వేరుశనగ

వేరుశనగ కాయ తొలుచు పురుగు

Caryedon serratus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • గింజల్ని తినడాన్ని ప్రారంభించే లార్వా గింజల్లో చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంది.
  • పెద్ద బీటిల్ కాయల్లో పెద్ద పరిమాణంలో రంధ్రాలు చేస్తాయి.
  • పొలంలో మరియు నిల్వ చేసినప్పుడు, కీటకాలు కాయలపై దాడి చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వేరుశనగ

లక్షణాలు

తెగులు సోకింది అనేదానికి ప్రాధమిక సాక్ష్యం రంధ్రాల నుండి లార్వా ఆవిర్భావం మరియు కాయల వెలుపల గూళ్ళు ఉండటం. తెగులు సోకిన కాయలను తెరిచినప్పుడు సాధారణంగా విత్తనాలపై కనిపించే నష్టం ఉండదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వేరుశనగ గింజలను వేప విత్తన పొడి లేదా నల్ల మిరియాలు పొడితో చికిత్స చేయండి. మీరు వేప నూనె, పొంగమియా నూనె లేదా యూకలిప్టస్ నూనెతో కాయలకు చికిత్స చేయవచ్చు. కాయలను గాలి సోకని పాలిథిన్ సంచులలో లేదా గాల్వనైజ్డ్ మెటాలిక్ / పివిసి విత్తన డబ్బాలలో నిల్వ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మిథైల్ బ్రోమైడ్‌తో 32 గ్రా / m³ తో 4 గంటల పాటూ ఫ్యుమిగేషన్ చేయండి. క్లోర్‌పైరిఫోస్ విత్తన చికిత్స @ 3 గ్రా / కేజీ, మలాథియాన్ 50 ఇసి @ 5 ఎంఎల్ / ఎల్, గిడ్డంగుల గోడలపై, అలాగే బ్యాగ్‌లపై కూడా 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయండి. సంచులపై డెల్టామెత్రిన్ 0.5 మి.లీ / ఎల్ పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

పెద్ద గోధుమరంగు బీటిల్ (సి. సెరాటస్) యొక్క లార్వా వల్ల నష్టం జరుగుతుంది. పెద్ద పెంకు పురుగులు కాయ వెలుపల గుడ్లు (చిన్న మరియు అపారదర్శక)పెడతాయి. పొదిగిన తరువాత, చిన్న లార్వా గుడ్డు నుండి కాయ గోడకు నేరుగా రంధ్రం చేస్తుంది. ఇది పరిపక్వత చెందే వరకు గింజ నుండి వచ్చే మొదటి ఆకులను తింటుంది. అప్పుడు పెద్ద పెంకు పురుగు కాయల్లో పెద్ద రంధ్రం చేస్తుంది. పెద్ద బీటిల్ కోలాకారంలో, గోధుమ రంగులో ఉంటుంది మరియు సాధారణంగా 7 మిమీ పొడవు ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులలో, దీని జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి 40-42 రోజులు పడుతుంది. 30-33°C ఉష్ణోగ్రత వద్ద ఈ పెంకు పురుగులు వృద్ధి చెందుతాయి.


నివారణా చర్యలు

  • CMV10, GG3 మరియు ఇతరులు నిరోధక రకాలను పండించండి, వీటిని బ్రూచిడ్లు తక్కువగా ఇష్టపడతాయి.
  • పగిలిన లేదా దెబ్బతిన్న విత్తనాలను పారవేయడం ద్వారా ద్వితీయ తెగుళ్ళ దాడులను తగ్గించండి.
  • పొలంలోనే దిగుబడిని పోగుపెట్టడం మానుకోండి.
  • పరిపక్వత యొక్క సరైన దశలో వేరుశనగ పంటను కోయండి.
  • విత్తనాలను ఎండబెట్టడం ద్వారా సురక్షితమైన స్థాయికి తేమను (సాధారణంగా 10% కంటే తక్కువ తేమకు) తగ్గించండి.
  • స్టోరేజ్ నిర్మాణాలను శుభ్రపరచి ఫ్యుమిగేట్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి