ప్రత్తి

ప్రత్తి ఆకు ముడుత తెగులు

Syllepte derogata

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ లార్వా ఆకులను ముడుత చుట్టి ఆకు అంచులను ఆహారంగా తింటుంది.
  • ఈ తెగులు బారినపడ్డ ఆకులు ముడుచుకుపోయి మాడిపోయినట్లై రంద్రాలు పడుతాయి.
  • కాయలు సరిగ్గా ఎదగక పోవడం మరియు ఎదగక ముందే కాయ పగులుతుంది.
  • ఈ తెగులు తీవ్రంగా వున్న సందర్భంలో తీవ్ర పంట నష్టానికి దారి తీయవచ్చు.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
ప్రత్తి
వంకాయ
పెండలం
బెండ
మరిన్ని

ప్రత్తి

లక్షణాలు

ప్రాధమిక లక్షణంగా మొక్క పై భాగంలో వుండే ఆకులు ట్రంపెట్ ఆకారంలో ముడత చుట్టుకొని వుంటాయి. లార్వా లోపల వుండి ఆకు అంచులను నమిలితింటుంది. క్రమంగా ముడుచుకొన్న ఆకులు వంకరగా మారి రాలిపోయి రంద్రాలు పడి రాలిపోవడానికి మరియు కాయ ముదరకుండా ముందే పక్వానికి రావడానికి దారి తీస్తుంది. మొగ్గ నిర్మాణం లేదా పూత దశలో తెగులు సోకితే జరిగితే కాయ ఏర్పడంలో లోపాలు వుంటాయి. అయినప్పటికీ, సాధారణంగా భారీ స్థాయిలో తెగులు దాడి అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. కీటకాల జనాభా నియంత్రించనట్లయితే ఇది గణనీయంగా దిగుబడిని తగ్గిస్తుంది. S. డిరొగట బెండ పంటలో ఒక సాధారణ తెగులు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును తగ్గించడానికి పరాన్నజీవి జాతులు లేదా ఇతర వేటాడే కీటకాలను ఉపయోగించవచ్చు. అపాంటెలస్ sp.మరియు మెసోకోరస్ sp., ఇవి రెండు లార్వా యొక్క పరాన్నజీవి జాతులు, బ్రాచీమియా sp. మరియు మరియు శాంతోపిమ్ప్లా sp. ప్యూపా యొక్క పరాన్నజీవి జాతులు. వీటిని పొలాల్లో విజయవంతంగా ప్రయోగించారు. పురుగుమందులు ఉపయోగించవలసి వస్తే బాసిల్లస్ తురింగియెన్సిస్ (బిటి) కలిగిన ఉత్పత్తులను పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెరిత్రొయిడ్. సైపెర్మెథ్రిన్ మరియు ఇండోక్సకార్బ్ (లేదా వీటి క్రియాశీలక పదార్థాల మిశ్రమం) కలిగిన పురుగుల మందుల వాడకాన్ని ప్రత్తి పంటలో వాడి కీటకాల జనాభాను తగ్గించడంలో కొంతవరకు విజయం సాధించారు.

దీనికి కారణమేమిటి?

ప్రత్తి ఆకు ముడత (సిలెప్టే డిరోగట్ట) లార్వా, మొక్కల ఆకులను తినడం వలన మొక్కలకు నష్టం కలుగచేస్తుంది. పెద్ద కీటకాలు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి మరియు 25-30 మిల్లీమీటర్ల రెక్కలు కలిగి ఉంటాయి. తల మరియు వీపున విలక్షణమైన నలుపు మరియు గోధుమ రంగు మచ్చలు కలిగిన పసుపు-తెలుపు రంగులో ఉంటాయి. ముదురు గోధుమ గీతలు రెండు రెక్కలపై గమనించవచ్చు, ఇవి స్పష్టంగా కనిపించేలా వుంటాయి. ముఖ్యంగా ఆడ కీటకాలు మొక్క పైభాగంలో వుండే లేత ఆకుల దిగువ భాగంలో గుడ్లు పెడుతాయి. మొదట లార్వా ఆకుల క్రింది భాగం ఆహారంగా తిని నెమ్మదిగా ఆకు పైభాగానికి చేరి ఆకులను పట్టు గూళ్ల ఆకారంలో తయారు చేసుకుని ప్యూపా దశకు చేరుకొంటాయి. లార్వా పొడవు 15 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది మరియు అసహ్యమైన పాలిపోయిన ఆకుపచ్చ రంగులో పారదర్శకంగా వుంటుంది.


నివారణా చర్యలు

  • S.
  • డిరొగట సమస్య పునరావృతమౌతూవుంటే తెగులు నిరోధక విత్తనాలను వాడండి.
  • ఈ తెగులు ఉదృతిని తగ్గించుటకు సీజన్ కన్నా కొంచెం ముందు నాటండి.
  • సమతుల్య ఎరువులను వేసి ఆరోగ్యకరమైన మొక్కలను పెంచండి.
  • తెగులు లక్షణాల కోసం మీ మొక్కలు లేదా పొలాలను తనిఖీ చేయండి.
  • తెగులు సోకిన ఆకులను లేదా గొంగళి పురుగులను చేతితో ఏరి వేయండి.
  • వ్యాధి సోకిన ఆకులను లేదా గొంగళి పురుగులను పొలం నుండి సేకరించి కాల్చి వేయండి.
  • వీటి సహజ శత్రువులను నాశనం చేసే విచక్షణారహిత క్రిమిసంహారకాల ఉపయోగాన్ని నివారించండి.
  • ఈ పురుగులను ఆకర్షించడానికి వలలు ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి