వరి

ఆసియా వరిని తొలుచు పురుగు

Chilo suppressalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • నర్సరీలో వున్నప్పుడే నారు చనిపోతుంది.
  • ఈ పురుగులు ఆకు పైపొర, ఆకులు మరియు ఆకు కాడలను తినడం వలన నష్టం కలుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

మొలకల్లో లేత ఆకులు (చాలామటుకు అప్పటికే నర్సరీలలో వున్నవి) వాలిపోయి చనిపోతాయి. ఈ లక్షణాన్ని "డెడ్ హార్ట్" అంటారు.పెరిగిన మొక్కలల్లో లేత లార్వా ఆకుల మీద ముఖ్యంగా ఆకు పై పొరమరియు ఆకు మీద సన్నటి రంధ్రాలు చేస్తుంది. కణుపుల మొదలు దగ్గర రంధ్రాలు చేసి, మొక్క లోపలికి వెళ్లి మెత్తని కణజాలాన్నితింటుంది, కొన్ని సార్లు ఆకు మొత్తం పూర్తి డొల్లగా చేస్తుంది. ఈ మొక్కలలో పెరుగుదల సరిగా వుండదు మరియు ఆకులు పాలిపోయి(కోరోటిక్), ఆ తర్వాత ఎండి ముడుచుకుపోయి చివరకు రాలిపోతాయి. వరి కంకులలో గింజలు పాలు పోసుకోవు. సాధారణంగా ఈ స్థితిని "వైట్ హెడ్" అని పిలుస్తారు. ఒక లార్వా చాలా మొక్కలను నాశనం చేయగలదు మరియు తెగులు తీవ్రంగా వున్నప్పుడు 100% పంట నష్టాన్ని కలిగిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కొన్ని దేశాలల్లో పరాథెరెసియా క్లారిపాల్పిస్ మరియు ఎరిబోరుస్ సినికస్ వంటి పరాన్న కందిరీగలను వుపయోగించి ఈ కీటకాలను నియంత్రించగలుగుతున్నారు. కొన్నిరకాల సాలెపురుగులు కూడా ఈ తెగులును నియంత్రించడంలో ఉపయుక్తంగా ఉంటాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రిమి సంహారకాలు అవసరం అయితే క్లొరాన్త్రలినిప్రోల్ కలిగిన ఉత్పత్తులను పిచికారీ చేయండి. మొక్కలు విత్తే సమయంలో మరియు ఎదుగుతున్న సమయంలో కీటక నాశక గుళికలు వాడినట్లైతే ఈ తెగులును తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను ముందే గమనించాలి లేకపోతే పంటను కాపాడుకోవడం కుదరదు.

దీనికి కారణమేమిటి?

చిలో సుప్రెస్సాలిస్ అనే ఆసియాకు సంబంధించిన కాండం తొలుచుపురుగు వలన నష్టం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దక్షణ ఆసియాలో కనబడుతుంది. ఇది సాధారణంగా సంవత్సరానికి రెండు తరాలు కలిగి వుంటుంది. గొంగళి పురుగులు లోపలి కణజాలాన్ని తినగా, పెద్దవి బయట వుండే రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ తెగులు వరి పంటనే కాకుండా జొన్న మరియు కొన్ని గడ్డి జాతుల మొక్కలను కూడా ఆశిస్తుంది. చలికాలంలో చెత్త, చొప్ప మరియు కొద్దిపాటి మంచులో ఈ లార్వా జీవిస్తుంది. సాధారణంగా ప్రధాన ఈనే వెంబడి ఆకుల కిందిభాగంలో ఆడ కీటకం 300 వరకు విడతల వారిగా గుడ్లనుపెట్టి వాటిని ఒక గోధుమరంగు ద్రవంతో కప్పుతుంది. గుడ్లు పొదిగిన తర్వాత లార్వా ఆకు యొక్క పైపొరను తినడం ప్రారంభించి ఆ తరవాత ఆకు పొరలను తొలుచుకుంటూ వెళ్లి తద్వారా ఆకులు పసుపుపచ్చగా మారి చనిపోవడానికి కారణం అవుతుంది. ఈ పురుగులు కాండాన్ని చేరుకున్నప్పుడు ఒకసారి ఒక కణుపు చొప్పున వరుసగా అన్ని కణుపుల గుండా తొలుచుకుంటూ వెళ్లి దాన్ని డొల్లగా మారుస్తాయి. మొక్కలలో అధిక మొత్తంలో సిలికా వున్నట్లైతే అది ఈ గొంగళి పురుగులు మొక్కను తినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే తెగులు నిరోధక వరి వంగడాలను వాడండి.
  • లార్వా, పంటను తినడాన్ని మరియు రంధ్రాలు చేయడాన్ని అడ్డుకునే సిలికా అధికంగా కలిగిన రకాలను నాటండి.
  • వరి పొలానికి దగ్గరగా ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను (జొన్న) సాగుచేయవద్దు.ఈ తెగులును నిరోధించడానికి సీజన్ కన్నా ముందే కానీ ముందుగానే చేతికి వచ్చే పంట రకాలను సాగుచేయండి.
  • ఈ తెగులు లక్షణాలను ముందుగానే కనుగొనుటకు పొలాలను తరుచు పరిశీలిస్తూవుండండి.
  • కీటకాలు మునిగేటట్టు పొలంలో అధికంగా నీరు పెట్టండి.
  • పంట కోత పూర్తి అయిన తర్వాత మిగిలిన మొక్కల వ్యర్ధాన్ని మట్టి లోపలవరకు వెళ్ళేటట్టు దున్నండి.
  • వాటి జీవిత చక్రాన్ని నాశనం చేయడానికి చుట్టుపక్కల పొలాల రైతులతో కలసి పంట వేయండి.
  • కీటకాల సహజ శతృవులను కాపాడటానికి క్రిమి సంహారకాలను తగు మోతాదులో వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి