నిమ్మజాతి

సిట్రస్ సెల్లిడ్

Diaphorina citri

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పెద్ద పురుగులు మరియు పిల్ల పురుగులు తినడం వలన మొగ్గలు, పువ్వులు, లేత చిగుర్లు మరియు చిన్న పండ్లకు నష్టం కలిగి అవి బలహీనపడతాయి.
  • సూటీ బూజు పెరగడం వలన కిరణజన్య సంయోగక్రియ మందగిస్తుంది.
  • కొత్త ఆకులు వంకర తిరగడం చుట్టుకుపోవడం చిగుర్ల పొడవు తగ్గడం వలన మంత్రగత్తె చీపురు ఎఫెక్ట్ (విచెస్ బ్రూమ్ ఎఫెక్ట్)కు దారి తీస్తుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

మొక్క ఎదుగుదల దశ మరియు సీజన్ సమయం బట్టి సిట్రస్ సెల్లిడ్స్ చిట్లను వివిధ పద్దతులలో ప్రభావితం చేస్తుంది. పెద్ద పురుగులు మరియు పిల్ల పురుగులు తినడం వలన మొగ్గలు, పువ్వులు, లేత చిగుర్లు మరియు చిన్న పండ్లకు నష్టం కలిగి అవి బలహీనపడతాయి. ఇవి ఆహరం తీసుకుంటున్నప్పుడు ఇవి తేనె బంక( హనీడ్యూ)ను అధికంగా విసర్జిస్తాయి.దీని వలన దానిపైన సూటీ బూజు పెరిగి కిరణజన్య సంయోగక్రియ మందగిస్తుంది.చివరగా వీటి జనాభా అధికంగా వున్నప్పుడు కొత్త ఆకులు వంకర తిరగడం చుట్టుకుపోవడం చిగుర్ల పొడవు తగ్గడం వలన మంత్రగత్తె చీపురు ఎఫెక్ట్ (విచెస్ బ్రూమ్ ఎఫెక్ట్)కు దారి తీస్తుంది. అధిక జనాభా వలన లేత మొక్కల ఎదుగుదల ప్రభావితమై దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు సిట్రస్ ఆకు పచ్చ వ్యాధి కారక సూక్ష్మ జీవులకు వాహకంగా ఉండడం వలన ఇది అత్యంత తీవ్రమైన నష్టం కలిగించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ప్రెడేటర్లు మరియు పారసీటోయిడ్లు వీటి జనాభా తక్కువగా వున్నప్పుడు వీటిని నిరంతర నియంత్రణలో ఉంచుతాయి. (ఉదాహరణకు అధిక ఉష్ణోగ్రత, పొడి వాతావరణం) టమరిక్సియా రేడియేట లేదా సెల్లైఫాగస్ యుఫిల్యూరై జాతులు వీటి పరాన్న జీవులు . పైరేట్ బగ్ అంతోకోరిస్ నెమోరలిస్, లేస్ వింగ్ క్రిసో పేర్ల కార్నియా మరియు లేడీ బీటిల్ కొక్సినెల్ల సెప్టెంపుంక్టాటా ఈ సిల్లిడ్ ను ఆహారంగా తీసుకుంటాయి. వేప నూనె ఆధారిత కీటక నాశక సబ్బులు లేదా ఉద్యానవన నూనెలు కూడా వీటి జనాభాను నియంత్రించగలవు. కానీ పురుగులు తెల్లని రక్షణ మైనపు పూతను స్రవించక ముందు వీటిని వాడాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. డైమేథోయేట్ కలిగిన పురుగుల మందులను సమయోచితంగా పిచికారీ చేయడం వలన ఈ సిలిటీస్ పైన అవి బాగా ప్రభావం చూపుతాయి. కానీ వీటిని ఆఖరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలి. పురుగులు తెల్లని రక్షణ మైనపు పూతను స్రవించక ముందు ఈ పురుగుల మందులు వాడాలి. పురుగుల మందులు అధికంగా పిచికారీ చేయడం వలన ఈ సిల్లిడ్ మరియు ఇతర తెగుళ్లు తిరిగి విజృంభించే అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకోండి. బెరడుకు డైమేథోయేట్ పేస్ట్ (0.03%) పూయడం వలన చెట్టుపై పైకి క్రిందకి తెరిగే పెద్ద పుర్గుగులను నాశనం చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

డయాఫోరిన సిట్రి అని పిలవబడే సిట్రస్ సెల్లిడ్ తినడం వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. పెద్ద పురుగులు 3 నుండి 4 మిల్లీమీటర్లు పొడవు ఉండి గోధుమరంగు-నల్లని తల మరియు రొమ్ము భాగం, లేత గోధుమ రంగు పొట్ట మరియు పల్చని మచ్చల రెక్కలు కలిగివుంటుంది. శీతాకాలంలో ఇవి కాండం పగుళ్లలో లేదా ముదురు ఆకులలో జీవిస్తాయి. వీటి సగటు జీవిత కాలం ఉష్ణోగ్రతపైన ఆధారపడి ఉంటుంది. 20-30°C ఉష్ణోగ్రత వీటికి అనుకూలంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వీటి జీవిత కాలం మరింత పెరుగుతుంది. అదే సమయంలో వెచ్చని వాతావరణంలో వీటి జీవిత కాలం తగ్గుతుంది. వసంత కాలంలో ఆడ పురుగులు కొత్త చిగుర్లపైన మొగ్గలపైన 800 వరకు గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు సాధారణంగా చదునుగా పసుపు రంగులో ఉంటాయి. ఇవి వీటికి రక్షణగా వుండే తెల్లని మైనం వంటి ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ తెల్లని మైనం ఎదుగుదల లేదా దారాల వలన ఇవి పచ్చ పురుగుల నుండి వేరు చేస్తాయి. వీటిని కదిల్చినప్పుడు పెద్ద వాటితో పోలిస్తే పిల్ల పురుగులు కొద్దీ దూరం మాత్రమే వెళతాయి.కణజాలానికి నష్టం కలగడం వలన మొక్క అన్ని భాగాలకు పోషకాలు అందించలేదు.


నివారణా చర్యలు

  • వసంత ఋతువు మొదలైనప్పటినుండి సెల్లిడ్ చిహ్నాల కొరకు తోటలను క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • పెద్ద పురుగులను పట్టుకోవడానికి జిగురు ఉచ్చులను ఉపయోగించండి.
  • చెట్లమధ్యన సరిపడా అంతరాన్నిపాటించండి.
  • విస్తృత పరిధి కల పురుగుల మందులు వాడకుండా ఈ పురుగులను తినే కీటకాల జనాభా పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోండి.
  • చెట్ల మధ్యన సరిపడినంత గాలి మరియు సూర్యరశ్మి ప్రసరించేలా చూడండి.
  • సీజన్లో అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడకండి.
  • కరువు ( వర్షాభావ పరిస్థితులు) వత్తిడిని తగ్గించడానికి పొడి సీజన్లో మొక్కలకు క్రమం తప్పకుండ నీరు పెట్టండి.
  • పాత కొమ్మలను మరియు చెత్తను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి