మామిడి

మామిడి లీఫ్ వెబ్బెర్

Orthaga euadrusalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై గీకినట్లున్న ఉపరితలాల స్వరూపం.
  • లేత రెమ్మలు మరియు ఆకులు కలవడం.
  • ఆకులు పొడి మరియు గోధుమ రంగులో కనిపిస్తాయి.
  • నలుపు మరియు తెలుపు లైన్లతో ఆకుపచ్చ లార్వా.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు ఆకులపై ఎక్కువగా కనిపిస్తాయి. ఈనెల మధ్య పై ఉపరితలాన్ని గీకడం ద్వారా లార్వా లేత ఆకులపై తింటాయి. అప్పుడు అవి ఈ ఆకులను విపరీతంగా తినిపిస్తాయి, మధ్యభాగం మరియు సిరలను వదిలివేస్తాయి. ఇది పొడి, బూజు మరియు వాడిపోయిన ఆకుల సమూహాలకు దారితీస్తుంది. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు చిగుర్లు పొడిగా మారతాయి. అందువలన కిరణజన్య సంయోగక్రియ పరిమితం అవుతుంది. ప్రభావిత చెట్లు అనారోగ్యంగా కనిపిస్తాయి మరియు వాటి గోధుమ రంగు, ఎండిన మరియు సమూహంగా వున్న ఆకుల కారణంగా సులభంగా గుర్తించవచ్చు. పుష్పాల కాడ ఏర్పాటు ప్రభావితమవుతుంది, అందువలన పుష్పించడం మరియు పండ్లు తయారయ్యే ప్రక్రియలు ప్రభావితం అవుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బ్రాచిమెరియా లాసస్, హార్మియస్ ఎస్పి వంటి ఆకు వెబ్బెర్ పరాన్నజీవుల సహజ శత్రువులను ఉపయోగించండి. పెడియోబియస్ బ్రూసిడా, మరియు కారాబిడ్ బీటిల్ మరియు రిడ్యూవిడ్ బగ్ వంటి సహజ శత్రువులు కూడా ఉపయోగ పడతాయి. అత్యధిక తేమ ఉన్న కాలంలో బవేరియా బస్సియానాను రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ ఎంచుకోండి. క్వినాల్ఫోస్ (0.05%) తో 15 రోజుల విరామంలో మూడు స్ప్రేలు సిఫార్సు చేయబడ్డాయి. లాంబ్డా-సైహలోత్రిన్ 5 ఇసి (2 మి.లీ/లీటరు నీరు) లేదా క్లోసోపైరిఫోస్ (2 మి.లీ/ఎల్), అస్ఫేట్ (1.5 గ్రా/ఎల్) ఆధారంగా రసాయనాలను పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

ఆర్థాగా యుడ్రుసాలిస్ యొక్క లార్వా వల్ల నష్టం జరుగుతుంది. ఆడ చిమ్మటలు మామిడి ఆకులపై పసుపు ఆకుపచ్చ నిస్తేజమైన-రంగు గుడ్లను పెడతాయి, ఇవి సాధారణంగా వారంలోనే పొదుగుతాయి. సాధారణంగా ఐదు లార్వా దశలు ఉన్నందున, వాతావరణ పరిస్థితులను బట్టి, లార్వా కాల వ్యవధి 15 నుండి 30 రోజుల మధ్య ఉండవచ్చు. చివరి దశ తరువాత, గూడులోని లార్వా ప్యూపా దశకు చేరి ఒక కుదుపుతో నేలపై పడి మట్టిలో ఈ ప్రక్రియను కొనసాగిస్తాయి. ఉష్ణోగ్రతని బట్టి ప్యూపా దశ 5 మరియు 15 రోజుల మధ్య రోజుల మధ్య ఉండవచ్చు. దట్టంగా నాటిన తోటలు సాధారణ-అంతరం మరియు పందిరి నిర్వహించే తోటల కంటే ఎక్కువ ముట్టడి రేటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఏప్రిల్ నెల నుండి మొదలై డిసెంబర్ వరకు ఈ తెగులు సంక్రమణ కొనసాగుతుంది. సాపేక్ష ఆర్ద్రతతో ఆకు వెబ్బర్ జనాభా గణనీయంగా సంబంధం కలిగి ఉంటుంది.


నివారణా చర్యలు

  • నెలకు ఒకసారి పండ్ల తోటను పర్యవేక్షించండి.
  • వ్యాధి సోకిన రెమ్మలను తొలగించి వాటిని కాల్చండి.
  • కలిసిపోయిన, వ్యాధి సోకిన ఆకులను తొలగించడానికి చెట్ల పునాది చుట్టూ మట్టిని కలియపెట్టండి.
  • ఒక విధంగా చెట్టు పందిరి అన్ని వైపుల నుండి తెరిచి ఉండేలాగ, తగినంత గాలి మరియు సూర్యరశ్మిని అనుమతించేందుకు వీలుగా దట్టమైన పండ్ల తోటలను కత్తిరించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి