదుర్కొనేందుకు ఈ తెగులుకు వ్యతిరేకంగా రెండు సాధారణంగా వాడబడే కొక్కినెలిడ్స్, సైక్లోనెడ సంగ్వినియా మరియు హిప్పోడమియా కన్వర్జెన్స్. కొన్నినిర్దిష్ట పరాన్నజీవి కందిరీగలు కూడా కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. తేమ వాతావరణ సమయంలో ఫంగస్ నెయోజిగైట్స్ ఫ్రెసెన్సీ వీటి జనాభాను అదుపు చేయడంలో ఒక ముఖ్య భూమికను పోషిస్తుంది. చీమలను వేడి నీటితో లేదా సహజ పెరిత్రిన్ కలిగిన కీటక నాశినులతో చంపవచ్చు. కీటక నాశినులైన ఉదాహరణకు సబ్బు, డిటర్జెంట్ సబ్బు,వేప లేదా మిరప సారాల పదార్దాలు ఈ పురుగులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ పురుగులను నివారించడానికి పలు రకాల కీటక నాశినులను వాడ వచ్చును కాని వీటి ప్రభావం వీటిని వాడిన సమయం పైన ఆధార పడి వుంటుంది ఉదాహరణకు ఆకులు రింగులు తిరగక ముందే లేదా వాటి జనాభా అధికమవ్వకముందే వాడాలి. ఆ సమయములో వాడడం వలన ఈ మందులు నేరుగా ఈ పురుగుల వద్దకు చేరగలవు. కృతిమ పెరిథ్రోయిడ్స్ కూడా ఈ పురుగుల పైన మరియు చీమలపైన ప్రభావం చూపిస్తాయి. కాని ఈ పురుగుల సహజ శత్రువులపై కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.

దీనికి కారణమేమిటి?

నల్ల నిమ్మ పురుగు (టోక్సోప్తెర ఆరంతి) యొక్క లక్షణాలు ఎదిగిన పురుగులు మరియు శైశవ దశలో వున్న పురుగుల వలన కలుగుతుంది. ఇవి తరుచుగా నిమ్మజాతి చెట్లను మరియు ఇతర రకముల మొక్కలను అఫిడ్ T సిట్రిసిడాజాతి (సాధారణంగా సిట్రస్ అఫిడ్ అని పిలుస్తారు) పురుగులతో కలసి ఆశిస్తాయి. పెద్ద పురుగులు రెక్కలు వున్నవి లేక రెక్కలు లేనివిగా, రెండు రూపాలలో వుంటాయి. రెక్కలు వున్న పురుగులు అధికంగా వున్నప్పుడు లేదా పొలంలో ఆహరం తక్కువగా వున్నప్పుడు 30 కిలో మీటర్ల దూరం వరకు ఎగిరి వెళ్లి అక్కడ ఆహారం వెతుక్కుంటాయి. ఇవి ఒక పేలవమైన గోధుమ రంగు నుండి నల్లటి శరీరము కలిగి 1.5 సెంటీ మీటర్ల వరకు పొడవును కలిగి వుంటాయి. నల్లని నిమ్మ పురుగు ఒక సామాన్య మైన జీవన చక్రము అధిక పునరుత్పత్తి రేటు కలిగి త్వరగా మరియు ప్రమాదకరమైన తెగుళ్లకు దారి తీస్తుంది. వీటి అభివృద్ధికి, జీవనమునకు మరియు పునరుత్పత్తికి కావలసిన ఉష్ణోగ్రత 9.4 నుండి 30.4 డిగ్రీ సెంటీగ్రేడ్. వీటి హనీడ్యూ చీమలను ఆకర్షిస్తుంది మరి అది సహజంగా వేటాడే వాటి నుండి ఈ పురుగులను కాపాడుతుంది. వీటిని త్రిస్తేజ తెగులు మరియు గుమ్మడి పసుపు మొజాయిక్ వైరస్ ల వాహకాలుగా పరిగణిస్తారు.


నివారణా చర్యలు

  • అరోగ్యకరమైన మొక్కల నుండి లేక ఆమోదిత డీలర్ల నుండి విత్తనములు సేకరించండి.
  • అవసరమైతే ఈ తెగులు సోకని ప్రాంతాలలో లేదా భౌగోళికంగా వేరుగా వున్నప్రాంతములో నాటండి.
  • మొక్క నుండి అఫిడ్స్ చేతితో తీసివేయండి లేదా వ్యాధి సోకిన మొక్కలను తొలగించండి.
  • పొలంలోనూ మరియు చుట్టూ కలుపు మొక్కలు తీసి వెయండి.
  • ఎక్కువ నీటిని లేదా ఎక్కువ ఎరువు వేయకండి.
  • ఈ పురుగులనుండి లేక చీమలనుండి చెట్లను కాపాడడానికి వలలను ఉపయోగించండి.
  • ఇతర పొలాల నుండి మరియు ప్రాంతాల నుండి నిమ్మ చెట్లను రవాణా చేయకండి.
  • ఈ పురుగులకు సహజ శత్రువులైన తోటలో వుండే ఇతర పురుగుల సంఖ్య తగ్గకుండా ఉండడానికి పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించండి.
  • పందిరిలో గాలి ప్రసరణ కొరకు మీ చెట్ల శాఖలను కత్తిరించండి లేదా మీ మొక్కల దిగువ ఆకులు తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి