దోసకాయ

గుమ్మడికాయ గొంగళి పురుగు

Diaphania indica

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పట్టులాంటి దారాలతో చుట్టబడిన ఆకులు.
  • తీవ్రంగా నష్టం వాటిల్లినప్పుడు వృద్ధి చెందుతున్న పండ్లలో రంధ్రాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

7 పంటలు

దోసకాయ

లక్షణాలు

లేత లార్వా ఆకులపైన గీరి ఆకుల నుండి క్లోరోఫిల్ పోయేటట్టు చేస్తుంది. తరువాత, ఇది ఆకులను మడతపెట్టి, గూడు కట్టుకుంటుంది. వృద్ధి చెందుతున్న పండ్లు మరియు పూలు కూడా ఈ గొంగళి పురుగులు దాడి చేస్తాయి. ఇవి పండు పై తొక్కను దెబ్బతీసి పండ్లు కుళ్ళిపోయేటట్టు చేస్తాయి. ఇవి గీరడం వలన తరువాతి దశల్లో ఆకులు ఎండిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

గొంగళి పురుగులను సేకరించి నాశనం చేయండి. బాసిల్లస్ తురింజెన్సిస్ మరియు బ్యూవేరియా బస్సియానా వంటి జీవ పురుగుమందులను వాడండి. వేప, డెరిస్, పైరెథ్రమ్ మరియు మిరప వంటి మొక్కల నుంచి తయారు చేసిన ఉత్పత్తులను వాడండి. అపాంటెలిస్ ఎస్ పి పి వంటి పరాన్నజీవుల చర్యను ప్రోత్సహించండి. వీటిని నివారించడానికి నీరు మరియు గోమూత్రం యొక్క పలుచన చేసిన మిశ్రమాన్ని పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సైంట్రానిలిప్రోల్ కలిగిన పురుగుమందులను పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

గొంగళి పురుగుకు చెందిన చిన్న లార్వా వలన నష్టం జరుగుతుంది. పెద్ద గొంగళి పురుగు ముదురు విస్తృతమైన మార్జినల్ ప్యాచీలతో పారదర్శకమైన తెల్లటి రెక్కలను కలిగి ఉంటుంది మరియు ఆడ పురుగులు వాటి ఆసనం చివర్లో నారింజ రంగు వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఆకుల దిగువ భాగంలో, 3-4 రోజుల వరకూ, ఒక్కొక్కటిగా లేదా సమూహంగా గుడ్లు ఉంచబడతాయి. సాధారణంగా గొంగళి పురుగులు వెన్ను వెంబడి రెండు చారలతో సాగినట్టు పొడుగుగా కనిపిస్తుంది. 10 రోజుల్లో గొంగళి పురుగు యవ్వన దశకు చేరుకుంటుంది.


నివారణా చర్యలు

  • ఈనెల మధ్యలో వున్న ఆకు భాగాలను తిని ఈనెలను మాత్రమే మిగిలిన ఆకుల ఉనికి కోసం లేత ఆకులను గమనించండి.
  • ఆకుల మధ్యలో వీటి విసర్జన పదార్ధాల కోసం చూడండి.
  • ప్రారంభ దశ గొంగళి పురుగులను సేకరించి నాశనం చేయండి.
  • చుట్టుకుపోయిన ఆకుల కోసం తనిఖీ చేయండి, వాటిని తొలగించండి లేదాలోపల వున్న గొంగళి పురుగులను చంపడానికి వాటిని నలిపివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి