ఎండుద్రాక్ష

రెడ్‌ కరంట్ బ్లిస్టర్ పేనుబంక

Cryptomyzus ribis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పై ఆకులపై ఎరుపు, ఊదా లేదా పసుపు పచ్చని పొక్కులు.
  • వికృతమైన కణజాలం చుట్టూ రంగు మారిన ప్రాంతాలు.
  • తెగులు తీవ్రత అధికంగా ఉన్నపుడు ఆకులు వక్రీకరణ చెందుతాయి.నల్ల బూజు పెరుగుదలను తేనె బంక ప్రోత్సహిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఎండుద్రాక్ష

ఎండుద్రాక్ష

లక్షణాలు

ఎరుపు మరియు తెలుపు రంగు ఎండుద్రాక్ష మొక్కల ఆకుల ఉపరితలంపై ఈనెల మధ్యన ఎరుపు నుండి ఊదారంగు బొబ్బలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నల్ల ఎండుద్రాక్షపై సాధారణంగా ఈ బొబ్బలు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. రంగు మారిన ప్రాంతాలు తరచుగా రూపు మారిన కణజాలం చుట్టూ ఉంటాయి. ప్రధానంగా రెమ్మ కొనల వద్ద ఆకులు దగ్గరగా ముడుచుకుపోయినట్టు లేదా వక్రీకరణ చెందినట్టు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు చాలా తీవ్రంగా వక్రీకరణ చెందుతాయి. వసంత ఋతువు చివరిలో-వేసవి ప్రారంభంలో పొక్కులు ఉన్న ప్రాంతాల క్రింద పాలిపోయిన పసుపు రంగు పేనుబంక కనిపిస్తాయి. ఆకుపై తేనె బంక కూడా కనిపిస్తుంది ఇది చివరికి అవకాశవాద నల్ల బూజు పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, సాధారణంగా, ఆకులపై తేలికపాటి లక్షణాలతో వుండే మొక్కలు సాధారణ స్థాయిలో పంటను ఉత్పత్తి చేయగలవు

Recommendations

సేంద్రీయ నియంత్రణ

లేడీబగ్స్ వీటి సహజ శత్రువులు- వ్యాప్తి సంభవించినప్పుడు వీటిని తోటలో పరిచయం చేయవచ్చు. హార్టికల్చరల్ సబ్బును కలిగి ఉన్న స్ప్రేలు లేదా డిటర్జెంట్ యొక్క తేలికపాటి ద్రావణం రెడ్‌కరెంట్ పొక్కు పేనుబంక నియంత్రణకు సరిపోతుంది. పైపు ద్వారా అధిక వత్తిడితో నీటిని పిచికారీ చేయడం ద్వారా పేనుబంక తొలగించవచ్చు. మంచి నాణ్యమైన హార్టికల్చరల్ ఆయిల్ ను గుడ్లను చంపడానికి ఉపయోగించవచ్చు. అప్పుడే ఉద్భవిస్తున్న పేనుబంక ను చంపే ఇతర సేంద్రీయ సూత్రీకరణలలో పైరెత్రమ్ మరియు కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. చాలా తీవ్రమైన సందర్భాల్లో, డెల్టామెత్రిన్ లేదా లాంబ్డా-సైహలోథ్రిన్ అనే క్రిమిసంహారక మందులను కలిగి ఉన్న పిచికారీని అప్పుడే బైటకి వచ్చే పేనుబంక ను చంపడానికి ఉపయోగించవచ్చు. ఆకులు ముడుచుకుపోయిన తర్వాత పిచికారీ చేయడంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువలన లక్షణాలు కనిపించిన వెంటనే ఈ మందులను పిచికారీ చేయండి. తేనెటీగలు మరియు ఇతర పరాగసంపర్క కీటకాలకు ఈ మందుల వల్ల నష్టం కలుగుతుంది. అందువలన పుష్పించే మొక్కలపై ఈ మందులను పిచికారీ చేయవద్దు.

దీనికి కారణమేమిటి?

రెడ్‌కరెంట్ బ్లిస్టర్ అఫిడ్, క్రిప్టోమైజస్ రిబిస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది. వసంత ఋతువు చివరిలో లేదా వేసవి ప్రారంభంలో కనిపించే ఆకు క్రింది భాగం నుండి ఆకుల రసాన్ని పీల్చే రెక్కలు లేని, లేత పసుపు రంగు పేను బంక పురుగుల కంటే దగ్గరగా ముడుచుకుపోయినట్టు లేదా వక్రీకరణ చెందిన ఆకు కణజాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..పేను బంక ఆకులను తినే ప్రక్రియలో ఆకులలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడం వల్ల రసం పీల్చడం వలన పొక్కులు ఏర్పడడం మరియు రంగు మారడం జరుగుతుంది. మధ్య వేసవి నాటికి రెక్కల పేనుబంక ఉత్పత్తి అవుతాయి, ఇవి ద్వితీయ అతిధేయ మొక్కలకు ప్రధానంగా హెడ్జ్ ఊండ్ వోర్ట్ (స్టాచిస్ సిల్వాటికా) వలసపోతాయి,. ఇవి శరదృతువు నాటికి మరల తిరిగి వస్తాయి మరియు రెమ్మలపై గుడ్లు పెడతాయి.గుడ్లు వసంతకాలంలో పొదగబడతాయి పేనుబంక కాలనీలను ఏర్పరుస్తాయి, ఇవి ఆకుల దిగువకి వలసపోతాయి. కరంట్ బ్లిస్టర్ అఫిడ్స్, ఎరుపు, తెలుపు మరియు నలుపు కరంట్ జాతి మొక్కలను అలాగే వీటి దగ్గర జాతి అయిన వైల్డ్ జొష్టా బెర్రీ (జెనస్ రైబ్స్ కూడా) ని కూడా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పంట ప్రభావితం కానందున, చాలా తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను తీసుకోవాల్సిఉంటుంది.


నివారణా చర్యలు

  • C.
  • రిబిస్ మరియు వాటి లక్షణాల ఉనికి కోసం ఎండు ద్రాక్ష మరియు సంబంధిత అతిధేయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • పురుగుమందులను విచక్షణారహితంగా ప్రయోగించవద్దు ఎందుకంటే ఇది లేడీబగ్స్ వంటి సహజ శత్రువుల జనాభాను ప్రభావితం చేస్తుంది.
  • నత్రజనిని అధికంగా వాడకండి, నత్రజనిని అధికంగా వాడడం వలన పచ్చని ఆకులు పేను బంకను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
  • మునుపటి పంట అవశేషాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి