ఆలివ్

ఆలివ్ అల్లిక రెక్కల పురుగు

Froggattia olivinia

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న మచ్చల వలన ఆకు ఉపరితలం యొక్క రంగు మారడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

ఆకు ఉపరితలంపై పసుపు రంగు మచ్చలు (చిన్న మచ్చల వలన ఆకు ఉపరితలం యొక్క రంగు మారడం) ఏర్పడతాయి. ఇవి గోధుమ రంగులోకి మారి చివరికి రాలిపోతాయి. ఈ నష్టం వలన ఆకులు అకాలంగా రాలిపోతుంది మరియు పండ్ల దిగుబడి తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చిన్న స్థాయిలో, జీవ నియంత్రణ విజయవంతమవుతుంది. అల్లిక రెక్కల పురుగు గుడ్లను తినే పరాన్నజీవి ఉన్నట్లు రిపోర్ట్ చేయబడింది. అయితే, ప్రత్యేకించి పొలంలో ఏ పంట వేయకుండా పొలం ఖాళీగా వుండే సమయాల్లో (గుడ్డు పరాన్నజీవులు సాధారణంగా తేనెను తినేవి) ఈ పరాన్నజీవి చాలా సాంప్రదాయ ఆలివ్ తోటలలో ఉండే అవకాశం లేదు,. దీనిని విజయవంతంగా నియంత్రించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ కీటకం పచ్చ అల్లిక రెక్కల పురుగు.

రసాయన నియంత్రణ

రసాయన చికిత్సలను వర్తించేటప్పుడు మంచి స్ప్రే కవరేజ్ ఉంటే అల్లిక రెక్కల పురుగులను చంపడం సులభం. సహజ అక్కల కర్ర (పైరెథ్రిన్) మరియు కృత్రిమ అక్కల కర్ర (పైరెథ్రాయిడ్స్) ఆలివ్ అల్లిక రెక్కల పురుగును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. సబ్బు లవణాలు అని కూడా పిలవబడే కొవ్వు ఆమ్లాల పొటాషియం లవణాలు ఆలివ్ అల్లిక రెక్కల పురుగులను నియంత్రిస్తాయి. ఉత్పత్తి స్థాయిలో కొన్ని ఆర్గానోఫాస్ఫేట్‌లను ఉపయోగించవచ్చు. కొత్తగా పొదగబడిన పిల్ల పురుగులను నియంత్రించడానికి 10-14 రోజుల తర్వాత రెండవ సారి పిచికారీ చేయండి. పురుగుమందును ఉపయోగిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ రక్షిత దుస్తులను ధరించండి. మోతాదు, వాడవలసిన సమయం మరియు పంట కోతకు ముందు విరామం వంటి సూచనల కొరకు ఉత్పత్తి లేబుల్‌పై ఇవ్వబడిన సూచనలను అనుసరించండి.. పురుగుమందుల వాడకానికి సంబంధించిన స్థానిక నిబంధనలను ఎల్లప్పుడూ అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

ఫ్రాగ్గటియా ఒలివినియా వల్ల నష్టం జరుగుతుంది. సాధారణంగా నష్టం వాటిల్లిన ఆకుల క్రింది వైపున సమూహంగా ఉన్న కీటకాల యొక్క వివిధ దశలను గుర్తించవచ్చు. శీతాకాలంలో చెట్టు మీద ఉన్న గుడ్లు సాధారణంగా వసంత ఋతువులో లేదా శీతాకాలం చివరలో పొదగడం ప్రారంభిస్తాయి. పెద్ద కీటకాలు కొంత దూరం వరకు ఎగరగలవు. అపరిపక్వ మరియు పెద్ద కీటకాలు ఆకులను తినడం వలన ఆకు ఉపరితలంపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వాతావరణాన్ని బట్టి ఆలివ్ అల్లిక రెక్కల పురుగు సంవత్సరానికి అనేక తరాలను కలిగి ఉంటుంది. ఎదిగే సీజన్లో క్రమం తప్పకుండా కొత్త ముట్టడి సంభవిస్తుంది. వీటి అన్ని చలన దశల్లో రంధ్రాలు చేసే మరియు పీల్చుకునే నోటి భాగాలను కలిగి ఉంటాయి, అందువలన అన్ని దశలు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి.


నివారణా చర్యలు

  • కీటకాల దాడికి సంబంధించిన రుజువు కోసం వసంత ఋతువు ప్రారంభంలో చెట్లను పర్యవేక్షించండి.
  • పురుగుల ఉనికిని గమనించిన వెంటనే నియంత్రణ చర్యలను తీసుకోండి.
  • తనిఖీ చేయకుండా వదిలేస్తే అల్లిక రెక్కల పురుగుల జనాభా వేగంగా పెరుగుతుంది.
  • నియంత్రణ పద్ధతులను సులభతరం చేయడానికి అధికంగా తెగులు సోకిన చెట్లను కత్తిరించండి.
  • బాగా దెబ్బతిన్న చెట్లను పునరుద్ధరించడానికి కూడా కత్తిరింపు సహాయపడుతుంది.
  • చెట్లు వృద్ధి చెందే సీజన్లో, ముఖ్యంగా అదే సీజన్‌లో మొదటి ముట్టడి తర్వాత, పక్షం రోజుల ప్రాతిపదికన క్రమం తప్పకుండా తెగులును పర్యవేక్షించడం అవసరం.
  • ఈ పురుగుల జనాభా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలవచ్చు కాబట్టి తోట సరిహద్దులలో చాలా శ్రద్ధ వహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి