సోయాబీన్

సోయాబీన్ నడికట్టు పెంకు పురుగు)

Obereopsis brevis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • కొమ్మ లేదా కాండంపై రెండు వృత్తాకార గాట్లు.
  • ఆకులు వాలిపోవడం మరియు ఎండిపోవడం.
  • లేత మొక్కల వడలిపోయి, మరణం చెందడం.
  • పెంకు పురుగు పసుపు-ఎరుపు రంగు తల మరియు ఛాతీ, గోధుమ రంగు రెక్కలను కలిగి ఉంటుంది.
  • లార్వా నల్లని తలతో తెల్లని శరీరంతో ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

విత్తన దశలోనే మొక్క యొక్క కొమ్మ లేదా కాండంపై రెండు వృత్తాకార లోతైన గాట్ల ద్వారా లక్షణాలను గమనించవచ్చు. మొలకలు మరియు లేత మొక్కలు వాలిపోతాయి లేదా చనిపోతాయి. పాత మొక్కల ఆకులు కేవలం వడలిపోతాయి లేదా గోధుమ రంగులో ఉంటాయి మరియు అన్నీ ఎండిపోతాయి. ప్రభావిత కొమ్మలపై వృత్తాకార వలయాలు కనిపిస్తాయి. చివరికి గాటుపైభాగం పైన తెగులు సోకిన భాగం ఎండిపోతుంది. తరువాతి ముట్టడి దశలో, మొక్క భూమి నుండి 15-25 సెం.మీ. ఎత్తులో వేరుచేయబడుతుంది,

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు దీనికి సమర్థవంతమైన సేంద్రీయ చికిత్స అందుబాటులో లేదు. సోయాబీన్ నడికట్టు పెంకు పురుగు నియంత్రణకు, నివారణ మరియు సాగు పద్ధతుల వాడకం మాత్రమే పరిమితమైన ప్రత్యామ్నాయ ఎంపికలు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. నష్టం ఆర్ధిక పరిమితి అయిన 5% మించి ఉంటే, గుడ్లు పెట్టకుండా గిర్డిల్ బీటిల్ ను నివారించడానికి మీరు ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ఎన్ ఎస్ కె యి 5% లేదా అజాడిరాచ్టిన్ 10000 పిపిఎం వాడవచ్చు. విత్తే సమయంలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున చల్లవచ్చు. విత్తిన 30 - 35 రోజులలో లాంబ్డా-సైహలోత్రిన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా డైమెథోయేట్ 25 ఇసి @ 2 మి.లీ స్ప్రే చేసి, మరలా 15-20 రోజుల తర్వాత పిచికారీ చేయండి. ఒక హెక్టారుకు 150 మీల్లీ లీటర్ల క్లోరాంత్రనిపోల్ 18.5% ఎస్సీ, ప్రొఫెనోఫోస్ మరియు ట్రైజోఫోస్ కూడా మొక్క ఏపుగా పెరిగే సమయంలో లేదా పుష్పించే సమయంలో సూచించబడతాయి.

దీనికి కారణమేమిటి?

ఒబెరోప్సిస్ బ్రీవిస్ యొక్క తెలుపు రంగు, మృదువైన శరీరం మరియు నల్లని తల కలిగిన లార్వా వల్ల ఈ లక్షణాలు ఎక్కువగా వస్తాయి. ఎదిగిన పెంకు పురుగు దాని పసుపు-ఎరుపు తల మరియు ఛాతీ రంగు, మరియు ఎల్ట్రా (రెక్కల కవర్లు) యొక్క గోధుమ రంగు శరీరం ద్వారా గుర్తించవచ్చు. ఆడపురుగులు నడికట్టు మధ్యన గుడ్లను పొదుగుతాయి. కాండంలోకి లార్వా చొచ్చుకు పోయి లోపలి భాగాలను తినడం వలన కాండంలో ఒక సొరంగం ఏర్పడుతుంది. గాటుపైన ఉన్న తెగులు సోకిన భాగం తగినన్ని పోషకాలు పొందలేకపోతుంది మరియు ఎండిపోతుంది. తీవ్రమైన దిగుబడి నష్టాలు సంభవిస్తాయి. 24-31°C మధ్య ఉష్ణోగ్రత మరియు అధిక సాపేక్ష ఆర్ద్రత ఈ పెంకు పురుగులకు అనువైన వాతావరణ పరిస్థితులు


నివారణా చర్యలు

  • ఎన్ ఆర్ సి-12 లేదా ఎన్ ఆర్ సి-7 వంటి సహన శక్తి కల రకాలను ఉపయోగించండి.
  • సరైన సమయంలో విత్తేటప్పుడు విత్తనాలను సమానంగా నాటండి (అనగా ఋతుపవనాల ప్రారంభంలో).
  • నత్రజని ఎరువులు అధికంగా వాడకండి.
  • ప్రతి 10 రోజులకు ఒకసారి వ్యాధి సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయండి.
  • పంటకోత తర్వాత, పంట అవశేషాలను నాశనం చేయండి.
  • పంట మార్పిడి సిఫార్సు చేయబడింది, కానీ మొక్కజొన్న లేదా జొన్నతో అంతర పంటను నివారించండి.
  • వేసవి నెలల్లో లోతుగా దున్ని తరువాత సీజన్‌కు నేలను సిద్ధం చేయండి.
  • షైంచాను ఉచ్చు పంటగా ఉపయోగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి