ఇతరములు

చిగుర్లు తినే ఈగలు

Atherigona sp.

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈగ లార్వాలు ఎదుగుతున్న లేత మొలకలను తింటాయి.
  • దీనివలన "డెడ్ హార్ట్" లక్షణాలు ఏర్పడతాయి.
  • లేత చిగుర్ల వద్ద చిన్న, గుండ్రంగా కత్తిరించబడిన భాగాలు కనపడతాయి.
  • ఆకులు పసుపు పచ్చ రంగు లోకి మారిపోయి వాలిపోతాయి, మొలకలలో ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

6 పంటలు

ఇతరములు

లక్షణాలు

గోధుమ మరియు మొక్కజొన్న పంటలలో ఈగ లార్వా లేత మొలకల చిగుర్లను తినడం వలన "డెడ్ హార్ట్" లక్షణాలు ఏర్పడతాయి.లేత చిగుర్ల వద్ద చిన్న, గుండ్రంగా కత్తిరించబడిన భాగాలు కనపడతాయి. అప్పుడే వచ్చిన ఆకులపైన 6 నుండి 7 రోజులలో ఈ లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆకులు పసుపు పచ్చ రంగు లోకి మారి వేలాడి పోయి, మొలకలలో ఎదుగుదల తగ్గిపోతుంది. బాగా దెబ్బతిన్న మొలకలు వాలిపోయి ఎదుగుదల ఆగిపోయి మొక్క పొట్టిగా ఉండిపోతుంది. ఆడ ఈగ ఎక్కువగా గుడ్లు పెట్టినప్పటికీ ఒక మొలకపైన ఒక లార్వా మాత్రమే ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటిని నివారించడానికి ఇప్పటివరకు ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతం ఈ తెగులును అరికట్టడానికి పంటను అదనులో ముందుగా వేసి వీటి జనాభా నుండి పంటకు కాపాడుకోవడం ఒక ముఖ్యమైన మార్గం. పెరిథ్రోయిడ్ కీటక నాశినులు కూడా వీటి జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి.

దీనికి కారణమేమిటి?

గెనుస్ అథెరిగొన జాతికి చెందిన ఈగల లార్వా వలన ఈ నష్టం కలుగుతుంది. వివిధ రకాల ఆహారాన్ని తినే ఈ చిన్న బూడిద రంగు లార్వా గోధుమ, మొక్కజొన్న మరియు జొన్న వంటి ప్రధాన పంటలపై దాడిచేస్తాయి. పండు మిర్చి, బీన్స్ లేదా పప్పు దినుసు పంటలపైన కూడా ఇవి దాడి చేస్తాయి. ఆడ ఈగ కాండంపై లేదా మొక్కల మొదళ్ళ వద్ద వున్న నేలపైన ఒకటి లేదా, చాలా తరుచుగా, రెండు గుడ్లను పెడతాయి.(మూడు నాలుగు ఆకుల దశను ఇవి ఇష్టపడతాయి). పొలంలో వేసిన దిబ్బ ఎరువు ఆడ ఈగలను ఆకర్షించి ఇవి అధికంగా గుడ్లుపెట్టేటట్టు చేస్తుంది. కొత్తగా పుట్టిన లార్వాలు సిలెండర్ ఆకారంలో ఉండి తెల్లని రంగులో ఉంటాయి. ఇవి మొలకల పైకి ఎగబాకుతూ వాటి నోటిలో వున్న కొక్కీలను వుపయోగించి లేత మొలకల చిగుర్లను నములుతాయి. వీటి ప్యూపా దశ కాండం మొదలు వద్ద జరుగుతుంది. మధ్య మరియు దక్షిణ ఆసియా దేశాలలో ఈ ఈగలు పంటకు చాలా తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తున్నాయి.


నివారణా చర్యలు

  • తెగులు సోకిన పొలం నుండి ఆరోగ్యంగా వున్న పొలానికి మట్టిని తరలించకండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.
  • కొన్ని పరిస్థితులలో ముందుగానే విత్తనాలను నాటడం వలన ఈగల అధిక జనాభా నుండి లేత మొలకలను రక్షించుకోవచ్చు.
  • సీజన్లో ఆలస్యంగా నాటడం వలన "డెడ్ హార్ట్" లక్షణాలను నివారించవచ్చు.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • సరైన సమతుల ఎరువులను వినియోగించండి.
  • మొక్కలు మొలకెత్తిన తర్వాత దిబ్బ ఎరువును పొలంలో వేయకండి.
  • పంటకు మేలు చేసే కీటకాలను రక్షించడానికి వీలుగా పొలంలో పురుగుల మందుల వినియోగాన్ని నియంత్రించండి.ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి