పిస్తా

పిస్తా తోటలో పెంకు పురుగు

Chaetoptelius vestitus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • మొగ్గలు మరియు కొమ్మలకు నష్టం కలిగించి వాడిపోయేలా మరియు చనిపోయేలా చేస్తుంది.
  • కొమ్మలు మరియు కాండంలో పునరుత్పత్తి గేలరీలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పిస్తా

పిస్తా

లక్షణాలు

పెద్ద పెంకు పురుగులు అవి తినే గ్యాలరీలను మొగ్గల ద్వారా రంధ్రాలు చేసి పండు ఏర్పడకుండా వాటిని నాశనం చేస్తాయి. కాండం లేదా కొమ్మలలోని గ్యాలరీలు కణ ద్రవ్యం యొక్క సాధారణ ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి, నీరు మరియు పోషకాలు పై కొమ్మలకు చేరకుండా అడ్డుపడతాయి. పెద్ద పురుగులు ముదురు-గోధుమ రంగులో ఉండి, దాదాపు 2.5-3.5 మి.మీ పొడవు మరియు ముదురు రెక్కల కవర్లతో బిరుసైన వెంట్రుకలతో ఉంటాయి. లార్వా చాలావరకు తెల్లగా గోధుమ రంగు తలతో ఉంటుంది. ఇది ప్రధానంగా బలహీనమైన చెట్లపై దాడి చేస్తుంది. దీనివలన కొమ్మలలో తేమ నశించి విరిగిపోతాయి. చలి కాలంలో, ఉష్ణోగ్రత +5 ° C కంటే తక్కువగా ఉన్నంత వరకు బెరడు పెంకు పురుగులు ఆహారం తీసుకోవడం మానేస్తాయి. పెంకు పురుగులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇది పిస్తా చెట్లకు చాలా హానికరం.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బెరడు పెంకు పురుగులను నియంత్రించడానికి, బలమైన, ఆరోగ్యకరమైన చెట్లను కలిగి ఉండటం మరియు పొరుగు పొలాల రైతులతో కలిసి నివారణ చర్యలను వర్తింపజేయడం చాలా ముఖ్యం. కొన్ని పరాన్నజీవి కందిరీగలు, అలాగే వీటి సహజ శత్రువులైన కొన్ని జాతుల పెంకు పురుగులు మరియు పురుగులు ఈ పురుగులపై దాడి చేస్తాయి, ఉంటాయి. మొత్తం పెంకు పురుగుల జనాభా నియంత్రణలో దాదాపు 10% వరకు ఇవి ప్రభావం చూపిస్తాయని అంచనా వేయబడింది

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవసంబంధమైన చికిత్సలతో నివారణ చర్యలను మిళితం చేసే విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సాధారణ రసాయనాలను పురుగుమందులు బాగా చొచ్చుకుపోయేలా చేసే ఖనిజ నూనెలతో కలిపి వాడినప్పటికీ కూడా ఈ మందులు ఈ తెగులు దగ్గర వరకు చేరుకోలేవు. అందువల్ల, వీటి వ్యాప్తిని నివారించడానికి నివారణ చర్యలు అవసరం. కీటకాలు ప్రభావితమైన తోటల నుండి ఆరోగ్యకరమైన తోటలకు వలసపోకుండా ఉండటానికి వాటిని ఒక ప్రాంతంలోని రైతులందరూ వాడవలసివుంటుంది. బెరడు పెంకు పురుగు ప్రధానంగా బలహీనపడిన చెట్లపై దాడి చేస్తుంది, కాబట్టి చెట్లను ఆరోగ్యంగా ఉంచడం అవసరం (ఎరువులు, నీటిపారుదల, కత్తిరింపు, తెగులు మరియు వ్యాధి నియంత్రణ).

దీనికి కారణమేమిటి?

స్కోలిటిడే కుటుంబానికి చెందిన చైటోప్టెలియస్ వెస్టిటస్ అనే పెంకు పురుగుల వల్ల ఈ నష్టం కలుగుతుంది. ఏప్రిల్-మేలో ఉష్ణోగ్రతలు 25 °C కంటే అధికంగా ఉన్నప్పుడు పెద్ద పురుగులు బయటపడతాయి. ఆరోగ్యముగా ఉండే చెట్ల చిన్న కొమ్మల వద్దకు ఆడ పురుగులు ఎగురుకుంటూ వెళ్లి మొగ్గలు లేదా పూమొగ్గలలోకి చిన్న సొరంగాల వంటి రంధ్రాలను చేసి పూమొగ్గలను నాశనం చేస్తాయి. తరువాత అవి చిన్న రెమ్మలు మరియు కొమ్మలను కూడా తినడం ప్రారంభిస్తాయి, ఈ నష్టం యొక్క పర్యవసానంగా రెమ్మలు మరియు కొమ్మలు చాలా త్వరగా ఎండిపోతాయి. ఈ పెంకు పురుగులు వేసవి మరియు చలికాలంలో పిస్తా చెట్టు కొమ్మల లోపల నిద్రాణస్థితిలో ఉంటాయి. శీతాకాలం చివరిలో, ఆడ పురుగులు బలహీనమైన లేదా విరిగిన కొమ్మలలో పునరుత్పత్తి గ్యాలరీలను తవ్వి, సుమారు 80-85 గుడ్లు పెడతాయి.


నివారణా చర్యలు

  • ఒత్తిడిని నివారించడానికి, ముఖ్యంగా పొడి కాలంలో, షెడ్యూల్ ప్రకారం నీరు పెట్టండి.
  • తెగులు సోకిన ఎండిపోయిన మరియు బలహీనమైన కొమ్మలను కత్తిరించి కాల్చివేయండి.
  • తోటలోనుండి కలుపు మొక్కలు మరియు చనిపోయిన కొమ్మలను వెంటనే తొలగించండి.
  • బెరడు పెంకు పురుగు, దాని లార్వా లేదా వాటి గ్యాలరీల ఉనికి కోసం కత్తిరించిన మొక్క భాగాలను చెక్ చేయండి.
  • పెద్ద పురుగులను బలహీనమైన, ఎండిపోయిన కొమ్మల వద్దకు ఆకర్షించడానికి తోటలో చెక్క ఉచ్చులను కూడా ఉంచవచ్చు, తర్వాత వాటిని తొలగించి కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి