నిమ్మజాతి

బ్రౌన్ సాఫ్ట్ స్కేల్

Coccus hesperidum

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • బ్రౌన్ సాఫ్ట్ స్కేల్స్ కాండం, ఆకులు, పచ్చ కొమ్మలు మరియు అప్పుడప్పుడు పండ్లను ఆహారంగా తీసుకుంటాయి.
  • ఇవి తినడం వలన ఆకులు పసుపు రంగులోకి మారడం మరియు తీవ్రమైన పరిస్థితులలో ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది.
  • స్కేల్స్ కన్నా సూటీ బూజు వలన పరోక్షంగా చాలా అధికంగా నష్టం కలుగుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

వీటి దాడి తీవ్రత మరియు నిమ్మ జాతిని బట్టి వీటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి (ముఖ్యంగా నిమ్మ మరియు గ్రేప్ ఫ్రూట్లను ఈ చీడ సులభంగా ఆశిస్తుంది). ఇవి సాధారణంగా నేలకు దగ్గర్లో వున్న కాండం, పచ్చని కొమ్మలు, ఆకులు మరియు అప్పుడప్పుడు పండ్లను తింటాయి. వీటి జనాభా బాగా ఎక్కువ వృద్ధి చెందేవరకు వీటివలన ప్రత్యక్షంగా నష్టం కలగదు. ఇవి తినడం వలన ఆకులు పసుపు రంగులోకి మారడం మరియు తీవ్రమైన పరిస్థితులలో ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది. ఇవి విసర్జించిన హనీడ్యూ కు సూటీ బూజు వలన తెగులు సంక్రమిస్తుంది. దీనివలన ఆకులు మరియు పండ్లు నల్లగా మారతాయి. దీనితో స్కేల్స్ కన్నా సూటీ బూజు వలన పరోక్షంగా చాలా అధికంగా నష్టం కలుగుతుంది. చెట్లు బలహీనపడడం వలన పండ్లు నిలబడకపోవడం మరియు పండ్ల పరిమాణం తగ్గడం జరుగుతుంది. C. హెస్పెరిడుం ఇది చాలా అరుదుగా చెట్లు చనిపోయేటట్టు చేస్తుంది కానీ చిన్న నిమ్మ చెట్ల ఎదుగుదల మరియు దిగుబడిపై ఇది ప్రభావాన్ని చూపుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పరాన్నజీవులైన మెటాఫీకస్ లుతీయులుస్, మైక్రోటెరిస్ నియట్నేరి, మెటాఫీకస్ హెల్వోలుస్, ఎన్సెర్టస్ spp., ఎన్కార్సియా సిట్రిన మరియు చీమలను తట్టుకునే కొక్కోఫాగస్ spp. వీటికి సహజ శత్రువులు. పరాన్న జీవి ఈగలు, లేస్ వింగ్స్ (క్రిసోప, క్రిసోపేర్ల) మరియు స్కూటీలిస్టా సేయనియ మరియు రైజోబియుస్ లోఫన్థాయ్ వంటి లేడీ బర్డ్ పెంకు పురుగులు వీటికి అత్యంత సాధారణ శత్రువులు. అధిక సాపేక్ష ఆర్ద్రత వున్నప్పుడు ఎన్టోమోపాథోజెనిక్ ఫంగి ( వెర్టిసిల్లీయం లేకన్నీ) మరియు స్టెయినెర్నెమ ఫిల్టఐ నెమటోడ్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మొక్కల నూనెలు/ కషాయాలు (ఉదాహరణకు పెరిత్రుమ్ లేదా ఫాటీ యాసిడ్లు) వంటి సేంద్రీయ పిచికారీలను వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బ్రౌన్ సాఫ్ట్ స్కేల్స్ నియంత్రణ చాలా కష్టం. క్లోర్ఫెరిఫోస్, కార్బరిల్, డైమేథోయేట్ లేదా మలాథియాన్ వీటి పైన బాగా ప్రభావం చూపుతాయి. చికిత్సను పూర్తి చేయడానికి నేరో రేంజ్ ఆయిల్ ను పిచికారీ చేయవచ్చు. సూటీ బూజు ను నిరోధించడానికి శీలింద్ర నాశినులు వాడవచ్చు. వీటి సహజ శత్రువులకు నష్టం కలగకుండా చూడడానికి అధిక మోతాదులో పురుగుల మందులను వాడకండి.

దీనికి కారణమేమిటి?

కోకుస్ హేస్ప్రిడుమ్ అని పిలువబడే బ్రౌన్ సాఫ్ట్ స్కేల్ తినడం కారణంగా ఈ లక్షణాలు కలుగుతాయి. సాధారణంగా ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో మరియు గ్రీన్ హౌస్ లో సంక్రమించే నిమ్మ జాతి చెట్ల తెగులు. వేసవి మధ్యలో నుండి శరదృతువు వరకు వీటి ఉదృతి బాగా అధికంగా ఉంటుంది. మగ కీటకాలు రెండు రెక్కల కందిరీగలు లేదా ఈగల వలే ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇవి చాలా అరుదుగా కనపడతాయి. ఆడ కీటకాలు కోలగా ఉండి చదునుగా మృదువుగా ఉంటాయి. ఇవి ఆకుల క్రిందిభాగానికి అంటుకుని ఉంటాయి. ఇవి పరిణితి చెందే సమయంలో అవి పచ్చరంగు నుండి గోధుమరంగుకు మారతాయి. ఇవి ఒక ఛాంబర్ వంటి ప్రాంతంలో వాటి గుడ్లను పెడతాయి. అక్కడనుండి బాగా చిన్నగా వుండే పాకుతూ వుండే క్రిములు ఆహారం తీసుకోవడానికి అనుకూలంగా వుండే కొమ్మలు, ఆకుల మధ్య ఈనెలు లేదా పండ్ల కొరకు వెతుకుతాయి. ఇవి గాలి వలన కూడా చుట్టూ ప్రక్కల చెట్లపైకి చేరి ఈ చీడను మరింత వ్యాపింపచేస్తాయి.


నివారణా చర్యలు

  • గ్రీన్ హౌస్ మరియు పొలంలో వేసేముందు అన్ని ఈ స్కేల్స్ కొరకు మొక్కల పదార్ధాలను పరిశీలించండి.
  • మీ తోటలను క్రమం తప్పకుండా స్కేల్స్ కొరకు గమనిస్తూ ఇవి తక్కువ మొత్తంలో వున్నప్పుడు గీరడం ద్వారా తొలగించండి.
  • బాగా అధికంగా తెగులు సంక్రమించిన ఆకులు మరియు కొమ్మలను తొలగించి కాల్చివేయండి.
  • ఈ స్కేల్స్ వృద్ధి చెందడానికి తోడ్పడని వాతావరణం కల్పించే విధంగా, గాలి బాగా ప్రసరించడానికి వీలుగా చెట్లను కత్తిరించండి.
  • ఈ స్కేల్ కు సహాయకారులుగా వుండే చీమలను అడ్డుకోవడానికి కాండం మరియు కొమ్మల చుట్టూ అడ్డంకులు మరియు ఉచ్చులు ఏర్పాటుచేయండి.
  • ప్రయోజనకరమైన కీటకాలను ప్రభావితం చేసే విస్తృత పరిధి కల పురుగుల మందులను వాడకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి