ఇతరములు

తీగ (వైర్) క్రిములు

Elateridae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • నాటిన వెంటనే మొలకలు చనిపోవడం మరియు విత్తనాలు గుల్లబారి పోవడం దీని లక్షణం.
  • తరువాత దశల్లో మొక్కలు వాలిపోయి ఎండిపోవడం కాండం ముక్కలుగా అయిపోతాయి కానీ వేర్లకు మాత్రం అంటిపెట్టుకునే ఉంటాయి.
  • పొలంలో సన్నని మొక్కలు లేదా ఒక్క మొండెం మాత్రమే వున్న మొక్కలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి.
  • వసంత ఋతువు మొదలైన సమయంలో ఈ నష్టం అధికంగా కలుగుతుంది.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఈ తీగ క్రిములు భూమిలో మొలకెత్తుతున్న విత్తనాలను, వేర్లను మరియు లేత మొలకలను ఆహారం తీసుకుని ప్రత్యక్షంగా మొక్కలను చంపడం లేదా గాయపరచడం చేస్తాయి. ఈ గాయాలు అవకాశవాద సూక్ష్మ క్రిములకు సరైన ప్రవేశ మార్గం. దీనివలన ఈ లక్షణాలు మరింత దిగజారుతాయి. నాటిన వెంటనే మొలకలు చనిపోవడం మరియు విత్తనాలు గుల్లబారడం మట్టికి ఈ తెగులు సంక్రమించిన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మొక్కల ఎదుగుదల తరువాత దశల్లో లేత మొక్కలు వాలిపోయి ఎండిపోవడం మరియు రంగు మారడం వంటివి జరగవచ్చు. ఈ క్రిములు తినడం వలన మొక్కల మధ్య ప్రాంతంలో వున్న ఆకులకు నష్టం కలగడం లేదా చనిపోవడం మరియు చుట్టూ వున్న ఆకులు పచ్చగా ఉండడం జరగవచ్చు. కాండం ముక్కలుగా మారవచ్చు కానీ ఈ కాండం వేర్లను అంటిపెట్టుకునే ఉంటుంది. పొలంలో సన్నని మొక్కలు లేదా ఒక్క మొండెం మాత్రమే వున్న మొక్కలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. వసంత ఋతువు మొదలైన సమయంలో ఈ నష్టం అధికంగా కలుగుతుంది. వసంత ఋతువులో ఈ తీగ క్రిములు బంగాళా దుంప విత్తనాల్లోకి రంధ్రాలు చేస్తాయి మరియు శరదృతువులో ఎదుగుతున్న దుంపలలోకి చేరతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కొన్ని గ్రౌండ్ పెంకు పురుగులు మరియు రోవ్ పెంకు పురుగులు ఈ తీగ క్రిములను తింటాయి. స్టిల్లేట్టొ ఈగల లార్వా (తేరేవిడై) కూడా ఈ క్రిములను తింటాయి. కొన్ని జాతుల నెమటోడ్లు కూడా వీటిని తింటాయి. మెటర్హిజియం అనిసోప్లై ఫంగస్ ఈ క్రిములను ఆశించి చంపుతాయి. ఈ ఫంగస్ కలిగిన గుళికలతో తీగ క్రిముల నియంత్రణ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటిని నియంత్రించడానికి మొక్కలు నాటే ముందు మరియు నాటిన తర్వాత చికిత్స అవసరం ఉంటుంది. కీటక నాశినులతో విత్తన శుద్ధి చేయడం కొంత వరకూ వీటి జనాభాను నియంత్రించవచ్చు. వీటి వాడకంపై మీ దేశంలో వున్న ఆంక్షలను తెలుసుకోండి.

దీనికి కారణమేమిటి?

క్లిక్ జాతికి చెందిన పెంకు పురుగుల అపరిపక్వ లార్వా దశ కారణంగా ఈ లక్షణాలు ఏర్పడతాయి (ఎలాటెరిడై). తీగ క్రిములు సుమారు 2 సెంటీమీటర్ల పొడవు ఉండి, సన్నగా, సిలెండర్ ఆకారపు శరీరం మరియు తెల్లని పసుపు రంగు లేదా రాగి రంగులో ఉంటాయి. వేసవి కాలంలో ఆడ క్రిములు వందల సంఖ్యలో గుడ్లను ఒక గుంపుగా మట్టిలో పెడతాయి. వదులుగా వుండే నేలలు మరియు ఇసుక నేలలు ఇవి వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. వీటి లార్వా మట్టి లోపల వుండే మొక్కల భాగాలను, మొలకెత్తుతున్న విత్తనాలను మరియు లేత మొలకలను తింటాయి. దీనివలన పంట పల్చబడడం మరియు దిగుబడి తగ్గడం జరుగుతుంది. గోధుమ పంటతో పాటు ఇవి మొక్క జొన్న, గడ్డి రకాలు మరియు కొన్ని కూరగాయల ( బంగాళా దుంప, క్యారట్, ఉల్లి) పంటలపైన కూడా దాడిచేస్తాయి. మొక్కలు నాటిన తర్వాత ఈ పంట నష్టం బయటపడడం వలన దీనిపైన ప్రభావం చూపే చర్యలు తీసుకోవడానికి అప్పటికే ఆలస్యం అవుతుంది. అందువలన మొక్కలు నాటడానికి ముందే ఈ తీగ క్రిముల ఉనికి కోసం పొలాన్ని పరిశీలిస్తూ ఉండడం చాలా ముఖ్యం.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే ఈ తెగులు సంక్రమించని రకాలను ఉపయోగించండి.
  • ఈ తెగులును ఎదుర్కోవడానికి గానూ మొక్కలను నాటే ముందు పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ఎర వలలు లేదా బంతుల పద్దతులను వుపయోగించి ఈ తీగ (వైర్) క్రిములను పట్టుకోవడం మరియు వీటి సంఖ్యను గమనించడం చేయవచ్చు.
  • ఈ తీగ క్రిములు సోకే అవకాశం వున్న ప్రాంతంలో బంగాళా దుంప మొక్కలను వేయవద్దు.
  • త్వరగా మొలకెత్తడానికి వీలుగా వెచ్చని తేమ వున్న మట్టిలో విత్తనాలను నాటండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి