ఆలివ్

కర్కులియో ముక్కు పురుగు

Otiorhynchus cribricollis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఇవి పూలు మరియు కాడను తిని రంధ్రాలను చేస్తాయి.
  • దీనివలన పూలు మరియు కాడలు చిరిగిపోయినట్టు కనిపిస్తాయి.
  • పెద్ద పురుగులు మొగ్గల లోపలి భాగంలో ఉన్న పూల భాగాలకు రంధ్రాలు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు

ఆలివ్

లక్షణాలు

పెద్ద కర్కులియో ముక్కు పురుగులు ఆకులపై దాడి చేస్తాయి, రంపం పండ్లవంటి వంటి ఆకారంలో ఆకు అంచులను నమలుతాయి. ఇవి లేత చిగుర్లను కూడా తింటాయి. అప్పుడప్పుడు వాటి చుట్టూ బెరడు వలయాలను కూడా తింటాయి. ఇది నీరు మరియు పోషక రవాణాను బలహీనపరుస్తుంది తద్వారా కొమ్మల క్షీణతకు దారితీస్తుంది. కొన్ని పంటలలో, ఇవి వాటి ముక్కుతో పువ్వులలోకి ప్రవేశించి పునరుత్పత్తి నిర్మాణాలను నాశనం చేస్తాయి. వీటి జనాభా పెరిగితే ముఖ్యంగా చిన్న చెట్లకు, గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. గతంలో పచ్చిక బయళ్ళగా ఉన్న ప్రాంతం నుండి వచ్చిన పెద్ద పురుగులు కొత్తగా నాటిన ద్రాక్షతోటలు లేదా పండ్ల తోటలపై కూడా దాడి చేయవచ్చు. సాధారణంగా ద్రాక్ష లేదా పండ్లు దెబ్బతినవు. లార్వా పంటల వేర్లను తింటాయి కాని అవి కలిగించే నష్టం స్వల్పంగా ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకూ ఈ పురుగులకు వ్యతిరేకంగా జీవ నియంత్రణ ఏజెంట్లు కనుగొనబడలేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియజేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సింథటిక్ పెరిత్రొయిడ్లతో చికిత్సలు కర్కులియో ముక్కు పురుగులను నియంత్రించడంలో అత్యంత ప్రభావవంతమైనవి. ఆల్ఫా-సైపర్‌మెథ్రిన్ కలిగిన ఉత్పత్తుల యొక్క ఆకు పిచికారీలను పండ్లు లేని లేదా ఇంకా పండ్లు రాని ద్రాక్ష తోటల్లో కూడా ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

కర్కులియో ముక్కు పురుగుల వలన (ఒటియోరిన్చస్ క్రిబ్రికోల్లిస్) వల్ల నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు రాత్రి వేళల్లో తింటాయి. పగటిపూట, అవి బెరడు క్రింద, కొమ్మల పట్టీలో పండు మరియు ఆకుల మధ్యన లేదా మట్టిలో వున్న బొరియలలో ఆశ్రయం పొందుతాయి. ఇవి చెట్లపై లేదా నేల పైన వదులుగా ఉండే సేంద్రియ పదార్థంలో గుడ్లు పెడతాయి. ఇవి పొదిగిన తరువాత, చిన్న లార్వాలు మట్టిలోకి తవ్వి మొక్కల వేర్లను తింటాయి. శరదృతువులో ఇవి ప్యూపా దశకు చేరతాయి. ప్యూపా దశ యొక్క పొడవు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, అయితే ఇది సాధారణంగా మూడు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. ఒక మోస్తరు ఉష్ణోగ్రత కుర్కులియో ముక్కు పురుగు యొక్క జీవిత చక్రానికి ఉత్తమంగా ఉంటుంది. ఇది ఒక సంవత్సరానికి ఒక తరాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కానీ వేసవి వేడి తర్వాత వాటిని తిరిగి సక్రియం చెందడం వలన రెండవ తరం ఉందనే అభిప్రాయాన్ని కలుగచేస్తుంది. చాలా పెద్ద ముక్కు పురుగులు ఎగరలేవు కాని కొన్ని పురుగులు తక్కువ దూరం వరకూ ఎగరగలవు.


నివారణా చర్యలు

  • దెబ్బతిన్న కాండాన్ని గమనించినట్లయితే వసంత ఋతువులో, శీతాకాలం నుండి జీవించి వున్న పెద్ద ముక్కు పురుగులను పర్యవేక్షించండి.
  • కలుపు మొక్కలను పూర్తి నియంత్రణలో ఉంచండి.
  • ఎందుకంటే అవి ప్రత్యామ్నాయ అతిధి మొక్కలుగా పనిచేయవచ్చు.
  • పెద్ద ముక్కు పురుగులు కాండం పైకి ఎక్కకుండా చెట్లకు జిగట పదార్ధ రింగులతో రక్షణ కల్పించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి