వేరుశనగ

కాళహస్తి మాలడీ

Bitylenchus brevilineatus

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • పాలిపోయిన కాయలు.
  • మందగిందిన ఎదుగుదల.
  • పొట్టిగా మారిన మరియు రంగు కోల్పోయిన కాడలు.
  • మొక్కల పెరుగుదల సరిగా లేకపోవడం, కాయ పరిమాణం తగ్గడం, కాయల పైతొక్క గోధుమ- నలుపు రంగులోకి మారడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వేరుశనగ

లక్షణాలు

కాయలు సాధారణంగా వుండే పరిమాణం కన్నా చిన్నగా ఉండి, చిన్న గాయాలతో గోధుమ-నలుపు రంగులో ఉంటాయి. గాయాలు కలిసిపోయి కాయ ఉపరితలం యొక్క మూడొంతుల భాగాన్ని కప్పివేస్తాయి. కాయ కాడలు కూడా రంగు పాలిపోయి కుదించబడతాయి. ప్రభావిత మొక్కలు కుంగిపోయినట్లు కనిపిస్తాయి మరియు సాధారణ ఆకుల కంటే పచ్చగా ఉంటాయి. చిన్న గోధుమ పసుపు గాయాలు మొదట కాయ కాడలపై మరియు వృద్ధి చెందుతున్న కాయలపై కనిపిస్తాయి. కాయ కాడలు తగ్గుతాయి. తరువాత కాయ ఉపరితలం రంగు పూర్తిగా పాలిపోతుంది. ఈ వ్యాధి సోకిన మొక్కలు పాచెస్‌లో కనిపిస్తాయి. ఇవి కుంగిపోతాయి మరియు సాధారణ ఆకుల కంటే పచ్చగా ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ తెగులుకు వ్యతిరేకంగా జీవ నియంత్రణ నియంత్రణ పద్ధతి గురించి ఈ రోజు వరకు మాకు తెలియదు. సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మట్టిలో కార్బోఫ్యూరాన్ 3 జి (4 కెజి /హెక్టార్) ను వర్తింపజేయడం ద్వారా టైలెన్‌కోరిన్చస్ బ్రీవిలినాటస్ జనాభాను తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధికి సాధారణ ఏజెంట్ నెమటోడ్, టైలెన్‌చోర్హైంచస్ బ్రీవిలినియాటస్. ఇసుక నేలల్లో ఈ వ్యాధి చాలా తీవ్రత చాలా అధికంగా ఉంటుంది.ఈ వ్యాధి పంట దిగుబడి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే, నిరోధక రకాలైన కదిరి-3, తిరుపతి 2 మరియు తిరుపతి 3 (ప్రసున్న)లను వాడండి.
  • పచ్చ ఎరువును మరియు సేంద్రియ ఎరువును మట్టిలో కలపండి.
  • అధిక ఉష్ణోగ్రత వుండే వేసవి నెలలలో భూమిని కనీసం 20 సెంటీమీటర్ల లోతు వరకు దున్నండి.
  • మట్టిని సూర్య రశ్మికి బహిర్గతం చేయడం వలన నెమటోడ్లు చనిపోతాయి.
  • ఈ పద్దతిని వేసవిలో పొలాన్ని బీడు పెట్టడం ద్వారా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
  • మీ పొలంలో బియ్యం లేదా జొన్న మరియు మొక్కజొన్న వంటి ఇతర తృణధాన్యాల పంటలతో పంట భ్రమణాన్ని పరిగణలోకి తీసుకోండి.
  • అఫెలెన్‌కోయిడ్స్ అరాకిడిస్ మరియు బెలోనోలైముస్లోంగికాడటస్ ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి దిగ్బంధం (క్వారంటైన్) నిబంధనలను ఖచ్చితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి