ప్రత్తి

వెడల్పు ముక్కు కలిగిన ముక్కు పురుగులు

Myllocerus sp.

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • వంకర్లు తిరిగిన ఆకు అంచులు.
  • మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది.
  • పెద్ద ముక్కు పురుగుల రెక్కలు మరియు తల పైన ముదురు నమూనాలతో కూడిన లేత బూడిదరంగు మచ్చలు ఉంటాయి.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

వంకర్లు తిరిగిన ఆకు అంచులు ఈ పత్తి బూడిద ముక్కు పురుగు చేత ముట్టడి యొక్క మొదటి కనిపించే లక్షణాలు. పెద్ద ముక్కు పురుగుల కొత్త మొక్కల అంచులను తిని మొక్కల లోపలి భాగాలకు వెళ్ళడానికి ఇష్టపడతాయి. ఈ తెగులు తీవ్రంగా సోకిన ఆకులు పూర్తిగా రాలిపోవచ్చు. ఆరోగ్యకరమైన మొక్కలు ఈ పురుగులు తిన్న నష్టం నుండి కోలుకుంటాయి కాని పుష్పించే సమయంలో చిన్న మొలకలు చనిపోతాయి. ఈ తెగులు తీవ్రమైన పరిస్థితుల్లో మొక్కల పెరుగుదల పరిమితం చేస్తుంది. ప్రభావిత మొక్కలను సులభంగా బయటకు తీయవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మట్టిని ఒక లీటరు నీటికి 2.5 మి.గ్రా బాసిల్లస్ తురింజెన్సిస్ ఎస్.ఎస్.పి టెనెబ్రియోనిస్ (బిటిటి) తో తడపండి. ఈ బ్యాక్టీరియాను రూట్ టిప్ పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ మొక్క యొక్క వేర్లను బి టి టి ద్రావణంలో ముంచి, మట్టిలో తిరిగి నాటడానికి ముందు వాటిని గాలిలో ఆరబెట్టండి. లార్వా యొక్క మరణం తేమ మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. చివరి సారి పొలాన్ని దున్నే సమయంలో హెక్టారుకు 500 కిలోల వేప కేక్ వేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గుడ్లు, లార్వా మరియు ప్యుపాలు మట్టిలో ఉండడం వలన పత్తి బూడిద ముక్కు పురుగులను రసాయన చికిత్స పరిమితంగానే పనిచేస్తుంది. పెద్ద ముక్కు పురుగులు ఎగరడం, దాకోవడం మరియు చనిపోయినట్టు నటించడం వలన వాటిని నిర్మూలించడం కష్టం. రసాయనిక మందులకు ఇవి నిరోధకతను పెంచుకోవడం వలన సమస్యలు ఉత్పన్నమౌతాయి. విత్తిన 20 రోజులలో మీరు క్వినాల్ఫోస్ లేదా క్లోర్‌పైరిఫోస్, డైమెథోయేట్ పిచికారీ చేయవచ్చు లేదా ఇసుకతో ఫోరేట్ లేదా కార్బరిల్ గుళికల మిశ్రమాన్ని వ్యాప్తి చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

మైలోసెరస్ ఎస్ పి పి ఎస్పిపి యొక్క పెద్ద పురుగులు మరియు అప్పుడే బైటకి వచ్చిన పిల్ల పురుగులు వలన ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. పెద్ద ముక్కు పురుగులు చిన్న మరియు లేత బూడిద రంగులో వుంటాయి, వాటి రెక్క కవర్లు మరియు తలపై ముదురు నమూనాలు ఉంటాయి. ఆడ పురుగులు 24 రోజుల వ్యవధిలో మట్టిలో సగటున 360 గుడ్లు పెడతాయి. పొదగబడిన తర్వాత వీటి లార్వా మట్టిలోనికి బొర్రెలు చేసి మట్టిలో ప్రవేశించి మొక్కల వేర్లను ఆహారంగా తింటాయి. తర్వాత ఇవి మట్టిలోనే ప్యూపా దశకు చేరుకుంటాయి. పెద్ద ముక్కు పురుగులు శీతాకాలంలో పంట అవశేషాల క్రింద మనుగడ సాగిస్తాయి. ఈ మైలోసెరస్ మైలోసెరస్ ఎస్ పి పి అలంకార, కూరగాయలు మరియు పండ్ల జాతులను అతిధి మొక్కలుగా కలిగి ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉన్న నిరోధక రకాలను ఉపయోగించండి.
  • ముందు జాగ్రత్త కోసం కొత్త ఆకులు పెరగడం ప్రారంభించినప్పుడు పంటలను పర్యవేక్షించండి మరియు గుర్తించండి.
  • తరచూ హూయింగ్ చేయడం వాటిని భగ్నపరుస్తుంది మరియు గుడ్ల నుండి వచ్చే క్రిములను చంపవచ్చు.
  • కంది మొక్కలను ఉచ్చు పంటగా నాటడం ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని వర్గాలు నివేదించాయి.
  • చెట్టు / కొమ్మలను కదిలించి, సబ్బు నీరు వున్న డబ్బాలో ఉంచడం ద్వారా పెద్ద ముక్కు పురుగులను తొలగించవచ్చు.
  • ప్రభావిత మొక్కలు / కొమ్మలను తొలగించి వాటిని నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి