వేరుశనగ

వేరుశెనగలో ఆకు చార తెగులు

Aproaerema modicella

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల ఎగువ భాగాలలో తవ్వినట్టు వున్న ఆకులు మరియు ఆకులపై చిన్న గోధుమ పొక్కు రంగు మచ్చలు.
  • తీవ్రంగా ప్రభావితమైన పొలం దూరం నుండి కాలిపోయినట్లు కనిపిస్తుంది.
  • ఆకులు ముడుచుకుపోతాయి.

లో కూడా చూడవచ్చు


వేరుశనగ

లక్షణాలు

ఆకు లోపలి భాగం (మెసోఫిల్‌)ను ఆహారంగా తినడం వలన లోపల తవ్వినట్టు మరియు ఆకుపై చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. లార్వా ఆకులను ఒకదానితో ఒకటి కలుపడమే కాక వాటిని తింటుంది. మిగిలిపొయినది మడతలలో ఉండిపోతుంది. దూరం నుండి చూస్తే, తీవ్రంగా దాడికి గురైన పొలాలు కాలిపోయినట్లు కనిపిస్తాయి. ప్రభావిత ఆకులు ఎండిపోయి మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఒక హెక్టారుకు 50000 ట్రైకోగ్రామా చిలియోనిస్ ను 7-10 రోజుల మధ్య విరామంలో రెండుసార్లు పొలంలో వేయండి. సాలెపురుగులు, పొడవు కొమ్ముల మిడత, ప్రేయింగ్ మాంటిస్, చీమలు, లేడీబర్డ్ బీటిల్స్, మిడుతలు వంటి సహజ జీవ నియంత్రణ కీటకాల జనాభాను పరిరక్షించండి. వరి గడ్డితో కప్పడం ప్రాక్టీస్ చేయండి, ఇది ఆకు మైనర్ సంభావ్యతను తగ్గిస్తుంది. పరాన్నజీవి గోనియోజస్ ఎస్.పి.పి వృద్ధి చెందేటట్తు పెంచడానికి సజ్జలను అంతర పంటగా వేయండి.

రసాయన నియంత్రణ

మొలకల దశలో (DAE) మొలకలు వచ్చిన 30 రోజుల తరువాత కనీసం 5 లార్వాలు అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వున్నప్పుడు, లేదా పూత దశలో 10 లార్వాలు (50 DAE), మరియు కాయ నిండే దశలో (70 DAE) ఒక మొక్కకు 15 లార్వాలు ఉండడం గమనించినప్పుడు మాత్రమే రసాయన స్ప్రేలు సిఫార్సు చేయబడతాయి.

దీనికి కారణమేమిటి?

లార్వా ఆకు చారల వలన వేరుశనగకు నష్టం కలుగుతుంది.ఆకు చారల గుడ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి మరియు ఆకుల క్రింది భాగంలో ఒకొక్కటిగా పెట్టబడతాయి. లార్వా లేత ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ముదురు తల మరియు ప్రోథొరాక్స్‌తో ఉంటాయి. పెద్ద ఆకు మైనర్ 6 మి.మీ పొడవు ఉంటుంది. దీని రెక్కలు గోధుమ-బూడిద రంగులో ఉంటాయి. పెద్ద పురుగులు వాటి ముందు రెక్కలపై తెల్లని చుక్కలు ఉంటాయి. లార్వా ఆకుల లోపల తవ్వి ఆకుల లోపల భాగాన్ని తింటుంది. ఇవి 5-6 రోజుల తరువాత గని నుండి బయటకు వచ్చి, తినడానికి మరియు ప్యుపాగా మారడానికి ప్రక్క ఆకులకు వలసపోతాయి. ఆకులోని గని ప్రాంతాలు ఎండిపోతాయి. వర్షాకాలం, ఆ తర్వాత పంటలలో ఆకు మైనర్లు చురుకుగా ఉంటాయి మరియు నష్టాలు 25% నుండి 75% వరకు ఉండొచ్చు.


నివారణా చర్యలు

  • ఆలస్యంగా వచ్చే తెగుళ్ల ముట్టడి నుండి తప్పించుకోవడానికి ముందుగానే నాటండి.
  • సజ్జలు లేదా అలసంద వంటి ఉచ్చు పంటలను అంతర పంటగా వేయండి.
  • వేరుశనగ.
  • మొక్కజొన్న, పత్తి, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి ప్రాక్టీస్ చేస్తే మంచి దిగుబడి లభిస్తుంది మరియు ఆకు చారల సంభవం తగ్గుతుంది.
  • రాత్రి వేళల్లో చిమ్మటలను ఆకర్షించడానికి మరియు తెగుళ్ల జనాభాను పర్యవేక్షించడానికి దీపపు ఉచ్చులను ఉపయోగించండి.
  • తెగులు పెరుగుదలను నియంత్రించడానికి సోయాబీన్ మరియు అల్ఫాల్ఫా, తోటకూర, బెర్సీమ్ మరియు ఇండిగోఫెరా హిర్సుటా వంటి కలుపు మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి