ఇతరములు

పారదర్శక పొలుసు పురుగులు

Aspidiotus destructor

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ కీటకం ఆకులు, కాడలు మరియు పండ్ల నుండి వచ్చే మొక్క స్రావాన్ని ఆహారంగా తీసుకుని, క్లోరోసిస్ మరియు కణజాలాల రూపమార్పిడికి కారణమవుతుంది.
  • తీవ్రమైన చీడ వున్నప్పుడు , ఆకులు లేదా పండ్లు పూర్తి పసుపుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి మారిపోయి రాలిపోవచ్చు.
  • మొత్తం మొక్క పెరుగుదల మందగించవచ్చు లేదా చనిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఈ కీటకం ఆకుల నుండి వచ్చే మొక్క స్రావాన్ని ఆహారంగా తీసుకుని, క్లోరోసిస్ మరియు కణజాలాల రూపమార్పిడికి కారణమవుతుంది. ఆకుల క్రింది భాగం ప్రధానంగా దాడికి గురవుతుంది, అయితే కాడలు, పూల గుత్తులు మరియు లేత పండ్లు కూడా ప్రభావితం కావచ్చు. తీవ్రమైన చీడ వున్నప్పుడు, ఆకులు లేదా పండ్లు పూర్తి పసుపుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి మారిపోయి రాలిపోవచ్చు. బాగా చిన్న సైజులో, వేయించిన గుడ్ల లాగా కనిపించే దగ్గర దగ్గరగా వుండే నివాసాలు ఏర్పడటం ద్వారా ఈ చీడలు గుర్తించబడతాయి. ప్రభావిత చెట్ల యొక్క ప్రకాశవంతమైన పసుపు రంగు చాలా దూరం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. పండ్లు పాలిపోయి ముందుగానే రాలిపోవచ్చు. మొక్క మొత్తం పెరుగుదల మందగించవచ్చు లేదా తీవ్రమైన సందర్భాలలో చనిపోవచ్చు కూడా.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పొలుసు పురుగుల నుండి మొక్కలను విముక్తి చేయడానికి 47° మరియు 49°C వద్ద గల నీటితో వరుసగా 15 మరియు 10 నిమిషాల పాటు చేసే చికిత్సలు సహాయం చేయవచ్చు. కొబ్బరి పొలుసు కీటకాల వేటాడే జాతులలో రైజోబియస్ లోపన్థే, చిలోకోరస్ నిగ్రటిస్, తెల్సిమియా నైటిడా, స్యుడోసిమ్నుస్ అనోమలస్ మరియు క్రిప్తోగ్నథా నోడిసెప్స్ వంటి లేడీబర్డ్ బీటిల్స్ వుంటాయి. కీటక జనభాలను నియంత్రించడానికి పరాన్న కందిరీగలను కూడా ప్రవేశపెట్టవచ్చు: వీటిలో అఫిటిస్ మెలినస్, అఫిటిస్ లింగ్నాలెన్సిస్ మరియు కాంపెరియెల్ల బైఫస్సియట వుంటాయి. ఈ సహజ శతృవులు లేకపోతే వీటి జనాభాలో గణనీయమైన పెరుగుదల సంభవించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రాలర్ దశలు సాధారణంగా క్రిమిసంహారకాలకు ఎక్కువ ఆకర్షితం అవుతాయి. అవి వాటి మైనపు రక్షణను అభివృద్ధి చేసుకునే కొద్దీ, ఈ కీటకాలు చికిత్సలకు మరింత అనువుగా అవుతాయి. పైరిప్రాక్సీఫెన్ గల వాడకం సిఫార్స్ చేయబడ్డాయి. తీవ్రమైన చీడ యొక్క సంపూర్ణ నిర్వహణ కోసం 15 నుండి 20 రోజుల అంతరాలలో అనేక పిచికారీలు వాడకాలు అవసరం కావచ్చు.

దీనికి కారణమేమిటి?

కొబ్బరి పొలుసు ఆస్పిడితోటస్ డిస్ట్రక్టర్ వల్ల నష్టం జరగవచ్చు. కొబ్బరితో పాటు, ఇది మామిడి, పామ్, బొప్పాయి, ఫికస్, అవోకాడో మరియు నిమ్మజాతి వంటి ఆర్థిక ప్రాముఖ్యత యొక్క ఉష్ణమండల చెట్ల పై కూడా దాడి చేస్తుంది. ఇతర సాయుధ పొలుసుల మాదిరిగా, అవి చిన్న వేయించిన గుడ్లు వలె కనిపించే ఒక మైనపు పొర ద్వారా రక్షించబడే నివాసాల్లో ఆకుల అడుగు భాగంలో స్థిరపడతాయి. అవి ఆహారం తీసుకునేటప్పుడు మొక్క కణజాలాలలోకి ఇంజెక్ట్ చేసే ఒక విషపూరిత లాలాజలం కారణంగా ఆకు కణజాలాల రూప మార్పిడి జరుగుతుంది. తీవ్రమైన చీడ వున్న సందర్భంలో ఆడ కీటకాలు బాహ్య చర్మాన్ని కప్పుతూ వాటి శరీరం చుట్టూ తెల్లటి గుడ్లను పెడతాయి. ప్రారంభ నింఫ్స్ సాపేక్షంగా పెద్ద దూరాలకు (1 మీటర్ వరకు) స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పించే కాళ్ళను కలిగి ఉంటాయి. ఈ క్రాలర్లు అని పిలవబడేవి కూడా గాలి, ఎగిరే కీటకాలు మరియు పక్షుల ద్వారా, అలాగే రైతులచే తెగులు సోకిన మొక్కల పదార్ధాల రవాణా ద్వారా ఎక్కువ దూరాలకు పంపిణీ చేయబడతాయి. ఎ. డిస్ట్రక్టర్ యొక్క జీవిత చక్రం సాధారణంగా 32 నుండి 34 రోజుల పాటు వుంటుంది.


నివారణా చర్యలు

  • బాగా ఏపుగా ఎదిగే మొక్కలను ఈ తెగులు త్వరగా ఆశిస్తుంది కాబట్టి అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించండి.
  • దట్టమైన పొదలను నివారించడానికి చెట్లను కత్తిరించండి.
  • తెగులు సోకిన ఆకులు, కొమ్మలు మరియు రెమ్మలను తీసివేయడం వలన నర్సరీలలో పొలుసుల కీటకాలను నియంత్రించవచ్చు.
  • తోటలను అత్యంత పరిశుభ్రంగా ఉంచండి.
  • పొలం చుట్టూ ప్రక్కల బెండ మరియు అబుటీలోన్ ఇండికమ్ (తుతూర్ బెండ) ను సాగు చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి