ఇతరములు

తెల్ల పురుగులు

Phyllophaga spp.

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఎదుగుదల తగ్గి మొక్కలు రంగు కోల్పోతాయి.
  • పొలంలో కొన్ని ప్రాంతాలలో మొక్కలు వాలిపోయి ఎదుగుతాయి.
  • దెబ్బతిన్న మొక్కల కాండం వంగపండు రంగులోకి మారుతుంది.
  • చల్లని మరియు తడి నేల భూములు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి.


ఇతరములు

లక్షణాలు

ఈ తెల్ల పురుగులు ఎదిగిన మొక్కల ప్రధాన వేరును కత్తిరించడం లేదా నమిలి తినడం చేస్తాయి. మొక్కలు నీరు మరియు పోషకాలను గ్రహించకుండా ఇవి అడ్డుకుంటాయి. దీనివలన మొక్కలలో ఎదుగుదల తగ్గి అవి వాలిపోయి మొక్కల పైభాగంలో వుండే ఆకులు రంగు కోల్పోతాయి. అప్పుడే వస్తున్న మొలకలపై కూడా ఇవి దాడి చేస్తాయి. దీనివలన మొక్కల వరుసలలో ఖాళీలు ఏర్పడడం మరియు మొక్కలు వాలిపోవడం జరుగుతుంది. దెబ్బతిన్న మొక్కల కాండం భాస్వరం లోపం వున్నట్టుగా వంగపండు రంగులోకి మారిపోతుంది. మొక్క జొన్న మొలకల వృద్ధి తగ్గిపోవడం వలన చల్లని మరియు తడిగా వున్న భూములు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జెనెరే టిఫియా మరియు మేజినం మరియు పేలేసినుస్, పోలీ ట్యూటర్ వంటి తెల్ల పురుగుల సహజ శత్రువులను ఉపయోగించవచ్చు. పెర్గోట అన్డట జాతి పరాన్న జీవులను కూడా ఉపయోగించవచ్చు. జెనస్ కోర్డిసెప్స్ లో వుండే ఫంగస్ ఈ తెల్ల పురుగుల లార్వాను ఆశించి ఈ పురుగుల జనాభా నియంత్రణకు తోడ్పడుతుంది. బాసిల్లస్ పోలిల్లేయి మరియు బాసిల్లస్ లెంటిమొర్బస్ బ్యాక్తీరియా బీజాంశాలను మట్టిలో కలపడం వలన ఈ తెల్లపురుగుల జనాభాను నియంత్రించవచ్చు. ఈ అన్ని ఉత్పత్తులు వాణిజ్యపరంగా లభిస్తున్నాయి

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటిని నియంత్రించడానికి విత్తనాలు వేయడానికి ముందే ఈ పురుగుల ఉనికి కోసం పొలాన్ని జాగ్రత్తగా గమనించాలి. మట్టి కీటక నాశినులను వాడి ఫ్యుమిగేషన్ చేయడం వలన వీటి జనాభాను కొంత మేరకు నియంత్రించవచ్చు. విత్తన శుద్ధి చేయడం వలన కూడా ఈ తెల్ల పురుగులను నివారించవచ్చు కానీ ఎటువంటి రసాయనిక చికిత్స దీనికి సిఫార్సు చేయబడలేదు.

దీనికి కారణమేమిటి?

జెనస్ ఫెల్లోఫాగా జాతికి చెందిన చాలా రకాల పెంకు పురుగుల లార్వా వలన ఈ నష్టం కలుగుతుంది. వీటిని తెల్ల పురుగులు అని అంటారు. వీటిలో సుమారు 100 వరకు జాతులు వున్నాయి. ఇతర రకాల తెల్ల పురుగులు కూడా ఉండవచ్చు. అందువలన వీటిని సరిగా గుర్తించడం నేర్చుకోవాలి. బీటిల్స్ 12 నుండి 25 మిల్లీమీటర్ల పొడవు ఉండి పసుపు నుండి ఎర్రని గోధుమ రంగు లేదా నల్లని బలమైన శరీరం కలిగి పొడవుగా ఉంటాయి లార్వా తెల్లని రంగులో ఉండి గోధుమ రంగు తలతో C ఆకారంలో ఉంటాయి. ఇవి 20 నుండి 25 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. వీటికి మూడు జతల కాళ్ళు ఉంటాయి. పొట్ట వెనక భాగం ముదురు రంగులో ఉండి దీని శరీరం అంచు నుండి మట్టి కనపడడం వలన కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. వీటి జీవిత చక్రం అధికంగా ఉండడం వలన వీటి జనాభాను నియంత్రించడానికి నివారణ చర్యలను తీసుకోవడం చాలా అవసరం.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను ఉపయోగించండి.
  • పంట వేసే సమయంలో మార్పులు చేసి ఈ పురుగుల అధిక జనాభా సమయంలో మొక్కలకు నష్టం కలిగించకుండా చూడండి.
  • పొలంలో కొన్ని మొక్కలను తవ్వి తొలగించి వాటి వేర్ల ప్రాంతంలో ఈ తెల్ల పురుగులు ఉన్నాయేమో చూడండి.
  • ఈ తెగులు సోకని బాగా లోతుగా వేర్లు వుండే చిక్కుడు జాతి మొక్కలతో ( అల్ఫాల్ఫా మరియు క్లోవర్స్)పంట మార్పిడి చేయండి.
  • ఈ పురుగులు అధిక మొత్తంలో గుడ్లను పెట్టకుండా ఉండడానికి పొలంలో గడ్డి మరియు కలుపు మొక్కలు లేకుండా చూడండి.
  • ఇంతకు ముందు సోయాబీన్ మరియు బంగాళాదుంప పంటను వేసిన పొలంలో మొక్కజొన్న పంటను వేయకండి.
  • సీజన్ మధ్యలో పొలాన్ని దున్ని ఈ పురుగులను వాటిని వేటాడి తినే పక్షులకు బహిర్గతం అయ్యేటట్టు చూడండి.
  • పంట కోతల తర్వాత పొలాన్ని బాగా లోతుగా దున్ని పంట అవశేషాలను తొలగించి కాల్చివేయండి.
  • లేదా ఈ పురుగులను మట్టిలో నుండి తీసి తినడానికి వీలుగా పందులను పెంచండి.
  • ఈ తెల్ల పురుగుల సహజ శత్రువులకు నష్టం కలగకుండా ఉండడానికి కీటక నాశినులను తక్కువ మోతాదులో వినియోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి