ఇతరములు

చెదపురుగులు

Termitidae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • లేత మొక్కలు వాలిపోయి పడిపోతాయి.
  • వేర్ల దగ్గర మరియు వేర్లలో చెద పురుగులు మరియు సొరంగాలు కనపడతాయి.
  • వేర్లు మరియు కాండం లోపల అంత డొల్లగా అయిపోయి లోపల మట్టితో నిండి పోతాయి.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

మొలకల దశ నుండి పంట కోతల వరకూ పంట అన్ని దశలలోనూ ఈ చెద పురుగులు మొక్కలపైన దాడి చేస్తాయి. ఇవి వేర్లకు నష్టం కలుగచేస్తాయి. కొన్ని సార్లు మొక్కల పైభాగంలో మొదట ఈ చీడ లక్షణాలు మొక్కలు వాలిపోవడం ద్వారా కనిపిస్తాయి. మొక్కలను పైకి పీకి వేర్లను గమనించడం ద్వారా చెద పట్టిందని నిర్ధారించుకోవచ్చు. వేర్లకు మరియు కాండం మొదలు వద్ద ఈ జీవించి వున్న పురుగులు కనిపిస్తే మొక్కలకు చెదలు పట్టినట్టే నిర్ధారించుకోవచ్చు. వేర్లు మరియు కాండం లోపల అంత డొల్లగా అయిపోయి లోపల మట్టితో నిండి పోతాయి. బలమైన గాలులు వేసిన సమయంలో కొని మొక్కలు పడిపోతాయి. ఉష్ణోగ్రత అధికంగా వున్న పగటి సమయంలో ఈ చెద పురుగులు మట్టి లో బాగా లోపలి వరకూ వెళ్లిపోతాయి. అందువలన ఉదయం మరియు సాయంత్రం సమయాలలో మొక్కలను పరీక్షించడం చాలా ముఖ్యం.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నెమటోడ్స్ తో కూడిన ద్రావణం ఈ చీడపైన సమర్ధవంతంగా పనిచేస్తుంది. చెదల దిబ్బలపైన బెయువేరియా బస్సియానా ఫంగస్ లేదా కొన్ని మేతర్హిజిం జాతుల ఫంగస్ ను సంవర్ధవంతంగా ఉపయోగించవచ్చు. ఫంగస్ భీజంశాలు కూడా వీటికి వికర్షణగా పనిచేస్తాయి. వేప గింజల కషాయాన్ని (NSKE) పొలంలోనూ మరియు చెట్లపైన చెదలను నిర్మూలించడానికి వాడి మంచి ఫలితాలను పొందుతున్నారు. చెక్క బూడిదను లేదా వేప ఆకులను లేదా విత్తనాలను చెదల రంద్రాలలో వేయడం ద్వారా వీటిని చెదరగొట్టవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోర్ఫెరిఫోస్, డెల్టా మేత్రిన్ లేదా ఇమిడాక్లోప్రిడ్ లను వీటి గూళ్ళలోపలకి ఇంజెక్ట్ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

చెద పురుగులు పెద్ద పెద్ద కాలనీలుగా ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. వీటిలో చాలా మంది పనివాళ్ళు, సైనికులు మరియు పునరుత్పత్తి విభాగాలు ఉంటాయి. కొన్ని సార్లు వీటి గూళ్ళు చాలా వివరంగా ఉంటాయి. కొన్ని చెద పురుగులు తేమతో కూడిన వున్న చనిపోయిన చెట్ల కొయ్యలపైన గూళ్ళను ఏర్పాటుచేసుకుంటే కొన్ని భూగర్భంలో గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయి. భూమి లోపల చేసిన సొరంగాలు ద్వారా రక్షించబడే వీటి గూళ్లకు దూరంగా ద్వారా వెళ్లి ఇవి మొక్కల వేర్లపై మరియు పొలంలో వుండే ఇతర పదార్ధాలను ఆహారంగా తింటాయి. వాటికి ఇతర ఆహారం లభించకపోతే అవి మొక్కలపైన దాడి చేస్తాయి. అందువలన మట్టిలో పుష్కలంగా సేంద్రియ పదార్ధాలు వుండేటట్టు చూడండి. పునరుత్పత్తి చేసే చెద పురుగులకు రెక్కలు ఉంటాయి. సాధారణంగా ముదురు రంగులో ఉండి కళ్ళు బాగా వృద్ధి చెంది రెక్కలు వున్న అనేక మగ మరియు ఆడ పురుగులు సమూహాలుగా ఉత్పత్తి చేయబడతాయి. వర్షాలు పడినప్పుడు సాయంత్రం వేళలో ఇవి సమూహాలుగా ఏర్పడతాయి. ఎగిరిన తర్వాత అవి వాటి రెక్కలను రాల్చివేసి, జత కట్టి మట్టిలో వున్న రంద్రాలలోకి చెక్కలకు వుండే పగుళ్ళలోకి చేరి, నివసించడానికి కొత్త ప్రాంతాలను వెతుక్కుంటాయి.


నివారణా చర్యలు

  • మొక్కలు వేసినప్పుడు పొడిగావుండే నేలలను మరియు తక్కువ సేంద్రియ పదార్ధాలు వుండే నేలలను ఎంచుకోవద్దు.
  • ఉదయం సమయాలలో మరియు సాయంత్రం సమయాలలో మొక్కలను తరుచుగా గమనిస్తూ వుండండి.
  • ఈ చీడతో నష్టం కలిగిన మొక్కలను లేదా మొక్కల భాగాలను తొలగించనుంచి నాశనం చేయండి.
  • మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
  • నీటి ఎద్దడి లేకుండా మొక్కలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • పాట కోతకు వచ్చిన సమయంలో ఈ చీడ పంటపై దాడి చేసే అవకాశం ఉండడం వలన వీలైతే పంట కోతలను ముందుగానే పూర్తిచేయండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • పొలాన్ని లోతుగా తవ్వి చెదల పుట్టలను మరియు సొరంగాలను నాశనం చేసి చీమలు, పక్షులు కోళ్లు వంటి వీటి సహజ శత్రువులకు వీటిని బహిర్గతం చేయండి.
  • పంట మార్పిడి పద్థతులను పాటించండి లేదా అంతర పంటలను వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి